BigTV English

Scientist On Earth: డైమండ్ డస్ట్ తో భూమికి చల్లదనం, ఇది అయ్యే పనేనా గురూ?

Scientist On Earth: డైమండ్ డస్ట్ తో భూమికి చల్లదనం, ఇది అయ్యే పనేనా గురూ?

Earth Cooling: గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమిపై వాతావరణ పరిస్థితులు రోజు రోజుకు మరింత దిగజారుతున్నాయి. పెరుగుతున్న కాలుష్యంతో భూ గ్రహం ప్రతి ఏటా మరింత వేడెక్కుతున్నది. ఫలితంగా మంచు కరిగి నీరు భూమిని కబలిస్తోంది. రానున్న రోజుల్లో భూగ్రహం మరింత వేడెక్కే పరిస్థితి ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు, భూమి వేడిని తగ్గించే ప్రయత్నాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఓ మార్గాన్ని కనిపెట్టారు.


డైమండ్ డస్ట్ తో భూమికి చల్లదనం

వాతావరణంలోకి డైమండ్ డస్ట్ ను ఇంజెక్ట్ చేయడం వల్ల భూ గ్రహాన్ని చల్లబరిచే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌ లో ప్రచురించబడిన కొత్త అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వజ్రాల ధూళి భూమిని కూల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వాతావరణ మార్పులకు కారణమయ్యే భూమి టిప్పింగ్ పాయింట్ కు డైమండ్ ధూళిని పంపించడం వల్ల భూగ్రహాన్ని చల్లబరిచే అవకాశం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు..


డైమండ్ డస్ట్ తో భూమికి చల్లదనం!

వాతావరణ శాస్త్రవేత్తలు గ్లోబల్ వార్మింగ్ ను ఎదుర్కొనేందుకు ఉపయోగించే పలు రకాల ఏరోసోల్ లను పోల్చేందుకు లేటెస్ట్ 3D వాతావరణ నమూనాలను ఉపయోగిస్తోంది. ఈ ప్రయోగాల్లో భాగంగా కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించాలని భావించినప్పటికీ, అది అనుకున్న స్థాయిలో ప్రభావం చూపే పరిస్థితి లేదని గుర్తించారు. సూర్యరశ్మి నుంచి వచ్చే వేడిని తగ్గించడంలో ఈ పద్దతి అనుకున్న ఫలితాలను ఇవ్వదని గుర్తించారు. కాల్సైట్, అల్యూమినియం, సిలికాన్ కార్బైడ్, సల్ఫర్ డయాక్సైడ్‌ తో సహా ఏడు వేర్వేరు పదార్థాలతో భూమిని చల్లబరిచేందుకు ప్రయత్నించారు.  వీటిన్నింటితో పోల్చితే డైమండ్ డస్ట్ ద్వారా భూమిని సమర్థవంతంగా చల్లబరిచే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. డైమండ్ కణాలు అత్యంత కాంతిని, వేడిని అడ్డుకోవడంలో ఎఫెక్టిక్ గా పని చేస్తాయని తెలుసుకున్నారు. డైమండ్ డస్ట్ ఇతర రసాయనాలతో పోల్చితే అంత ఈజీగా వాతావరణంలో కలిసిపోదని గుర్తించారు.

ఇది సాధ్యం అయ్యే పనేనా?

వాస్తవానికి సల్ఫర్ డయాక్సైడ్ లాంటి రసాయనాలతో భూమిని చల్లబర్చడం సాధ్యమేనా అని ప్రయోగం చేసిన శాస్త్రవేత్తలు, లాభం కంటే నష్టమే ఎక్కువ కలిగే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఈ రసాయనాలను వాతావరణంలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల ఆమ్ల వర్షాలు కురవడంతో పాటు ఓజోన్ పొర దెబ్బతినే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. కానీ, వజ్రాల ధూళి రసాయన చర్యలకు లోను కాదని గుర్తించారు. పర్యావరణానికి ఎలాంటి హాని చేయదని తెలుసుకున్నారు. ఏటా 5 మిలియన్ టన్నుల సింథటిక్ డైమండ్ డస్ట్‌ ను వాతావరణంలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల 45 సంవత్సరాలలో భూమిని 1.6 ° C వరకు చల్లబరిచే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రయోగం చాలా ఖర్చుతో కూడుకున్నది. ఏకంగా 200 ట్రిలియన్ డాలర్లు అవసరం అవుతాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇది అయ్యేపని కాదని చాలా మంది భావిస్తున్నారు. తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితాలు పొందే దిశగా ప్రయోగాలు ఉండాలని అభిప్రాయపడుతున్నారు.

Read Also: AI లేదు తొక్కాలేదు.. అదేంటీ యాపిల్ సీఈవో అంత మాట అనేశారు!

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×