BigTV English

Smartphone market: సూపర్ షాట్ కొట్టిన స్మార్ట్ ఫోన్ ఏది? ఈ జాబితాలో మీ ఫోన్ ర్యాంక్ ఎంత?

Smartphone market: సూపర్ షాట్ కొట్టిన స్మార్ట్ ఫోన్ ఏది? ఈ జాబితాలో మీ ఫోన్ ర్యాంక్ ఎంత?

Smartphone market: 2025 రెండో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ మామూలుగా లేదు. ఎవరు ముందుకు దూసుకెళ్లారు? ఎవరు వెనకబడ్డారు? మీ ఫోన్ ఈ జాబితాలో ఎక్కడ ఉందో చూసి మీరు సర్ప్రైజ్ అవ్వొచ్చు. అసలు లీడర్ ఎవరో తెలిస్తే షాక్ కావడం ఖాయం. పూర్తి వివరాల్లోకి వెళితే..


2025 రెండో త్రైమాసికం ఏప్రిల్ – జూన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గణాంకాలు బయటకు వచ్చాయి. ఈ సారి పోటీ బాగా రగిలిందని చెప్పవచ్చు. కొత్త మోడల్స్, తగ్గించిన ధరలు, ఆఫర్లు, 5G సపోర్ట్, బ్యాటరీ లైఫ్, కెమెరా క్వాలిటీ.. అన్నీ వినియోగదారులను ఆకట్టుకునేలా బ్రాండ్లు ప్రయత్నించాయి. ఈ పోటీలో ఎవరు గెలిచారు? ఎవరు వెనకబడ్డారు? చూద్దాం.

వివో.. మొదటి స్థానంలో సూపర్ షాట్
19% మార్కెట్ షేర్‌తో Vivo మరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. మిడ్‌రేంజ్ నుంచి ప్రీమియం వరకు అన్ని సెగ్మెంట్లలో మోడల్స్‌ విడుదల చేస్తూ, డిజైన్, కెమెరా క్వాలిటీ, బ్యాటరీ లైఫ్‌తో కస్టమర్ల మనసు గెలుచుకుంది. ఆఫ్‌లైన్ మార్కెట్‌లో బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ కూడా వీరి విజయానికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.


సామ్‌సంగ్.. రెండో స్థానంలో నిలకడ
14.5% మార్కెట్ షేర్‌తో Samsung రెండో స్థానంలో నిలిచింది. గెలాక్సీ సిరీస్‌ ప్రీమియం ఫోన్లతో పాటు, M & A సిరీస్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్లు కూడా బాగా అమ్ముడయ్యాయి. 5G మోడల్స్‌ ధరలు తగ్గించడం, ఆఫర్లు ఇవ్వడం వల్ల వీరి సేల్ పెరిగింది.

ఓప్పో.. మూడో స్థానంలో స్లో అండ్ స్టెడీ
13.4% మార్కెట్ షేర్‌తో OPPO మూడో స్థానంలో ఉంది. రినో సిరీస్ డిజైన్, కెమెరా ఫీచర్లు యువతను బాగా ఆకర్షించాయి. ఆఫ్‌లైన్‌లో వీరి ప్రెజెన్స్‌ కూడా బలంగానే ఉంది.

రియల్‌మీ – నాలుగో స్థానంలో యంగ్ ఎంట్రీ
9.7% మార్కెట్ షేర్‌తో realme నాలుగో స్థానంలో. బడ్జెట్ సెగ్మెంట్‌లో కొత్త మోడల్స్, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, యూత్ టార్గెట్ మార్కెటింగ్ ఇవన్నీ వీరి సేల్ పెరగడానికి కారణమయ్యాయి.

షావోమి – టాప్ ఫైవ్‌లో రీ-ఎంట్రీ
9.6% మార్కెట్ షేర్‌తో Xiaomi ఐదో స్థానంలో ఉంది. రెడ్మీ నోట్ సిరీస్ మళ్లీ బాగా పాపులర్ అవ్వడంతో, ఆన్‌లైన్ సేల్ బలపడింది.

