E-Paper
Advertisement

Airtel రూ.598 ప్లాన్.. అపరిమిత 5Gతో పాటు నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5 ఫ్రీ.. వ్యాలిడిటీ ఎంతంటే?

Airtel రూ.598 ప్లాన్.. అపరిమిత 5Gతో పాటు నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5 ఫ్రీ.. వ్యాలిడిటీ ఎంతంటే?
Advertisement

Airtel Rs 598 Plan: భారతీ ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం అత్యద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. స్వల్పకాలిక వ్యాలిడిటీతో వచ్చే ఈ రూ.598 ప్లాన్ ద్వారా యూజర్లకు ఫ్రీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు లభించనున్నాయి. సినిమాలు, సిరీస్ లు చూసేందుకు భారీ డేటాను సైతం ఈ ప్లాన్ కింద ఆఫర్ ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది.

వ్యాలిడిటీ ఎంతంటే?

ఎయిర్‌టెల్ ఈ రూ.598 ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. అంటే రోజుకు సగటున రూ. 21 భారం యూజర్లపై పడనుంది. ప్లాన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే.. ప్రతీ రోజూ 2GB డేటా యూజర్లకు లభించనుంది. అలాగే అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు సైతం యూజర్లు చేసుకోవచ్చు.

అర్హులకు అపరిమిత 5G డేటా

Advertisement

మరోవైపు ఇదే ప్లాన్ అన్ లిమిటెడ్ 5G డేటాను సైతం ఎయిర్ టెల్ అందిస్తోంది. 5G స్మార్ట్ తో పాటు 5G నెట్ వర్క్ పరిధిలో ఉన్న యూజర్లు దీనికి అర్హులని స్పష్టం చేసింది. అయితే ఈ అపరిమిత 5Gకి సైతం కొంత లిమిట్ ను యాడ్ చేశారు. ప్రతీ 30 రోజులకు గరిష్టంగా 300GB డేటాను యూజర్లు వాడుకోవచ్చు.

నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ ఫ్రీ..

ఇక వినోదం విషయానికొస్తే.. ఈ ప్లాన్‌లో నెల రోజుల పాటు జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జీ5, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే (Airtel Xstream Play) సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తున్నారు. వీటి ద్వారా సినిమాలు, సిరీస్ లు, లైవ్ ఛానెళ్లు ఉచితంగా వీక్షించవచ్చని ఎయిర్ టెల్ వర్గాలు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Also Read: రూ.799కే ప్రీమియం ఇయర్‌బడ్స్..మార్కెట్‌ను ఊపేస్తున్న కొత్త మోడల్

ఓటీటీ వద్దనుకుంటే.. బల్క్ డేటా!

ఒకవేళ పైన పేర్కొన్న ఉచిత ఓటీటీ సేవలు వద్దనకుంటే.. వారి కోసం రూ.589 ప్లాన్ ను ఎయిర్ టెల్ అందుబాటులో ఉంచింది. 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో మొత్తం 50GB బల్క్ డేటా యూజర్లకు లభించనుంది. అలాగే అపరిమిత కాల్స్, 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. 50GB డేటాపై రోజువారీ లిమిట్ లేని నేపథ్యంలో అవసరానికి తగినట్లుగా ఎప్పుడైనా, ఎంతైనా డేటాను వాడుకోవచ్చు.

Also Read: 100కే 5 వికెట్లు..పీక‌ల్లోతు క‌ష్టాల్లో భారత్, రిష‌బ్ పంత్ ఆట‌పై సునీల్ గ‌వాస్క‌ర్ అస‌హ‌నం

Tags

Related News

మీ ల్యాప్‌టాప్ స్క్రీన్ క్లీనింగ్‌లో..ఈ మిస్టేక్ అస్సలు చేయెద్దు!

సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ కొంటున్నారా? బ్యాటరీ చెక్ చేయకుండా డీల్ ఓకే చేయకండి!

రూ.799కే ప్రీమియం ఇయర్‌బడ్స్..మార్కెట్‌ను ఊపేస్తున్న కొత్త మోడల్

మీరు ఫోన్‌ను వాడుతున్నారా? లేక మీ ఫోన్ మిమ్మల్ని వాడుకుంటోందా?

స్టూడెంట్స్,ఆఫీస్ వర్క్ కోసం బెస్ట్ ట్యాబ్..అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్‌లోకి ఎంట్రీ

డెవలపర్లు, క్రియేటర్ల కోసం హెచ్‌పీ సూపర్ ఏఐ ల్యాప్‌టాప్ విడుదల

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ షురూ..స్మార్ట్‌ఫోన్లు,గాడ్జెట్లపై కళ్లు చెదిరే ఆఫర్లు

Big Stories

Advertisement
×