ఎండాకాలం రాగానే చాలా మంది ఫ్రిజ్ ను బాగా ఉపయోగిస్తుంటారు. మంచి నీళ్ల నుంచి మొదలుకొని పండ్ల వరకు ఫ్రిజ్ లోనే నిల్వ చేస్తారు. మిగిలిపోయిన ఫుడ్ తో పాటు ఎగ్స్, ఇతరత్రా కూరగాయలు, ఫ్రిజ్ లో ఉంచుతారు. కానీ, ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీయడంలో ఫ్రిజ్ కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. వేసవిలో ఫ్రిజ్ ఉపయోగించడం వల్ల అనేక రోగాలు వస్తాయంటున్నారు. ఫ్రిజ్ లో ఉంచిన నీళ్లు, పండ్లు కూడా ఆరోగ్యానికి హాని చేస్తాయంటున్నారు.
ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా?
వేసవిలో చాలా మంది కామన్ గా బయలకు వెళ్లి రాగానే ఫ్రిజ్ లో నుంచి తీసిన చల్లటి నీటిని తాగుతారు. కూల్ వాటర్ తాగగానే హాయిగా అనిపిస్తుంది. ఒంట్లో వేడి అంతా తొలగిపోతుంది. కానీ, ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుందంటున్నారు. చల్లటి నీళ్లు ఎప్పుడైనా ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని కలుగజేస్తాయంటున్నారు. బరువు పెరిగేలా చేయడంతో పాటు గుండె జబ్బులకు కారణం అవుతుందంటున్నారు. వేడి నుండి ఉపశమనం పొందేందుకు చల్లటి నీళ్లు తాగుతున్నప్పటి జీర్ణ సమస్యలు, తలనొప్పి, బరువు పెరగడం, గొంతు సంబంధ సమస్యలు కలుగుతాయంటున్నారు. కొన్నిసార్లు ఊపిరి తిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
ఫ్రిజ్ లో ఉన్న పండ్లు ఆరోగ్యానికి మంచిది కాదా?
ఇక ఫ్రిజ్ లో నిల్వ చేసిన పండ్లను తినడం కూడా మంచిది కాదంటున్నారు. ఫ్రిజ్ లో ఎక్కువ కాలం నిల్వ చేసిన పండ్లను వెంటనే బయటకు తీసి కట్ చేసి తినడం వల్ల శరీరానికి పోషకాలు అందకపోగా, ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. చల్లని పండ్లు శరీరం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయంటున్నారు. కడుపు, గొంతు సంబంధిత సమస్యలు కూడా కలుగుతాయి. చల్లని పండ్లు జలుబు, దగ్గు వంటి లాంటి సమస్యలకు కారణం అవుతాయి. పండ్లు గడ్డకట్టడం వల్ల వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు లేకుండా పోతాయి. పండ్లు అతిగా చల్లబడగానే వాటిలోని పోషకాలు కోల్పోతాయని చెప్తున్నారు. అందుకే, వీలైనంత వరకు పండ్లను బయటే ఉంచాలని చెప్తున్నారు.
Read Also: వీటిని పొరపాటున కూడా ఫ్రిజ్‌లో.. పెట్టకూడదు తెలుసా ?
గుండె పోటుకు కారణమే ఫ్రిజ్ ఫుడ్స్!
ఈ రోజుల్లో గుండె పోటు రావడానికి ప్రధాన కారణం ఫ్రిజ్ ను అతిగా వాడటమే అంటున్నారు నిపుణులు. ఫుడ్ ను ఫ్రిజ్ లో నిల్వ చేసినప్పటి నుంచి గుండెపోటు ముప్పు పెరిగిందంటున్నారు. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల నాన్ వెజ్ ను ఫ్రిజ్ లో నిల్వ చేయడంతో పాటు విపరీతమైన వేడి మీద ఫుడ్ తయారు చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు అన్నీ కోల్పోయి, శరీరానికి హాని కలించే పదార్థాలు తయారవుతున్నాయని చెప్తున్నారు. ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల విపరీతమైన గుండె జబ్బులు వస్తున్నాయని నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత వరకు ఫ్రిజ్ ఉపయోగించడం తగ్గించాలని చూసిస్తున్నారు. వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగడం కంటే కుండలో నీళ్లు తాగడం మంచిదంటున్నారు.
Read Also: టర్కీకి చెక్కేస్తున్న బట్టతల బాధితులు.. ఇంతకీ అక్కడి ప్రత్యేకత ఏమిటో తెలుసా?