Wrestling With Crocodile: ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అని దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం.. విద్యార్థులతో పదే పదే చెప్పేవారు. ఆయన మాటలు విన్నాడో ఏమో కానీ, ఓ వ్యక్తి తన చిన్న నాటి కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఏకంగా మొసలితో రెజ్లింగ్ చేశాడు. మొసలితో కుస్తీ ఏంటని షాక్ అవుతున్నారా? ఇంతకీ రెజ్లింగ్ ఏంటి? మొసలితో గేమ్స్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
మొసలితో రెజ్లింగ్ చేసిన జే బ్రూవర్
సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా ఉండే వారికి జే బ్రూవర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఆయన ది రెప్లైల్ జూ నిర్వాహకుడిగా ఉన్నారు. ఇన్ స్టాలో ఆయనకు మాంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఏకంగా 8.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన తరచుగా పాములు, మొసళ్లు, సహా పలు రకాలు ప్రమాదకర జంతువులతో ఆటలు ఆడుతూ కనిపిస్తుంటాడు. వాటితో కలిసి ప్రమాదకర స్టంట్స్ చేస్తుంటాడు. వాటికి సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంటాడు.
తాజాగా జే బ్రూవర్ తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఆయన మొసలితో రెజ్లింగ్ చేస్తూ కనిపించాడు. అంతేకాదు, ఈ వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “నేను చిన్నప్పటి నుంచి రెజ్లింగ్ లోకి రావాలని కలలుగన్నాను. కానీ, రెజ్లింగ్ చేసేందుకు సరైన పార్టనర్ దొరకలేదు. చివరకు నాకు డార్త్ దొరికాడు. కొందరు దీన్ని పిచ్చి అనవచ్చు. కానీ, నేను నా కలను ఈ మొసలితో రెజ్లింగ్ చేస్తూ నెరవేర్చుకుంటున్నాను. గుర్తుంచుకోండి. ఎవరు ఏం చేసినా సరే, మీ కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నించండి” అని రాసుకొచ్చాడు.
Read Also: పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లి మరీ రీల్స్.. నాగర్ కర్నూల్ కుర్రాళ్ల వెర్రి చేష్టలు!
వామ్మో అంటున్న నెటిజన్లు
ఇక జే బ్రూవర్ షేర్ చేసిన వీడియో వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ఇందులో ఆయన మీద మొసలి పడుకొని ఉంది. ఆయన మొసలిని కౌగిలించకుని వెల్లకిలా పడుకున్నాడు. ఏమాత్రం భయం లేకుండా ఆయన మొసలితో గేమ్స్ ఆడుతూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం బోలెడు వ్యూస్ సాధించింది. సుమారు 18 వేలకు పైగా లైక్స్ లభించాయి. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదే సమయంలో జే బ్రూవర్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. “గేమ్స్ బాగానే ఆడుతుంది. కానీ, దాని బుర్రలో ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందో బ్రదర్. కాస్త జాగ్రత్తగా ఉండు” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “మీ ధైర్యానికి హ్యాట్సాఫ్’ అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇలాంటి స్టంట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త గురూ” అంటూ మరికొంత మంది సలహా ఇచ్చారు.
Read Also: రైల్ లోనే థియేటర్ సెట్ చేసేశారు.. ఎవర్రా మీరంతా ఇంత టాలెండ్ గా ఉన్నారు!