Sarangapani Jathakam Teaser: కామెడియన్స్‌గా కెరీర్లను స్టార్ట్ చేసి వారికంటూ కొంత ఫేమ్ వచ్చిన తర్వాత హీరోలుగా మారడం చాలా కామన్. కానీ అలా కామెడియన్స్ నుండి హీరోలు అయినవారు ఎక్కువగా సక్సెస్ సాధించలేకపోయారు. స్క్రిప్ట్ సెలక్షన్ బాగుంటే అటు కామెడియన్‌గా, ఇటు హీరోలుగా సక్సెస్ సాధించిన వారు కూడా ఉన్నారు. ప్రియదర్శి కూడా అదే కేటగిరిలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా ఆకట్టుకున్న ప్రియదర్శి.. ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam) అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ బయటికొచ్చింది.
గుడ్డి నమ్మకం
‘‘మన జీవితం మొత్తం మన చేతుల్లోనే రాసుంటుంది’’ అనే డైలాగ్‌తో ‘సారంగపాణి జాతకం’ టీజర్ మొదలవుతుంది. జాతకాలను, రాశి ఫలాలను గుడ్డిగా నమ్మే సారంగపాణి పాత్రలో ప్రియదర్శి కనిపిస్తాడు. ‘‘ఈరోజు మధ్యాహ్నం లోపు మీరు ఊహించని అద్భుతం జరగబోతుంది’’ అని పేపర్‌లో వచ్చిన రాశి ఫలాలను కూడా నమ్మి ముందుకు వెళ్లే క్యారెక్టర్ తనది. ‘‘సారంగం అనే ధనుస్సు చేతులో ఉన్నవాడే సారంగపాణి’’ అంటూ ఆ పేరుకు అర్థం చెప్తాడు అవసరాల శ్రీనివాస్ (Srinivas Avasarala). ఈ మూవీలో తను ఒక మోడర్న్ జ్యోతిష్యుడిగా కనిపించనున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతుంది. అందుకే తన జాతకం చూపించకోవడానికి శ్రీనివాస్‌ను కలుస్తాడు ప్రియదర్శి (Priyadarshi).
Also Read: హీరో నిఖిల్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా..?
విరుగుడు లేదు
జాతకాలు పిచ్చి ఉన్న ప్రియదర్శికి జోడీగా రూప కొడువాయూర్ (Roopa Koduvayur) నటించింది. హీరోను ఇష్టపడి ముందుగా తానే ప్రపోజ్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ సంతోషంగా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంటారు. అప్పుడే విలన్‌గా తనికెళ్ల భరణి ఎంట్రీ ఇస్తారు. అసలు ఆయన పాత్ర ఏంటి అని టీజర్‌లో పెద్దగా రివీల్ చేయలేదు. ఇక జాతకాలను నమ్మే ప్రియదర్శికి తన జాతకంలో ఒక మర్డర్ చేసినట్టుగా ఉంటుందని శ్రీనివాస్ అవసరాల చెప్తాడు. అప్పటినుండి తనకు ప్రతీరోజూ ఎవరో ఒకరిని మర్డర్ చేసినట్టుగా కలలు వస్తుంటాయి. దానికి విరుగుడు చెప్పమని శ్రీనివాస్‌ను బెదిరిస్తాడు ప్రియదర్శి. ‘‘నా దగ్గర విరుగుడు మంత్రాలు, తాయత్తలు ఉండవు’’ అంటూ తప్పుకుంటూ శ్రీనివాస్ అవసరాల.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
‘‘అయినా నాలాంటి ప్రాక్టికల్ మనిషికి ఇలాంటి జాతకాలు పిచ్చోడు కొడుకుగా ఎలా పుట్టాడే’’ అంటూ ప్రియదర్శి తండ్రి ఆశ్చర్యపోతుంటాడు. ‘‘నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఆఫీస్’’ అంటూ సాగిపోయే సారంగపాణి జీవితంలో రానున్న ట్విస్ట్ ఏంటి అనేది ‘సారంగపాణి జాతకం’ కథ. ఇక ఈ టీజర్ క్లైమాక్స్‌లో ‘‘కుమారీ ఆంటీలాగా అమాయకుడిగా ఉండేవాడివి. జాలీ జోసెఫ్‌లాగా తయారయ్యావు’’ అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. మోహన కృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti) తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమయ్యింది. ఈ టీజర్ చూస్తుంటే ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అలరించనుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు.