Infinix Note 50s 5G+: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకీ కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో వినియోగదారులను ఆకట్టుకునేందుక అనేక బ్రాండ్‌లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇన్ఫినిక్స్ సంస్థ తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ సన్నిని మోడల్ Infinix Note 50s 5G+ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
సన్నగా ఉండే డిజైన్
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ను కంపెనీ తమ సరికొత్తగా మోడల్ గా ప్రచారం చేస్తోంది. ఇది ఇప్పటివరకు వారిచే రూపొందించబడిన అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్. తేలికగా ఉండి కూడా, శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ఇది తగిన రీతిలో సౌకర్యవంతమైన గ్రీప్ అందిస్తూ, ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంటుంది.
6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే
ఈ ఫోన్ సొగసైన డిజైన్ మాత్రమే కాదు, విజువల్ ఎక్స్‌పీరియన్స్ పరంగా ఒక శ్రేణిగా నిలుస్తుంది. ఈ ఫోన్ లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల పూర్తి-HD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. అంటే స్క్రోల్, గేమింగ్, వీడియో ప్లేబ్యాక్ అన్నీ సమతుల్యతతో సాగిపోతాయి. అంతేకాక, 2304Hz PWM డిమ్మింగ్ టెక్నాలజీ వలన కళ్లకు భద్రతతో కూడిన లాంగ్-టైమ్ యూజ్‌కు అనుకూలంగా ఉంటుంది.
గోరిల్లా గ్లాస్ 5 + ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్
ప్రీమియం అనుభూతి అందించేందుకు గోరిల్లా గ్లాస్ 5 డిస్‌ప్లేను ప్రొటెక్షన్ అందిస్తోంది. అదనంగా, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వేగవంతమైన, సురక్షితమైన అనలాక్ అనుభూతిని అందిస్తుంది. ఈ ఫీచర్, మీ ఫోన్‌ను ఖరీదైన ఫోన్‌ల సరసన నిలబెట్టేలా చేస్తుంది.
Read ALso: Flat Buying Mistakes: ఫ్లాట్ కొంటున్నారా జాగ్రత్త..పొరపాటున …
స్టైల్‌కు బ్రాండ్ తళుకులు
ఇన్ఫినిక్స్ ఈసారి డిజైన్ పరంగా అసలు కాంప్రమైజ్ కాలేదు. 3 రంగుల ఎంపికలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. వాటిలో మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ, రూబీ రెడ్, టైటానియం గ్రే కలవు.
కెమెరా మాడ్యూల్ – స్టైల్ & సింఫనీ
వెనుక కెమెరా మాడ్యూల్ డిజైన్ చూసిన వెంటనే ఇది నోట్ 50X 5G వేరియంట్‌ను గుర్తుకు తెస్తుంది. ఇది సిరీస్ అంతటా ఒకటే డిజైన్ లాంగ్వేజ్ ని పాటించిందని చెప్పొచ్చు. మొబైల్ చేతిలో పట్టుకున్నప్పుడు అది ప్రత్యేకంగా కనిపించాలనే లక్ష్యంతో చేసిన ఫినిషింగ్ స్పష్టంగా కనిపిస్తుంది.
పోటీదారులపై ఒత్తిడి
ఈ లాంచ్ టైమింగ్ కూడా చక్కగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. శామ్‌సంగ్ తమ గెలాక్సీ S25 ఎడ్జ్‌ను మే 13న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉంది. అయితే అది ఒక నెల వాయిదా పడింది. ఇదే సమయంలో ఇన్ఫినిక్స్ తమ సన్నని ఫోన్‌ను తీసుకురావడం ద్వారా, ఖరీదైన బ్రాండ్‌లకు తక్కువ ధరలో ప్రత్యామ్నాయాన్ని చూపించగలదనే సంకేతాన్ని అందిస్తోంది. ఆపిల్ కూడా తన తదుపరి ఐఫోన్ సన్నగా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
త్వరలో సేల్స్
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ కేవలం సన్నని ఫోన్ మాత్రమే కాదు. ఇది స్టైల్, టెక్నాలజీ, ఫంక్షనాలిటీల మేళవింపు. ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలో లభించనున్న ఈ ఫోన్, మధ్యస్థాయి మార్కెట్‌లో ఒక గేమ్ ఛేంజర్ కానుంది. ధర ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఫీచర్లను చూస్తే ఇది ధరకి మించిన విలువను అందించేలా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.