Zoom Meeting: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహారీజ్ గంజ్ జిల్లాలో విద్యాశాఖ నిర్వహించిన జూమ్ సమావేశం ఓ అనూహ్య ఘటన వల్ల అస్తవ్యస్తంగా మారింది. ఐదు రోజుల క్రితం జిల్లా మెజిస్ట్రేట్ నిర్వహించిన సమావేశంలో చాలా మంది అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడ్డారు. అందులో ఓ వ్యక్తి ముందుగా ఆన్ లైన్‌లో అశ్లీల వీడియోను ప్లే చేశాడు. అనంతరం వెంటనే మరో వ్యక్తి అసభ్యకరమైప పదజాలంతో దూషించాడు. దీంతో ఆ జూమ్ మీటింగ్ అస్తవ్యస్తంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆగస్టు 7న జూమ్ ద్వారా విద్యాశాఖ ఈ-చౌపాల్ సమావేశం నిర్వహించింది. ఈ జూమ్ సమావేశానికి జిల్లా మేజిస్ట్రేట్ సంతోష్ కుమార్ శర్మ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, కామన్ పీపుల్ కూడా పాల్గొన్నారు. పాఠశాల సంబంధిత సమస్యలపై ప్రజలు నేరుగా జిల్లా మేజిస్ట్రేట్‌తో సంప్రదించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే సమావేశం జరుగుతుండగా.. మధ్యలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అశ్లీల వీడియోలను ప్లే చేశారు.
ALSO READ: Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం
జూమ్ మీటింగ్ కొనసాగుతుండగా.. జాసన్ జూనియర్ అనే పేరుతో ఓ వ్యక్తి అశ్లీల వీడియోలను ప్లే చేశాడు. అదే సమంలో అర్జున్ పేరుతో ఉన్న మరో వ్యక్తి బూతు పదజాలం వాడాడు. దీంతో వెంటనే విద్యాధికారులు, టీచర్లు సమావేశం నుంచి నిష్క్రమించారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రిద్ధి పాండే పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరు అజ్ఞాత వ్యక్తులపై కోత్వాలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: Hyderabad Rains: రైన్ అలర్ట్.. ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి వెళ్లిపోండి, లేకుంటే చిక్కుకుపోతారు!
సదర్ కోత్వాలీ పోలీస్ అధికారి సత్యేంద్ర రాయ్ ఈ సంఘటన గురించి మాట్లాడారు. ఈ సంఘటనపై సైబర్ పోలీసుల సహాయంతో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఆ ఇద్దరి నిందితులను టెక్నికల్ మార్గాల ద్వారా గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వారి ఇద్దరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.. ఈ ఘటన విద్యాశాఖ సమావేశాల ఆన్‌లైన్ వేదికల భద్రతపై పలు కీలక ప్రశ్నలను లేవనెత్తింది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు మరింత కఠినమైన సైబర్ భద్రతా చర్యలు అవసరమని అధికారులు, నెటిజన్లు భావిస్తున్నారు.