Big Stories

AI:- ఏఐ వల్ల ఆర్థిక లాభాలు.. కానీ..

AI:- ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అనేది టెక్నికల్ ప్రపంచాన్ని సరికొత్తగా మార్చేసింది. గత కొన్ని నెలలుగా టెక్నాలజీ రంగంలో ఎక్కడ చూసినా దీని పేరే. కేవలం టెక్నాలజీ రంగంలోనే కాకుండా ఎకానమీ, పెట్టుబడులు విభాగాల్లో కూడా ఏఐ అనేది మానవాళికి సాయం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీని శాసిస్తున్న ఏఐ అసలు పెట్టుబడుల విషయంలో ఎలాంటి సాయం చేస్తుంది అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఏఐ అనేది ఒక డిజిటల్ కంప్యూటర్‌తో సమానం. సింపుల్‌గా చెప్పాలంటే కంప్యూటర్‌తో కంట్రోల్ అయ్యే రోబోలాంటిదే ఏఐ. ఇది మనుషులకు బాగా ఉపయోగపడి, చెప్పింది చేసే ఒక రోబో లాగా తయారయ్యింది. ఇప్పటికే చాలామంది స్టాక్ ట్రేడింగ్, ఇన్వేస్ట్‌మెంట్ వంటి విషయాల్లో ఏఐను సాయంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడుల రంగంలో ఏఐ చేస్తున్న సాయం లాభాలు తెచ్చిపెడతున్నాయని అనుభవం ఉన్నవారు చెప్తున్నారు. ఏఐ ఇస్తున్న రియల్ టైమ్ సమాచారం ప్రకారం ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు తెచ్చిపెడుతున్నాయన్నారు.

- Advertisement -

రోజూ ట్రేడింగ్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి స్టడీ చేస్తే ఏఐ కూడా ట్రేడింగ్ విషయంలో సలహాలు ఇచ్చి, పెట్టుబడుల విషయంలో లాభాలు తెచ్చిపెడుతున్నాయని తెలుస్తోంది. ఏఐ మీద ఆధారపడి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే.. నష్టాల బారిన పడే రిస్కులు తగ్గిపోతున్నాయని స్టడీలో తేలింది. ప్రస్తుతం నిపుణులు ఈ విభాగంలో ఏఐతో పలు ప్రయోగాలు చేయడానికి సిద్ధపడ్డారు. ఎలాంటి పరిస్థితుల్లో ఏఐ ఎలాంటి సలహాలు ఇస్తుంది, ఎలా ఇది యూజర్లకు సాయంగా నిలబడుతుంది అనే విషయంలో క్షుణ్ణంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

మామూలుగా తమ డేటాను పూర్తిగా ప్రైవసీలో పెట్టకుండా కస్టమర్లకు అందించే కంపెనీల డేటాను ఏఐను స్టడీ చేయగలుగుతుంది. అలాంటి డేటా ఏఐకు అందకపోతే మాత్రం పెట్టుబడుల విషయంలో ఏఐ ఎలాంటి సాయం చేయడం కుదరదు అని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఫెస్‌బుక్, అల్ఫాబెట్, విసా లాంటి సంస్థల పెట్టుబడుల విషయంలో ఏఐ సహాయం అందడం కష్టమని తేల్చారు. కానీ డేటా ఉంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనాలసిస్ విషయం ఏఐపై ప్రయోగాలు సక్సెస్‌ఫుల్ అయ్యాయని పరిశోధకులు బయటపెట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News