Fake Age Detection: వెబ్‌లో “బాల్యం” ఓ పెద్ద డ్రామా అయిపోయింది. ఎందుకంటే 18+ కంటెంట్ చూడాలంటే వయస్సు పెంచేస్తున్నారు. పెద్దల ఖాతాగా మారిపోయి స్టోరీస్ చూసేస్తున్నారు. కానీ ఇలాంటి టీనేజర్లకు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ చెక్ పెట్టబోతోంది. అందుకోసం ముఖ్యంగా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగించి మరింత కఠినతరం చేసింది. అంటే ఇప్పుడు మీకు వయసు ఎంతనేది మీరు చెప్పినదానితో కాదు, మీ usage ఆధారంగా AI ఊహించగలుగుతుంది.
మాటల మాయకు చెక్ పెట్టిన మెటా
ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ఒక కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి టీనేజర్లు తప్పుడు పుట్టిన తేదీలు పెట్టి మోసగించలేరు. ఎందుకంటే AI టెక్నాలజీ ఉపయోగించి వారు నిజంగా టీనేజర్‌నేనా లేదా పెద్దవారా అనే అంశాన్ని మెటా ముందుగానే గమనించగలదు. వినిపించడానికి కాస్త భయంగా ఉన్నా, ఇది పిల్లల భద్రత కోసమేనని చెబుతున్నారు.
AI ఎలా తెలుసుకుంటుంది?
AI కూడా గూగుల్ మామలాంటిదే. కానీ అది చాలా తెలివైనది. మీరు ఏ కంటెంట్ చూస్తున్నారు. ఎలాంటి పోస్ట్‌లపై లైక్ వేస్తున్నారు, ఖాతా ఎప్పటి నుంచి ఉంది, ఏ పేజీలను ఫాలో అవుతున్నారు వంటి డేటా సంకేతాలు ఆధారంగా మీరు నిజంగా టీనేజరేనా లేదా అని ఏఐ గుర్తిస్తుంది. అంటే మీరు ఓ మై గాడ్, ఐ లవే కాస్మెటిక్ సర్జరీ లాంటి పోస్ట్‌లను ఫాలో అవుతుంటే 13 ఏళ్ల వయస్సు ఉందంటూ మీ ప్రొఫైల్ చెబుతున్నా… మీ అసలు వయసు ఏంటో AI గమనించేస్తుంది.
అయితే ఏం జరుగుతుంది ?
మీ వయస్సు తప్పు అని పట్టు పడితే, మీ ఖాతా ఆటోమేటిక్‌గా Teen Accountగా మారిపోతుంది. అంటే మీకు కొన్ని పరిమితులు వస్తాయి. ఖాతా డిఫాల్ట్‌గా ప్రైవేట్‌లోకి మారిపోతుంది. మీకు ఇప్పటికే ఉన్న ఫాలోవర్స్‌కి మాత్రమే మెసేజ్‌లను పంపవచ్చు. ఉదాహరణకు పోరాట వీడియోలు, కాస్మెటిక్ సర్జరీకి సంబంధించిన పోస్టులు చూడలేరు. 60 నిమిషాల యాక్టివిటీ తర్వాత విరామం తీసుకోండి అనే వార్నింగ్ నోటిఫికేషన్ వస్తుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు “Sleep Mode” ఆన్ అవుతుంది. నోటిఫికేషన్‌లు రావు, డిస్టర్బెన్స్ ఉండదు.
Read Also: Redmi Watch Move: వచ్చేసింది పవర్ ఫుల్ స్మార్ట్ వాచ్.. …
భద్రత, అభివృద్ధి
ఇతర యాప్‌లు టీనేజర్లను ఎక్కువసేపు స్క్రీన్‌లో ఉంచేందుకు పోటీ పడుతుంటే, ఇన్‌స్టాగ్రామ్ మాత్రం వారి మెంటల్ హెల్త్, డిజిటల్ భద్రత మీద దృష్టి పెడుతోంది. “మీరెంతకాలం యాప్‌ను వాడుతున్నారు?”, “రాత్రి సమయంలో ఎందుకు యాక్టివ్‌గా ఉన్నారు?” వంటి ప్రశ్నలకు సరైన జవాబులు లేకపోతే, AI స్పైలా వ్యవహరిస్తోంది.
మీ పిల్లలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారా?
అయితే ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండవచ్చు. టెక్నాలజీ ద్వారా వయస్సు అంచనా వేయడం, అనుచిత కంటెంట్ నుంచి వారిని దూరంగా ఉంచడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్ భద్రత పెంచుతోంది. ఇక పిల్లలు మోసపూరితంగా తమ వయసును తక్కువగా చూపించాలన్నా, ఎక్కువగా చూపించాలన్నా కూడా AI దొంగతనాన్ని పట్టేస్తుంది.
చివరగా
మీరు వయస్సులో పెద్దవారై ఉండకపోయినా, డిజిటల్ లోకంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. ఈ కొత్త నిర్ణయం ద్వారా ఇన్‌స్టాగ్రామ్ టెక్ ఆధారిత భద్రతకు ఓ కొత్త దిశను చూపిస్తోంది. పిల్లల కోసం టెక్నాలజీ safeguardగా మారుతుంది.