మోటరోలా – సైలెంట్‌గా సక్సెస్
8% మార్కెట్ షేర్‌తో Motorola మిడ్‌రేంజ్ ఫోన్లతో గణనీయంగా పెరిగింది. స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం, 5G మోడల్స్ వీరి ప్లస్ పాయింట్స్.

ఆపిల్ – ప్రీమియం రేంజ్ కింగ్
7.5% మార్కెట్ షేర్‌తో Apple తన ఐఫోన్ సిరీస్‌తో ప్రీమియం సెగ్మెంట్‌లో లీడర్‌గా కొనసాగుతోంది. హై ఎండ్ కస్టమర్లలో వీరి క్రేజ్ తగ్గలేదు.

Also Read: Vivo V60: మార్కెట్ లోకి కొత్త ఫోన్.. హై రేంజ్ ఫీచర్స్ తో.. ఈ మొబైల్ వెరీ స్పెషల్!

iQOO – గేమర్స్ ఫేవరెట్
4.3% మార్కెట్ షేర్‌తో iQOO గేమింగ్ స్మార్ట్‌ఫోన్లకు మంచి డిమాండ్ సాధించింది. హై పర్ఫార్మెన్స్ చిప్‌సెట్స్, ఫాస్ట్ ఛార్జింగ్ వీరి USP.

పోకో – బడ్జెట్ గేమర్ చాయిస్
3.8% మార్కెట్ షేర్‌తో Poco బడ్జెట్ సెగ్మెంట్‌లో యూత్ ఫేవరెట్‌గా నిలిచింది.

వన్‌ప్లస్
2.5% మార్కెట్ షేర్‌తో OnePlus స్థిరంగా ఉంది. నార్డ్ సిరీస్ మిడ్‌రేంజ్‌లో, ఫ్లాగ్‌షిప్ మోడల్స్ ప్రీమియం సెగ్మెంట్‌లో సేల్ అందించాయి. ఇక అలాగే 7.7% మార్కెట్ షేర్‌ను మిగతా బ్రాండ్లు కలిపి సాధించాయి. టెక్నో, ఇన్ఫినిక్స్, లావా వంటి బ్రాండ్లు ఇందులో ఉన్నాయి.

మార్కెట్ ట్రెండ్ క్లారిటీ
2025 తాజా గణాంకాలు చూస్తే, మిడ్‌రేంజ్ ఫోన్లు ఇంకా ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయనిపిస్తుంది. 5G, ఫాస్ట్ ఛార్జింగ్, పెద్ద బ్యాటరీ.. ఇవే ఇప్పుడు వినియోగదారుల ప్రాధాన్యత. ఆఫ్‌లైన్ మార్కెట్‌లో బలంగా ఉన్న బ్రాండ్లు (Vivo, OPPO, Samsung) టాప్‌లో ఉండగా, ఆన్‌లైన్ సేల్ బలంగా ఉన్న Xiaomi, realme, iQOO కూడా మంచి వృద్ధి సాధించాయి. మొత్తానికి, భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇప్పుడు రెడ్ హాట్ కాంపిటీషన్‌లో ఉంది. వచ్చే త్రైమాసికంలో కొత్త లాంచ్‌లు, పండుగ ఆఫర్లు ఈ గణాంకాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది.

Related News

Realme P4 5G: గేమింగ్ ప్రేమికుల కలల ఫోన్ వచ్చేస్తోంది.. దీని ఫీచర్స్ ఒక్కొక్కటి అదుర్స్..!

Zoom Meeting: జూమ్ మీటింగ్‌లో టీచర్లు మాట్లాడుతుండగా… అశ్లీల వీడియోలు ప్లే చేశారు, చివరకు?

Vivo V60: మార్కెట్ లోకి కొత్త ఫోన్.. హై రేంజ్ ఫీచర్స్ తో.. ఈ మొబైల్ వెరీ స్పెషల్!

HTC Wildfire E4 Plus: రూ.10000లోపు ధరలో 50MP కెమెరా, 5000 mAh బ్యాటరీ.. HTC వైల్డ్‌ఫైర్ E4 ప్లస్ స్మార్ట్ ఫోన్ లాంచ్

Flipkart Freedom Sale: ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ మళ్లీ ప్రారంభం .. త్వరపడండి నాలుగు రోజులే

Big Stories

×