Apple Deals: ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. ఐఫోన్ 16 ఇప్పుడు భారీగా డిస్కౌంట్ ధరను ప్రకటించింది. ఐఫోన్ 16 ఇప్పుడు దీని ప్రారంభ ధర కంటే రూ. 10,000 తక్కువ ధరకు అందించనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ ఆఫర్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇదే అతిపెద్ద తగ్గింపు ధర కావడం విశేషం. అయితే ఈ మోడల్ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆపిల్ ఐఫోన్ 16.. 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌తో, 800 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. డిస్‌ప్లే డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో అనుకూలంగా ఉంటుంది. ఇది ఐఫోన్ 16 వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. దీనిలో శక్తివంతమైన A18 బయోనిక్ చిప్‌సెట్‌ని ఉపయోగించారు. ఇది ఫోన్ ప్రదర్శనను మరింత మెరుగుపరుస్తుంది.
వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 12MP సెకండరీ కెమెరా ఉన్నాయి. దీని ద్వారా వినియోగదారులు అద్భుతమైన ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఈ ఫోన్ iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇది ఆపిల్ తాజా ఇంటెలిజెన్స్ ఫీచర్లతో లభిస్తుంది. ఇది క్యాప్చర్ బటన్‌ను కూడా కలిగి ఉంది. ఇది ఫోటోగ్రఫీ ప్రియులకు మంచి ఆప్షన్‌గా ఉంటుంది. మెకానికల్, సాఫ్ట్‌వేర్ పరంగా ఐఫోన్ 16 చాలా రిచ్‌గా ఉంటుంది. ఇది వినియోగదారులకు అప్‌గ్రేడ్ చేసిన అనుభవాన్ని అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఐఫోన్ 16 128GB వేరియంట్ అసలు ధర రూ. 79,900 కాగా, ప్రస్తుత ధర రూ. 69,999గా ఉంది. గత సంవత్సరం సెప్టెంబర్లో ఈ మోడల్ ప్రారంభ ధరగా రూ. 79,900గా నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఈ ఫోన్ ధరలో రూ. 9,901 తగ్గింపు వచ్చింది. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేసే కస్టమర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తున్నారు. దీంతో ఐఫోన్ 16 128GB వేరియంట్‌ను కస్టమర్లు దాదాపు రూ. 65,000కే కొనుగోలు చేయచ్చు. అంతేకాకుండా ఐఫోన్ 16లో అప్‌గ్రేడ్ చేసుకునే వారికి రూ. 60,200 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ఈ భారీ ధర తగ్గింపు ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 కోసం కూడా వర్తించనుంది. ఐఫోన్ 15 128GB వేరియంట్ ప్రారంభ ధరను కూడా రూ. 69,900గా నిర్ణయించారు. కానీ ప్రస్తుతం ఐఫోన్ 16 విడుదల తరువాత ఐఫోన్ 15 ధరను రూ. 10,000 తగ్గించారు. ప్రస్తుతం ఐఫోన్ 15 128GB వేరియంట్ ధర రూ. 64,999గా ప్రకటించారు. అలాగే, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా దీనిని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.