Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొణిదెల శివ శంకర్ వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన విధానం ఎంతో ఆదర్శనీయం. ఇక ఏ కొత్త హీరో ఇండస్ట్రీకి వచ్చినా.. చిరంజీవి ఇన్సిఫిరేషన్ తోనే వచ్చామని చెప్పుకొస్తారు. ఇక కుర్రాళ్లు.. చిరు వేసుకున్న డ్రెస్ వేసుకొని ఆయనలా ఫోజ్ లు కొడుతుంటారు. ఖైదీ నెం 150 సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన చిరు.. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 69 ఏళ్ల వయస్సులో కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్ర హీరోలకు షాక్ ఇస్తున్నారు.
ఇక ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు చిరు. బింబిసార సినిమాతో మంచి హిట్ అందుకున్న వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం చిరు తన మేకోవర్ ను మొత్తం మార్చేశారు. అంతకు ముందు కొంచెం బొద్దుగా ఉన్న చిరు.. విశ్వంభర కోసం బక్కచిక్కి కనిపించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమాల విషయం పక్కన పెడితే చిరు .. సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా కనిపిస్తారు.
ఏదైనా సినిమా నచ్చినా.. కొత్త సినిమాకు విషెస్ చెప్పాలనుకున్నా.. బర్త్ డే విషెస్ ఇలాంటివన్నీ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక పండగ వచ్చిందంటే చాలు.. మెగా కుటుంబంలో సందడే సందడి. అందులోనూ సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆ సందడి మరింత ఎక్కువ ఉంటుంది. అయితే ఈసారి ఆ సంక్రాంతి సందళ్ళు లేవు. అంతకు ముందు మెగా హీరోలందరూ కలిసి చిరు ఇంట చేరి భోగి మంటలు, చిరు దోసెలు అంటూ వీడియోలు షేర్ చేసేవారు.
2025 లో నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేస్తున్న తెలుగు సినిమాలు.. అన్ని పెద్దవే..
ఇప్పుడు అలా లేదు. వరుణ్ కు పెళ్లి అయ్యింది.. చరణ్ కు పాప పుట్టింది.. ఇలా ఎవరి ఇళ్లల్లో వారు సంక్రాంతి చేసుకుంటున్నారు. తేజ్ బ్రదర్స్, మంచు మనోజ్ కుటుంబంతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. వరుణ్ తేజ్.. తన భార్య లావణ్య తో కలిసి పండగ చేసుకున్నాడు. చరణ్.. తన భార్య, పాప క్లింకారతో పండగ జరుపుకున్నట్లు ఫోటోస్ పెట్టారు. తాజాగా చిరు సైతం సంక్రాంతి జరుపుకున్న ఫోటోలను షేర్ చేశారు. గ్రీన్ కలర్ కుర్తాలో ఎంతో అందంగా నిలబడి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
అసలు చిరును చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 69 ఏళ్ల వయస్సులో కూడా ఆ అందం, ముఖంలో ఆ కళ చూసి షాక్ అవుతున్నారు. ముఖ్యంగా బక్కచిక్కి కనిపించడంతో వింటేజ్ చిరును గుర్తుచేసుకుంటున్నారు. అల్లుడా మజాకా సినిమా సమయంలో బాస్ ఇలానే ఉండేవారని చెప్పుకొస్తున్నారు. ఎవరీ కుర్రోడు…. చిరంజీవి లా ఫోజ్ కొడుతున్నాడు అని కొందరు. పిల్లాడు కత్తిలా ఉన్నాడు.. పెళ్లి చూపులు చూడండి అని ఇంకొందరు.. ఎవరీ కుర్రాడు.. ఇండస్ట్రీకి కొత్తనా.. అచ్చు చిరంజీవిలా ఉన్నాడే అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.