Redmi Watch Move: టెక్ ప్రపంచంలోకి మరో పవర్‌ఫుల్ ఎంట్రీ వచ్చేసింది. ఫిట్‌నెస్ ప్రేమికుల హృదయాలను గెలిచేలా, 14 రోజుల బ్యాటరీ లైఫ్‌తో రెడ్ మీ అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఒకసారి ఛార్జ్ చేసి టెన్షన్ లేకుండా, దీర్ఘకాలం పనితీరుతో ఆకట్టుకునే ఈ వాచ్, హెల్త్ కాన్షియస్ జనానికి ట్రాకింగ్ పరంగా అత్యద్భుతమైన అనుభవాన్ని అందించబోతోంది. కంపెనీ ప్రకారం ఈ వాచ్ 98.5 శాతం ఖచ్చితత్వంతో ఆరోగ్య డేటాను ట్రాక్ చేయగలదు. ఈ వాచ్‌లో 140కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉండటంతో, ప్రతి యాక్టివిటీకి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. నడక నుంచి స్విమ్మింగ్ వరకూ మీరు చేసే ప్రతీ కదలికను ఇది గమనించి విశ్లేషిస్తుంది. ఇకపై ఫిట్‌నెస్‌ను సాధించాలంటే జిమ్ కాకుండా, మీ చేతికి ఈ వాచ్ ఉంటే చాలు..
రెడ్‌మి వాచ్ మూవ్ ధర ఎంత?
దీని ధర గురించి మాట్లాడుకుంటే, భారతదేశంలో Redmi Watch Move ధర కేవలం రూ.1,999 మాత్రమే. మీరు ఈ వాచ్‌ను మే 1 నుంచి ఫ్లిప్‌కార్ట్, షియోమి ఇండియా వెబ్‌సైట్, షియోమి రిటైల్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. అదే సమయంలో, ఈ ప్రత్యేక స్మార్ట్ వేరబుల్ ప్రీ-బుకింగ్ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానుంది. మీరు ఈ స్మార్ట్‌వాచ్‌ను బ్లూ బ్లేజ్, బ్లాక్ డ్రిఫ్ట్, గోల్డ్ రష్, సిల్వర్ స్ప్రింట్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేసుకోవచ్చు.
రెడ్‌మి వాచ్ మూవ్ ఫీచర్లు
Redmi నుంచి వచ్చిన ఈ కొత్త వాచ్ 1.85-అంగుళాల 2.5D కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 390 x 450 పిక్సెల్స్. అలాగే, స్మార్ట్ వాచ్ 60Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ వాచ్ ఎల్లప్పుడూ ఆన్ డిస్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ స్మార్ట్ వాచ్ 140 కంటే ఎక్కువ ప్రీసెట్ స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తోంది. దీని హృదయ స్పందన రేటు, రక్త ఆక్సిజన్ స్థాయి, ఒత్తిడి స్థాయి, స్లీపింగ్ వంటి అనేక ప్రత్యేక లక్షణాలను అందిస్తుంది.
Read Also: Poxiao: బియ్యపు గింజత హార్డ్ డ్రైవ్..రెప్పపాటులో డేటా ట్రాన్స్ …
టైమ్ వాతావరణం, కాలింగ్ సౌకర్యం
రెడ్‌మి వాచ్ మూవ్ హైపర్ ఓఎస్‌లో పనిచేస్తుందని ఈ స్మార్ట్‌వాచ్‌తో మీరు మీ మణికట్టుపై నోట్స్, టాస్క్‌లు, క్యాలెండర్ ఈవెంట్‌లు, రియల్ టైమ్ వెదర్ అప్‌డేట్‌లను కూడా వీక్షించవచ్చని కంపెనీ చెబుతోంది. మీరు వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను కూడా పొందుతారు. హిందీ భాషకు కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు దీన్ని Android ఫోన్‌తో ఉపయోగించాలనుకున్నా లేదా iOS పరికరంతో ఉపయోగించాలనుకున్నా, మీరు రెండు పరికరాల్లోనూ Mi ఫిట్‌నెస్ యాప్‌తో దీన్ని ఉపయోగించవచ్చు.
14 రోజుల బ్యాటరీ
ఇది మాత్రమే కాదు, మీరు ఈ వాచ్ లోపల 10 కాంటాక్ట్‌లను కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, ఈ వాచ్ IP68 దుమ్ము, నీటి నిరోధక రేటింగ్ విధానాన్ని కల్గి ఉంది. రెడ్‌మి అద్భుతమైన వాచ్ 300mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇవ్వగలదని చెబుతున్నారు.