DeepSeek : డీప్ సీక్.. ప్రపంచంలో అత్యధిక డౌన్లోడ్స్ సాధించిన యాప్ గా నిలిచింది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, విస్తృత సేవలు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను అందించటంతో ఈ యాప్ అత్యధిక ప్రాధాన్యతను పొందింది. ఇక ఈ యాప్ ఇండియాలో సైతం అత్యధిక ఆదరణ పొంది 10మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ తో దూసుకుపోతోంది.
ఇండియాలో డీప్ సీక్ యాప్ డౌన్లోడ్‌లు గణనీయంగా పెరిగాయి. వినియోగదారుల అవసరాలను అనుగుణంగా ఫీచర్స్ తీసుకురావటంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న డిజైన్, హై కస్టమర్ సపోర్ట్ తో ఈ యాప్ విశేష స్పందనను పొందింది. అంతేకాకుండా, భారత్‌లో ఉన్న డిజిటల్ వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో DeepSeek యాప్ ఇండియాలో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఇండియాప్లే స్టోర్ లో 10 మిలియన్ డౌన్లోడ్స్ జరిగినట్లు సమాచారం. మొత్తం డౌన్‌లోడ్‌లలో భారతదేశం వాటా 15.6 శాతంగా ఉంది.
అంతర్జాతీయంగా కూడా ఈ యాప్ తన హవా చూపిస్తుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్న్యూర్‌షిప్ రంగాలలో ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తున్నందున ఈ యాప్ కు ప్రాధాన్యత పెరుగుతుంది.
డీప్ సీక్ హవా –
DeepSeek అనేది ఒక ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్. యూజర్స్ ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని శోధించడానికి, పలు అంశాలపై సమాచారం తెలుసుకోవటానికి సహాయపడుతుంది. ఇంగ్లీష్ భాషా దేశాలతో పాటు ఇండియా, యూరప్ దేశాల్లో డీప్ సీక్ అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో డౌన్లోడ్స్ పొందుతున్న యాప్ గా ప్రస్తుతం కాలంలో డీప్ సీక్ దూసుకుపోతుంది.
ఫీచర్స్ –
చైనా తీసుకువచ్చిన DeepSeek అనే AI ప్లాట్‌ఫామ్.. మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే ఒక యాప్. ఇది ప్రధానంగా డేటా అనాలిటిక్స్, విశ్లేషణలో సహాయపడుతుంది.
డేటా విశ్లేషణ : DeepSeek పెద్ద మొత్తంలో డేటాను విశ్లేషించి, దానినుంచి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. వ్యాపారాలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.
ప్రెడిక్టివ్ అనాలిటిక్స్ : ఈ యాప్ లో పాత డేటా ఆధారంగా భవిష్యత్తులో ఏమైనా సంఘటనలు లేదా పరిణామాలు ముందే అంచనా వేసుకోవచ్చు. ఇది వ్యాపార నిర్ణయాల ప్రక్రియలో కూడా ఉపయోగపడుతుంది.
సెల్ఫ్ లెర్నింగ్ : DeepSeek ప్లాట్‌ఫామ్ లో AI మెషీన్ లెర్నింగ్ ద్వారా సొంతంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. నిరంతరం కొత్త డేటాను గ్రహించే ఛాన్స్ ఉంటుంది.
సమస్యలకు పరిష్కారం వెతికే ఛాన్స్ : DeepSeek వివిధ రంగాలలో ఉన్న సమస్యలను అన్వేషించడానికి, పరిష్కారాలు వెతకటానికి సహాయపడుతుంది. వ్యాపార, ఆరోగ్య, విద్య, రవాణా, పర్యావరణం మొదలైన రంగాలలో ఉపయోగపడవచ్చు.
ఈ యాప్‌ను Google Play Store లేదా Apple App Store నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూజర్స్ రిజిస్టర్ అయ్యి.. తన అవసరాలకు అనుగుణంగా సమాచారం వెతకవచ్చు. రోజువారి జీవితంలో జరుగుతున్న విషయాలతో పాటు ఉద్యోగానికి సంబంధించిన పలు విషయాలపై డీప్ సీక్ సరైన సమాచారం అందిస్తుంది. ఇక రోజు రోజుకూ డీప్ సీక్ కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో డౌన్లోడ్స్ సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి.
ALSO READ : రూ. 20,000 లోపు బెస్ట్ కెమెరా మెుబైల్స్ కొనాలా? టాప్ ఆప్షన్స్ ఇవే