Shivani Rajasekhar : ప్రస్తుతం సినిమాలు చేయడంలో స్పీడు తగ్గింది గాని ఒకప్పుడు రాజశేఖర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎన్నో అద్భుతమైన సినిమాలు రాజశేఖర్ కెరీర్ లో ఉన్నాయి. సింహరాశి, భరత సింహారెడ్డి, మా అన్నయ్య, సేతు, గోరింటాకు వంటి సినిమాలకు తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. రాజశేఖర్ భార్య జీవిత కూడా మంచి గుర్తింపు సాధించుకుంది కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా మంచి పేరు సంపాదించుకుంది. రీసెంట్ టైమ్స్ లో రాజశేఖర్ నటించిన సినిమాలేవి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు. వరుసగా సినిమాలు ఫెయిల్ అవుతున్న తరుణంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గరుడవేగ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత మళ్లీ అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇప్పుడు రాజశేఖర్ పిల్లలిద్దరూ కూడా సినిమాల్లో మంచి బిజీగా ఉన్నారు.
రిజెక్ట్ చేసిన సినిమా
రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ దొరసాని సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.ఇక శివాని విషయానికి వస్తే ప్లే బ్యాక్ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందే ఉప్పెన సినిమాలో శివానికి అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమాను తాను ఒప్పుకోలేదు. దీనికి అసలు కారణమేంటంటే సినిమా కథ ఇప్పుడు ఉన్నట్లు కాకుండా ముందు ఆ వెర్షన్ మాత్రం చాలా బోల్డ్ గా ఉండేదట. అంతేకాకుండా లిప్ లాక్ సన్నివేశాలు ఉండడంతో తను ఆ కథను రిజెక్ట్ చేసినట్టు తెలిపింది.
రిజెక్ట్ చేయడానికి కారణాలు
అంతేకాకుండా ఒకవేళ ఈ సినిమాను ఒప్పుకుంటే రేపు నా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు నేను ఈ సినిమాను ఎలా చూడాలి అని ఫీల్ అయిందట. తనకు అర్జున్ రెడ్డి సినిమా చాలా బాగా నచ్చిందని దానిలో లిప్ లాక్ సీన్లు ఉన్నా కూడా అది కన్వెన్షన్ గా అనిపిస్తుంది అని తెలిపింది. బయట పోస్టర్లు చూస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏమో కానీ, సినిమా చూస్తున్నప్పుడు మాత్రం అటువంటి ఫీలింగ్ రాదు. కచ్చితంగా అలాంటి సినిమా వస్తే చేస్తాను అంటూ తెలిపింది. అయితే కొంతమంది దర్శకులు మాత్రం అవసరం లేకపోయినా కూడా కొన్ని సీన్స్ అలా పెడుతూ ఉంటారు అది నాకు నచ్చదు. అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఉప్పెన సినిమా శివాని ఒప్పుకొని ఉంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉండేది అని చెప్పొచ్చు.
Also Read : Salman Khan: సల్మాన్ ఖాన్ ‘బ్లూ బ్రాస్లెట్’ అంత పవర్‌ఫుల్లా? దాని సీక్రెట్ ఏమిటీ.. ధర ఎంత? ఎక్కడ లభిస్తుంది?