E-Paper
Advertisement

Cyber Crime : పాపం.. PM కిసాన్ కోసం ఆశపడితే ఏకంగా లక్షలే పోయాయి!

Cyber Crime : పాపం.. PM కిసాన్ కోసం ఆశపడితే ఏకంగా లక్షలే పోయాయి!
Advertisement

Cyber Crime : రోజు రోజుకి పెరిగిపోతున్న స్కామ్స్ తో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ.. ప్రతీ రోజు ఎక్కడో ఒకచోట ఇలాంటి మోసాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి వాట్సప్ లో వచ్చిన ఒక లింక్ ఓపెన్ చేయటంతో లక్షల్లో పోగొట్టుకున్నాడు.

వాట్సాప్ సందేశం ద్వారా పీఎం కిసాన్ పథకం కింద ప్రయోజనాలను అందజేస్తామని వచ్చిన ఓ లింక్ ఓపెన్ చేయటంతో ఓ వ్యక్తి భారీ స్కామ్ లో ఇరుక్కున్నాడు.  బాధితుడు ఓటీపీని షేర్ చేసి, స్కామర్‌లకు తన బ్యాంక్ ఖాతాకు యాక్సెస్ ఇవ్వటంతో ఈ స్కామ్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ కేసుపై పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. ఏవైనా లింక్స్ క్లిక్ చేసే ముందు వాటిని ధృవీకరించాలని మరోసారి స్మార్ట్ యూజర్స్ కు హెచ్చరించారు.

Advertisement

హైదరాబాద్‌కు చెందిన 53 ఏళ్ల వ్యక్తి వాట్సాప్ మెసేజ్‌లో మోసపూరిత లింక్ రావడంతో స్కామ్ కు గురయ్యాడు. ఓల్డ్ సఫిల్‌గూడలో నివాసం ఉంటున్న ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న బాధితురాలికి పీఎం కిసాన్ స్కీమ్‌కు చెందినదిగా పేర్కొంటూ గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ లో లింక్ వచ్చింది. రైతులకు ఆర్థిక సహాయం అందించడంలో ప్రాధానంగా పనిచేసే PM కిసాన్ పథకం గురించి కొన్ని ప్రయోజనాలను సందేశంలో పొందుపరిచారు. దీంతో ఆ బాధితుడు నిజమైన లింక్ గా భావించి క్లిక్ చేశాడు. దీంతో ఆయన సైబర్ క్రైమ్ కు గురయ్యాడు.

ఈ లింక్ పిఎం కిసాన్ పథకంకు సంబంధించిందేనని నమ్మిన ఆ వ్యక్తి వాటికి సంబంధించిన మిగిలిన ప్రయోజనాలు తెలుసుకోవడానికి లింకును క్లిక్ చేయడమే కాకుండా ఆ వెబ్సైట్ ను సైతం ఓపెన్ చేశాడు. ఆపై వెబ్సైట్ ఇచ్చిన సూచనలు ఆధారంగా వన్ టైం పాస్వర్డ్ షేర్ చేశాడు. దీంతో స్కామర్స్ అతని ఖాతా నుంచి 1,9 లక్షలు కొట్టేశారు.

Advertisement

అకౌంట్లో డబ్బులు ఖాళీ అవటంతో గుర్తించిన బాధితులు వెంటనే తాను సైబర్ క్రైమ్ కు గురయ్యానని గ్రహించాడు. ఈ విషయంపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి సమాచారాలు వచ్చినప్పుడు నమ్మద్దని… వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని… గుర్తు తెలియని నెంబర్లనుంచి వచ్చిన లింక్స్ ఓపెన్ చేయొద్దని మరోసారి హెచ్చరించారు.

సైబర్ క్రైమ్స్ నుంచి ఎలా జాగ్రత్త పడాలంటే –

నిజానికి ప్రతీ చోటా ఇలాంటి సైబర్ క్రైమ్స్ జరుగుతూనే వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ యూజర్స్ కు ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.

ఏదైనా తెలియని నెంబర్ల మంచి లింక్స్ వచ్చినప్పుడు ఆ లింక్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు. అంతేకాకుండా వచ్చిన లింకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసిన తర్వాత మాత్రమే ఆ లింకును ఓపెన్ చేయాలి.

అంతేకాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్, ఈ మెయిల్, టెలిగ్రామ్ లో వచ్చే ఎలాంటి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదు. ఇది నకిలీ వెబ్సైట్లకు తీసుకువెళ్లే ప్రమాదం ఉంటుంది.

తెలియని వ్యక్తులతో బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఎలాంటి వివరాలను పంచుకోకూడదు. ఆకౌంట్ డీటెయిల్స్, పిన్ నెంబర్స్, వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకూడదు. ఎవరైనా తప్పుదారి పట్టించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ లో రిపోర్ట్ చేయాలి

ALSO READ : ఫోన్స్, ల్యాప్టాప్, వాచెస్, బ్లూటూత్స్ పై ఆఫర్సే ఆఫర్స్

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×