Vivo Buds Clip: ఇయర్ ఫోన్స్ ఎక్కువ సేపు పెట్టుకుంటే.. చెవులు నెప్పి పెడుతున్నాయా? అయితే.. మీ కోసమే టెక్ దిగ్గజం వివో తీసుకొచ్చిన కొత్త ఆడియో గాడ్జెట్ ఇది. సాధారణ ఇయర్ బడ్స్ లాగా ఇవి చెవి లోపల దూరవు. చెవి బయటి భాగంలో.. క్లిప్ లాగా ఈజీగా తొడుక్కోవచ్చు. కేవలం 5.2 గ్రాముల బరువు, మైండ్ బ్లోయింగ్ LDAC సౌండ్ క్వాలిటీ, ఏకంగా 42 గంటల బ్యాటరీ లైఫ్‌తో వచ్చిన ఈ ఓపెన్-ఇయర్ బడ్స్ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. వీటి డిజైన్, ఫీచర్లు , ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఓపెన్-ఇయర్ డిజైన్ అయినా సౌండ్ క్వాలిటీలో వివో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు.
12mm డ్యూయల్-మాగ్నెట్ డ్రైవర్లు: క్రిస్టల్ క్లియర్ సౌండ్, పంచ్ బాస్ కోసం 12mm డ్రైవర్లను అందించారు.
LDAC & Hi-Res సపోర్ట్: అధిక క్వాలిటీ ఆడియో స్ట్రీమింగ్ కోసం LDAC, AAC, SBC వంటి కోడెక్స్ లభిస్తాయి. దీని వల్ల ప్రతి ఇన్స్ట్రుమెంట్ నోట్ స్పష్టంగా వినిపిస్తుంది.
సౌండ్ లీకేజ్ కంట్రోల్: ఓపెన్-ఇయర్ మోడల్స్ అనగానే బయటి వారికి సౌండ్ వినిపిస్తుందేమో అని భయం ఉంటుంది. కానీ ఇందులో.. ప్రత్యేక డైరెక్షనల్ ఆడియో టెక్నాలజీ ఉండటం వల్ల మీరు వినే పాటలు లేదా కాల్స్ బయటి వ్యక్తులకు వినపడవు.
AI నాయిస్ క్యాన్సిలేషన్: కాల్స్ మాట్లాడేటప్పుడు పరిసరాల శబ్దాలను తగ్గించడానికి బోన్ కండక్షన్ మైక్ , ఏఐ బీమ్‌ఫార్మింగ్ మైక్ సిస్టమ్ తో లభిస్తుంది.
సింగిల్ ఛార్జ్‌పై బడ్స్ 10 గంటల వరకు ఆడతాయి. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి మొత్తం 42 గంటల ప్లేబ్యాక్ టైమ్ లభిస్తుంది.
ఫాస్ట్ ఛార్జింగ్: కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే దాదాపు 3 గంటల ప్లేటైమ్ పొందొచ్చు.
వైర్‌లెస్ ఛార్జింగ్ ,Type-C ఛార్జింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
కనెక్టివిటీ ,స్మార్ట్ ఫీచర్లు:
ఇవి బ్లూటూత్ 5.4 ద్వారా ఏకకాలంలో.. మూడు డివైజ్ లతో కనెక్ట్ అవుతాయి. ల్యాప్‌టాప్, ఫోన్, టాబ్ మధ్య స్విచ్ అవ్వడం చాలా ఈజీ. అంతేకాకుండా వివో , iQOO స్మార్ట్‌ఫోన్ల కస్టమర్లకు రీసైక్లింగ్ టచ్ కంట్రోల్స్, AI రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ వంటి అదనపు ఫీచర్లు లభిస్తాయి.
మార్కెట్లో ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
స్టాండర్డ్ వేరియంట్: సుమారు రూ. 10,000 వరకు ఉంటుంది.
వైర్‌లెస్ ఛార్జింగ్ వేరియంట్: సుమారు రూ. 11,400 వరకు ఉంటుంది.
ఐరోపా మార్కెట్‌లో దీని ప్రారంభ ధర సుమారు రూ. 19,000 వరకు ఉంది. ఇండియాలో ఇది రూ. 10,000 నుంచి రూ. 12,000 లభ్యత ధరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఒకే చోట కూర్చొని వర్క్ చేసే వారికి, హెల్తీగా చెవులను కాపాడుకుంటూ మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకునే టెక్ లవర్స్‌కు ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.