E-Paper
Advertisement

BRS Politics: బీఆర్ఎస్‌కి కొత్త సమస్య.. నేతలు తలో విధంగా చర్చ, కేసీఆర్ ప్లానేంటో?

BRS Politics: బీఆర్ఎస్‌కి కొత్త సమస్య.. నేతలు తలో విధంగా చర్చ, కేసీఆర్ ప్లానేంటో?
Advertisement

BRS Politics: పంచాయితీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన బీఆర్ఎస్‌కు కొత్త సమస్య మొదలైందా? మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పడంతో ఆ పార్టీలో అలజడి మొదలైందా? దీనిపై కేసీఆర్ ఆలోచన ఎలా ఉండబోతోంది? ఇన్నాళ్లు చంద్రబాబుపై విరుచుకుపడిన కేసీఆర్, పవన్‌పై ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగించనున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతోంది.

Advertisement

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి కొత్త సమస్య

Advertisement

ఎన్నికల  ముందు ఎన్ని పార్టీలు పుట్టుకొస్తే అధికార పార్టీకి అంత అడ్వాంటేజ్. నెగిటివ్ ఓటు బ్యాంకు చీలిపోయి అధికార పార్టీకి కలిసి వస్తుంది. పంచాయితీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన బీఆర్ఎస్, పుల్ జోష్‌లో ఉంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల గంట మోగనుంది.  ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే రెడీ అవుతున్నాయి.

పార్టీలు బలంగా ఉండేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకం. వీటి ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఎక్కువ సీట్లను గెలుచుకునేందుకు ఉవ్విల్లూరుతుంటాయి పార్టీలు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన రెడీ అవుతోంది. ఇప్పటికే అధినేత పవన్ నుంచి కేడర్‌కు స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. 

నేతలు తలో విధంగా చర్చ.. కేసీఆర్ ప్లానేంటో?

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కమిటీలు ఏర్పాటు కానున్నాయి.  ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో జనసైనికుడు, వీర మహిళ ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని జనసేన నుంచి ప్రకటన వచ్చింది. జనసేన ప్రకటనపై బీఆర్ఎస్‌లో చిన్నపాటి అలజడి మొదలైంది.

తెలంగాణలో ప్రతీ మండల స్థాయిలో జనసేనకు అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు రానివారు, టీడీపీ, బీజేపీ, జనసేన వైపు మొగ్గు చూపే అవకాశముంది. ఆయా నేతల ప్రభావం బీఆర్ఎస్‌పై పడడం ఖాయమనే చర్చ అప్పుడు ఆ పార్టీ నేతల్లో మొదలైంది. అదే జరిగితే బీఆర్ఎస్‌కు కష్టమనే వాదన లేకపోలేదు.

ALSO READ: సర్వే ఫీవర్..  కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ

గడిచిన పదేళ్లు టీడీపీ కేడర్‌ని తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ రకరకాల వ్యూహాలను అవలంభించింది.  ఆ విషయంలో అధినేత కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఐనప్పటికీ చాలా ప్రాంతాల్లో టీడీపీ బలంగా ఉంది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లోకి దిగబోతోంది జనసేన. ఆ పార్టీని బీఆర్ఎస్ ఏ విధంగా అడ్డుకోబోతోందనేది అసలు సమస్య.

టీడీపీ, జనసేన, బీజేపీ అన్నీ చివరకు ఒకే తాటిపైకి వస్తాయి.  జనసేన దూకుడికి అడ్డకట్ట వేయకుంటే ఊహించని ఫలితాలు పార్టీకి రావడం కష్టమనే చర్చ అప్పుడే మొదలైంది.  మరి పవన్‌ను అడ్డుకునేందుకు కేసీఆర్ ఎలాంటి అస్త్రాలను ప్రయోగిస్తారో చూడాలి.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×