E-Paper
Advertisement

సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ కొంటున్నారా? బ్యాటరీ చెక్ చేయకుండా డీల్ ఓకే చేయకండి!

సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ కొంటున్నారా? బ్యాటరీ చెక్ చేయకుండా డీల్ ఓకే చేయకండి!
Advertisement

Second hand laptop: సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ల్యాప్‌టాప్ కొనడం అంటే.. ఒక రకంగా స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ లాంటిదే. బ్రాండెడ్ మోడల్ తక్కువ ధరలో.. వస్తుంది కాబట్టి ఎవరికైనా ఎట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. కానీ అమ్మేవాళ్లు బయటకు నీట్‌గా, ఫ్రెష్‌గా కనిపించేలా.. సెటప్ చేసి ఇస్తారు. పైకి మెరుస్తున్నా, బ్యాటరీ లోపల ఎంత కెపాసిటీ మిగిలి ఉందో.. మనకు వెంటనే తెలియదు. కొన్ని బ్యాటరీలు 20 శాతం పర్సెంట్ చూపించినా సడెన్‌గా స్విచ్చాఫ్ అయిపోతుంటాయి. మరికొన్ని ఫుల్ ఛార్జ్ చేసినా గంట కూడా నిలబడవు. అందుకే.. డబ్బులు కట్టే ముందే.. బ్యాటరీ అసలు పరిస్థితి ఏంటో చెక్ చేయడం చాలా ముఖ్యం.

విండోస్‌లో బ్యాటరీ రిపోర్ట్ ఎలా తీయాలి?

విండోస్ ల్యాప్‌టాప్ వాడుతుంటే.. ఎలాంటి థర్డ్-పార్టీ యాప్స్ అవసరం లేకుండానే బ్యాటరీ పూర్తి డేటా తీయెచ్చు. సెర్చ్ బాక్స్‌లో CMD అని టైప్ చేసి Command Prompt ఓపెన్ చేయండి. అక్కడ powercfg /batteryreport అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. కొన్ని సెకన్లలో సిస్టమ్ ఒక HTML ఫైల్ జనరేట్ చేస్తుంది. ఆ ఫైల్ పాత్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాన్ని ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో ఓపెన్ చేస్తే బ్యాటరీ రిపోర్ట్ పూర్తిగా కనిపిస్తుంది. ఈ రిపోర్ట్‌లో Design Capacity , Full Charge Capacity అనే రెండు ఆప్షన్లు చాలా కీలకం. డిజైన్ కెపాసిటీతో పోలిస్తే ఫుల్ ఛార్జ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటే బ్యాటరీ హెల్త్ పడిపోయిందని అర్థం. అలాగే Cycle Count కూడా గమనించాలి. సాధారణంగా వందల కొద్దీ సైకిల్స్ పూర్తయితే బ్యాటరీ లైఫ్ తగ్గినట్లు లెక్క.

డివైజ్‌ ఎలా చెక్ చేయాలి?

Advertisement

మీరు సెకండ్ హ్యాండ్ మ్యాక్‌బుక్ కొంటుంటే Option కీ నొక్కి పట్టుకుని ఆపిల్ మెనూలోని System Information ఓపెన్ చేయండి. లెఫ్ట్ సైడ్ మెనూలో Power సెక్షన్ క్లిక్ చేస్తే Cycle Count, Condition కనిపిస్తాయి. కండిషన్ Normal అని ఉంటే ఓకే, కానీ Service Recommended అని కనిపిస్తే బ్యాటరీ మార్చాల్సిన టైమ్ దగ్గర పడిందని గుర్తుంచుకోండి. లినుక్స్ లేదా క్రోమ్‌బుక్ అయితే సిస్టమ్ సెట్టింగ్స్ లేదా టెర్మినల్ కమాండ్స్ ద్వారా బ్యాటరీ హెల్త్ పర్సంటేజ్ ఈజీగా చూడొచ్చు.

