BigTV English

Instagram Data Transfer : ఇన్​స్టాగ్రామ్ నుంచి బ్రేక్ కావాలా.. మరి మీ డేటాను ఇలా సేవ్ చేసేసుకోండి

Instagram Data Transfer : ఇన్​స్టాగ్రామ్ నుంచి బ్రేక్ కావాలా.. మరి మీ డేటాను ఇలా సేవ్ చేసేసుకోండి

Instagram Data Transfer : ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఉన్న సంగతి తెలిసిందే. ఎక్స్​ (ట్విట్టర్), ఫేస్​ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఇలా ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణంలో అది అరచేతిలో ప్రత్యక్షమవుతోంది. అయితే వీటిలో ఇన్​ స్టా మరింత బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. దీనికి యూత్​ బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఇన్ స్టాతో లాభాలే అందుకు కారణం.


ఇన్స్టాగ్రామ్ అతి తక్కువ కాలంలోనే యవతకు తేలికగా చేరువైంది. ఎందుకంటే కొంత మంది తమ ట్యాలెంట్ నిరూపించుకునేందుకు దీనిని వినియోగిస్తుండగా, మరి కొందరు సమాచారాన్ని చేరవేయడానికి, ఇంకొందరు ఎంటర్టైన్మెంట్ కోసం రీల్స్ చేయడం, చూడటం చేస్తుంటారు. వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ కామెంట్లు, లైక్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా తమ అభిరుచులు, నైపుణ్యాలకు పదును పెడుతూ, వాటిని ఎక్కువగా ఈ ఇన్​స్టా వేదికగా ప్రదర్శిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అలానే లక్షల్లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌నూ సొంతం చేసుకుంటున్నారు.

అలానే ఈ ఇన్​స్టాగ్రామ్​ మెసేజ్​ అప్లికేషన్​లానూ ఉపయోగపడుతుంది. ఇతరులతో చాట్ కూడా చేయొచ్చు. ముఖ్యమైన ఇన్​ఫర్మేషన్​ లేదా ఇతర సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో యూజర్స్​ ఇన్​ స్టా నుంచి బ్రేక్ తీసుకోవాలనో లేదా పర్మినెంట్​గా అకౌండ్​ డిలీట్​ చేయాలనో అనుకుంటారు. అలాంటప్పుడు మన ఖాతాలోని చాట్స్​, పోస్టులు, స్టోరీస్​ లేదా ఇంకేమైనా ముఖ్యమైన సమాచారం పోతుందనే భయం యూజర్స్​కు ఉంటుంది. దాన్ని ఎలా సేవ్ చేయాలో అనే ఆలోచన, సందేహం కూడా ఉంటుంది.


అయితే ఇకపై అలాంటి టెన్షన్​ ఏమీ అక్కర్లేదు. ఇన్​ స్టాలో ఓ హ్యాండీ ఫీచర్ ఉంటుంది. ఆ ఫీచర్ తో మీ అకౌంట్ డేటా, అలానే మెమరీస్​, యాక్టివిటీని డౌన్​లోడ్ చేసుకోవచ్చు. అది కూడా పెద్దగా ఎటువంటి మార్పులు లేకుండానే. ఈ ఫీచర్ ను ఎలా యాక్టివేట్ చేయాలి అనే విషయం స్టెప్​ బై స్టెప్​ తెలుసుకుందాం.

స్టెప్​ 1 : మీ ఫోన్​లో ఇన్​స్టా గ్రామ్ ఓపెన్ చేయాలి.

స్టెప్​ 2 : ప్రొఫైల్ పేజీలోకి వెళ్లి రైట్ కార్నర్​లో ఉన్న మూడు డాట్లపైన ట్యాప్ చేయాలి.

స్టెప్​ 3 : పాప్​ అప్​ మెనూలోని యువర్​ యాక్టివిటీపై క్లిక్ చేయాలి.

స్టెప్​ 4 : కిందకీ స్క్రోల్​ చేసి డౌన్​లోడ్ యువర్ ఇన్​ఫర్మేషన్​పై క్లిక్ చేయాలి.

స్టెప్​ 5 : డౌన్​లోడ్ లేదా ట్రాన్స్​ఫర్​ ఇన్​ఫర్మేషన్​పై ట్యాప్ చేసి, మీకు కావాల్సిన ఇన్​ఫర్మేషన్​ను సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్​ 6 : మెసేజెస్​, కంటెంట్​ లేదా ఇతర సమాచారాన్ని సేవ్ చేసుకుని, నెక్ట్స్​పై క్లిక్​ చేయాలి.

స్టెప్​ 7 : అప్పుడు మీ డివైస్​లోకి డౌన్​లోడ్​ చేసుకోవచ్చు, లేదంటే క్లౌడ్ స్టోరేజ్​కు ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు.

స్టెప్ 8 : అలానే డేట్ రేంజ్​ కూడా సెలెక్ట్ చేసుకోని, ఈమెయిల్ ఐడీ యాడ్​ చేసుకోవాలి. కావాల్సిన మీ డేటా ఫార్మాట్​, మీడియా ఫైల్స్​ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్రియేట్ ఫైల్స్​పై ట్యాప్ చేయాలి.

ఇప్పుడు Download to device ను ఎంచుకుంటే ఫైల్స్ అన్నీ డౌన్ లోడ్ మోడ్ లో కనిపిస్తాయి. ఇప్పుడు వాటిని డౌన్లోడ్ చేసుకుంటే మీ డౌన్లోడ్స్ లో సేవ్ అయిపోతాయి. లేదా ఈ డేటాను క్లౌడ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డేటా అంతా మీ ఈ మెయిల్ లో సేవ్ అయిపోతుంది.

ALSO READ : ఫింగర్ ప్రింట్స్, DNA టెస్ట్ లేకుండానే లేకుండానే నేరస్తులను పట్టేయొచ్చు, సరికొత్త పద్దతిని కనిపెట్టిన శాస్త్రవేత్తలు!

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×