E-Paper
Advertisement

Apple : యాపిల్ ప్రియులకు గుడ్ న్యూస్..

Apple : యాపిల్ ప్రియులకు గుడ్ న్యూస్..

Apple : యాపిల్ ప్రియులకు గుడ్ న్యూస్. ఐఫోన్ 16 ప్రో ప్రస్తుతం మార్కెట్​లోకి రూ.1,16,300కే అందుబాటులోకి వచ్చేసింది. అయితే వాస్తవానికి దీని అసలు ధర రూ.1,19,900. బ్యాంక్ ఆఫర్స్ ద్వారా రూ.1,11,800కే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్​కు 6.3 అంగుళాల డిస్​ ప్లే, ఏ18 ప్రో చిప్​సెట్​, 48 మెగా పిక్సల్ కెమెరా ఉన్నాయి. ఇంతకీ ఈ ఆఫర్​కు ఐఫోన్ 16 ప్రోను ఎక్కడ, ఎలా కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం. అలానే అసలు ఇప్పుడు ఈ సేల్స్​లో కొనడం కరెక్టా కాదా కూడా తెలుసుకుందాం.

యాపిల్ లేటెస్ట్ ప్లాగ్​షిప్​ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 16 ప్రో. ఈ ఫోన్ ఈ ఏడాది సెప్టెంబర్ గ్లోటైమ్​లో లాంఛ్​ అయింది. యాపిల్ లవర్స్​ కోసం ఎంతో ఆకర్షణీయమైన డిజైన్​తో రూపొందించబడింది. ఇప్పుడీ ఫోన్​ మాసివ్ డిస్కౌంట్​తో అందుబాటులోకి వచ్చింది.

ఇండియాలో ఐఫోన్ 16 ప్రో ధర ఎంత తగ్గిందంటే? –

ఇండియా మార్కెట్​లో ఐఫోన్ 16 ప్రో రూ.1,19,900కు లాంఛ్ అయింది. 128 జీబీ స్టోరీజ్ వేరియంట్ ఇది. అయితే ఇప్పుడు విజయ్ సేల్స్​లో ఈ ఫ్లాగ్​షిప్ డివైస్ రూ.1,16,300కు అందుబాటులోకి వచ్చింది. దీనికి అడిషనల్ బ్యాంక్ డిస్కౌండ్​ ఆఫర్ కూడా ఉంది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కార్డ్​పై రూ. 4500, ఐసీఐసీఐ, ఎస్​బీఐ కార్డ్స్​పై రూ.4 వేల డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ రూ.1,11,800కు అందుబాటులో లభిస్తోంది. ఒకవేళ మీ పాత స్మార్ట్ ఫోన్ను ఎక్స్చేంజ్ చేసినట్లయితే, రూ. 6,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్​ను కూడా పొందవచ్చు. కాబట్టి మీ దగ్గర ప్రస్తుతం బడ్జెట్ ఉంటే ఈ స్మార్ట్ ఫోన్​ను ప్రస్తుతం కొనొచ్చు!

కాగా, ఈ విజయ్​ సేల్స్​, డిసెంబర్ 29 నుంచి జనవరి 05 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్ ద్వారా విజయ్ కంపెనీ అనేక రకాల యాపిల్ ప్రొడక్ట్స్ పై మంచి డిస్కౌంట్​లను అందిస్తోంది. ఈ సేల్​లో భాగంగా విజయ్ సేల్స్ ఐఫోన్స్, యాపిల్ వాచెస్, ఐప్యాడ్స్, మ్యాక్ బుక్స్, ఎయిర్ పాడ్స్, ఇతర యాపిల్ యాక్ససరీస్ పై మంచి డిస్కౌంట్ లను అందిస్తోంది. ఒకవేళ మీకు నచ్చిన ప్రోడక్ట్​ను ఐసీఐసీఐ బ్యాంకు కార్డు లేదా ఎస్​బీఐ క్రెడిట్ కార్డు, కోటక్ మహీంద్రా బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, అదనంగా రూ. 10,000 వరకు డిస్కౌంట్​ను పొందవచ్చు.

స్పెసిఫికేషన్స్​ –

వేరియంట్ – 128, 256, 512 జీబీ, 1 టీబీ
డిస్‌ప్లే – 6.3 అంగుళాలు, సూపర్ రెటీనీ ఎక్స్​డీఆర్​ డిస్​ప్లే
కెమెరా – 48 మెగా పిక్సెల్‌ (మెయిన్‌ కెమెరా), 12 మెగా పిక్సెల్‌ (ఫ్రంట్‌ కెమెరా)
ఛార్జర్‌ – సీటైప్‌
కలర్స్‌ – బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, నేచురల్ టైటానియం, డిజర్ట్‌ టైటానియం

ఈ ఐఫోన్ 16 ప్రో 6.3 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్​డీఆర్​ డిస్​ప్లేతో

చ్చింది. ఈ ప్రో లైనప్​లో లేటెస్ట్​ జనరేషన్ సిరమిక్ షీల్డ్​తో వచ్చింది. ఇతర స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే రెండింతలు బలంగా ఉంటుంది. అలాగే 3 నానోమీటర్ ప్రాసెస్ ద్వారా ఏ18 ప్రో చిప్​సెట్​ను అమర్చారు. ఇంకా ఇందులో 16 కోర్ న్యూరల్ ఇంజిన్​ కలిగిన 6 కోర్​ సీపీయూ, జీపీయూ ఉన్నాయి.
ఇక కెమెరా విషయానికొస్తే 48 మెగా పిక్సల్ ఫ్యూజర్ కెమెరా ఉంది. దీంతో డాల్బీ విజన్​లో 4కే 120ఎప్​పీఎస్ విజువల్ రికార్డ్​​ చేయొచ్చు. అలాగే 48 మెగా పిక్సల్​ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉపయోగించారు. 5x టెలిఫొటో లెన్స్​ను కూడా అమర్చారు.

ALSO READ : పోస్ట్ మాస్టర్ ను టార్గెట్ చేశారు.. ఏకంగా దోచేశారు!

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×