ప్రత్యక్షంగా డీల్ చేసేటప్పుడు గమనించాల్సినవి:

స్క్రీన్‌ మీద నంబర్స్ చూడటంతో పాటు ప్రాక్టికల్‌గా కూడా కొన్ని విషయాలు చెక్ చేయాలి. సెల్లర్‌ను అడిగి ఛార్జర్ తీసేసి ల్యాప్‌టాప్‌ను కొద్దిసేపు వాడండి. బ్రౌజింగ్, వీడియో ప్లేబ్యాక్ చేస్తున్నప్పుడు బ్యాటరీ పర్సెంట్ ఉన్నట్టుండి 40 నుంచి 10 శాతానికి పడిపోతుందా చూడండి. ల్యాప్‌టాప్ కింద భాగం ఉబ్బినట్లు ఉంటే ఆ డీల్‌ను వెంటనే వదిలేయడం బెటర్;.అది సేఫ్టీ రిస్క్ కూడా. అలాగే ఒరిజినల్ ఛార్జర్ ఇస్తున్నారా లేదా అన్నది కూడా చెక్ చేయాలి. థర్డ్-పార్టీ లేదా తక్కువ వాటేజ్ ఛార్జర్ ఇస్తే బ్యాటరీ హెల్త్ మరింత దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది.

Advertisement

Also Read: రూ.799కే ప్రీమియం ఇయర్‌బడ్స్..మార్కెట్‌ను ఊపేస్తున్న కొత్త మోడల్

స్మార్ట్ డీల్‌తో డబ్బు సేవ్ చేసుకోండి:

ఈ రోజుల్లో రిమోట్ వర్క్, ఆన్‌లైన్ క్లాసులు, కంటెంట్ క్రియేషన్ పెరిగిన నేపథ్యంలో..పోర్టబిలిటీ చాలా అవసరం. పవర్ పాయింట్ లేకుండా కనీసం రెండు మూడు గంటలు పనిచేయగలిగే.. బ్యాటరీ ఉంటేనే ల్యాప్‌టాప్ వాడకం కంఫర్టబుల్‌గా ఉంటుంది. బ్యాటరీ వీక్‌గా ఉన్న ల్యాప్‌టాప్ తీసుకుని, తర్వాత కొత్త బ్యాటరీకి ఖర్చు పెడితే ..మొదట్లో అనుకున్న బడ్జెట్ బెనిఫిట్ పోతుంది. కావాలంటే.. కొత్త బ్యాటరీ ఖర్చును లెక్కలోకి తీసుకుని సెల్లర్‌తో ధర తగ్గించేలా బేరం చేయవచ్చు. లేదా అంతకంటే.. మంచి హెల్త్ ఉన్న మరో ఆప్షన్ ఎంచుకోవచ్చు. చిన్న టెక్ చిట్కాతో పెద్ద నష్టం తప్పించుకుంటే.. మీ సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ డీల్ నిజంగానే సూపర్ హిట్ అవుతుంది.

Related News

Airtel రూ.598 ప్లాన్.. అపరిమిత 5Gతో పాటు నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5 ఫ్రీ.. వ్యాలిడిటీ ఎంతంటే?

రూ.799కే ప్రీమియం ఇయర్‌బడ్స్..మార్కెట్‌ను ఊపేస్తున్న కొత్త మోడల్

మీరు ఫోన్‌ను వాడుతున్నారా? లేక మీ ఫోన్ మిమ్మల్ని వాడుకుంటోందా?

స్టూడెంట్స్,ఆఫీస్ వర్క్ కోసం బెస్ట్ ట్యాబ్..అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్‌లోకి ఎంట్రీ

డెవలపర్లు, క్రియేటర్ల కోసం హెచ్‌పీ సూపర్ ఏఐ ల్యాప్‌టాప్ విడుదల

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ షురూ..స్మార్ట్‌ఫోన్లు,గాడ్జెట్లపై కళ్లు చెదిరే ఆఫర్లు

మాప్ తానే ఉతికి ఆరబెట్టుకునే రోబో వాక్యూమ్ క్లీనర్..హైయర్ సివిక్ ఏఐ మ్యాక్స్ లాంచ్!

Big Stories

Advertisement
×