Tamannaah: మిల్క్‌బ్యూటీ తమన్నా గురించి చెప్పనక్కర్లేదు. ట్రెండ్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవడంతో పాల పాపకు తెలిసినట్టు ఎవరికీ తెలీదు.

ఇండస్ట్రీలోకి వచ్చిన రెండు దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పుడొస్తున్న బ్యూటీలకు తాను ఏ మాత్రం తీసిపోనంటోంది. ఆ రేంజ్‌లో న్యూ కమ్మర్స్‌కు సవాల్ విసురుతోంది.

తమన్నా దూడుకు చూసి షాకవుతున్నవాళ్లు లేకపోలేదు. ఆమె అనుభవం ముందు.. గ్లామర్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలమా లేదా డౌట్ వ్యక్తం చేస్తున్నారు.

34 ఏళ్లు వచ్చినా తానింకా యంగ్ అంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది. అఫ్‌కోర్స్.. గ్లామర్ ఇండస్ట్రీ అంటే అంతే అనుకోండి. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది స్వింగ్ జర బ్యూటీ.

మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది.. అవుతోంది కూడా. అసలే పాల పాప.. దానికి తగ్గట్టుగా అందాల ఆరబోత. దీనికి తగ్గట్టుగా స్పెషల్ సాంగ్స్ చెప్పడం కంటే చూడడమే బెటర్.

అన్నట్లు కృష్ణాష్టమి సమీపిస్తున్న తరుణంలో పాల పాప తమన్నా మోడ్రన్ రాధా మాదిరిగా మిలమిల మెరిసిపోయింది. ఎప్పుడూ ఈ విధంగా షూట్ చేయడం లేదు.

మోడ్రన్ రాధా మాదిరిగా ఓ ఫోటోషూట్ చేసింది. ట్రెడిషనల్ డ్రెస్సులో అభిమానులను చూపు తిప్పుకోలేని విధంగా అందాలు ఆరబోయడంతో సోషల్‌మీడియాలో ఆమె ఫోటోలు గిరగిరా తిరిగేస్తున్నాయి.

తమన్నా స్టన్నింగ్ లుక్‌లో యువరాణి మాదిరిగా మెరిసిపోయింది. లోకేషన్‌కు తగ్గట్టుగా పింక్ బ్లౌజ్‌లో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

సింపుల్‌గా చెప్పాలంటే నావల్ల ఆ దుస్తులకు అందం వచ్చిందనే రీతిలో కనిపించింది. పురాణాల్లో రాధా ఏమోగానీ, కలియుగంలో రాధా సూపర్బ్ అంటున్నవాళ్లూ లేకపోలేదు.

దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో బెస్ట్ ఫోటోషూట్‌గా చెబుతోంది ఈ పాల పాప తమన్నా.