RAPO22: ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం వరుస ప్లాపులతో ఉన్న విషయం తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నుంచి ఒక్క హిట్ కూడా వచ్చింది లేదు. దివారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్.. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయలను అందుకున్నాయి. ప్రస్తుతం రామ్ కు ఒక మంచి హిట్ కావాల్సి ఉంది. దీనికోసం ఈ కుర్ర హీరో ఒక మంచి కాంబోనే సెట్ చేసినట్లు తెలుస్తుంది. ఎప్పటినుంచో రామ్- మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా కూడా ప్రకటించారు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మహేష్ బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక నేడు RAPO22 పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. హైదరాబాదులో జరిగిన ఈ పూజా కార్యక్రమాలకు చిత్ర బృందంతో పాటు టాలీవుడ్ ప్రముఖ దర్శకులు హాజరయ్యారు. ఇక ఈ చిత్రంలో రామ్ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.
Allu Arjun: ఎన్ని వివాదాలు వచ్చినా వైసీపీ ఫ్రెండ్ ను వదులుకొని బన్నీ.. అదిరా ఐకాన్ స్టార్ అంటే..?
భాగ్యశ్రీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే ఈ చిన్నది టాలీవుడ్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది .హరీష్ శంకర్- రవితేజ కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో ఈ చిన్నది తెలుగు తెరకు పరిచయమైంది.
మొదటి సినిమాతోనే అమ్మడు స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకుంటుందని నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. అయితే మిస్టర్ బచ్చన్ పరాజయాన్ని అందుకోవడంతో అమ్మడికి కొంత నిరుత్సాహం ఏర్పడింది. ఇక దీంతో భాగ్యశ్రీ తన సినిమాలను ఆచితూచి ఎంచుకోనున్నట్లు తెలుస్తుంది.
Sarangapani Jathakam Teaser: కుమారీ ఆంటీలాగా అమాయకంగా ఉండే ప్రియదర్శి.. ఇలా తయ్యారయ్యాడేంటి?
ఇక రామ్ 22వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్ ఒప్పుకోవడం ఆమెకు దొరికిన మరో మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి. రామ్ పక్కన భాగ్యశ్రీ ఎంతో అందంగా కనిపించింది. దీంతో వారి అభిమానులు జంట చాలా బాగుంది.. వీరికి హిట్టుపడితే ఇంకా బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమా వీరిద్దరికీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
The journey of #RAPO22 begins with an auspicious pooja ceremony ✨
Blockbuster directors @megopichand switched on the camera, @hanurpudi gave the clap & @VenkyKudumula directed the first shot.
Young directors @ShivaNirvana & @pavansadineni graced the event and extended their… pic.twitter.com/gdy4HlXqQr
— Mythri Movie Makers (@MythriOfficial) November 21, 2024