Shruti Haasan: పేరుకే విశ్వనటుడు కమలహాసన్ (Kamal Haasan)కూతురైనా.. తన సొంత టాలెంట్ తో నేడు పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు దక్కించుకుంది శృతిహాసన్(Shruti Haasan). ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. వరుస ఫ్లాప్లు చుట్టు ముట్టడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేయించుకుంది. కానీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో తనలోని నటన కనబరిచి, మళ్లీ వెనుతిరిగి చూడలేదు.ఐరన్ లెగ్ అన్న వారి నోటి నుంచే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు హీరోయిన్గా మరొకవైపు సింగర్ గా కూడా తనలోని టాలెంట్ ని నిరూపించుకుంటూ స్టార్ హోదాను దక్కించుకుంది.
తల్లిదండ్రుల వల్లే మద్యానికి బానిసయ్యా..
గతేడాది ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన ‘సలార్’ సినిమాలో హీరోయిన్ గా చేసి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. హీరోయిన్ గానే కాదు యాక్షన్ చిత్రాలలో కూడా నటించగలను అని నిరూపించింది. ఇదిలా ఉండగా తాజాగా తన తల్లిదండ్రుల పై ఊహించని కామెంట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. తన తల్లిదండ్రుల వల్లే మద్యానికి బానిస అయ్యాను అంటూ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాలన్నీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ వెల్లడించింది.
ఆరోగ్యం క్షీణించింది.. పిచ్చిదాన్ని అయిపోయా..
శృతిహాసన్ మాట్లాడుతూ.. ” నాకు భగవంతుడి పైన ఎంతో నమ్మకం ఉంది. కానీ మా నాన్న కారణంగానే నేను గుడికి కూడా వెళ్లలేకపోయాను. ఆయన నన్నే కాదు మా ఇంట్లో ఎవరిని కూడా గుడికి వెళ్ళనిచ్చేవాడు కాదు. నేను తరచూ చర్చికి కూడా వెళ్ళేదాన్ని. అయితే ఈ విషయం మాత్రం మా నాన్నకు చాలా కాలంగా తెలియదు. తాతయ్యతో కలిసి వెళ్లినా సరే ఆ విషయం నాన్నకు చెప్పలేకపోయాను.. అయితే నేను నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే దేవుడిపై నాకున్న నమ్మకమే. కానీ మా నాన్నకు అది నచ్చలేదు. అయితే నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మానాన్న విడిపోయారు. బాల్యం నుండి యవ్వనంలోకి మారుతున్న సమయంలో నా తల్లిదండ్రులు విడిపోవడం నన్ను మరింత మానసిక వేదనకు గురిచేసింది. ఈ సంఘటన వల్లే నేను మద్యానికి బానిసయ్యాను. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చిదాన్ని అయిపోయాను. ఇక ఆరోగ్యం క్షీణించింది. ఇక్కడ అందరికీ తెలియని అసలైన నిజం ఏంటంటే మా అమ్మ నాన్న విడిపోవడమే. నేను ఇలా తయారవ్వడానికి కారణం అదే” అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది శృతిహాసన్. ఏది ఏమైనా తల్లిదండ్రులు విడిపోవడం వల్లే మద్యానికి బానిస అయ్యాను అని చెప్పి అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది శృతిహాసన్. ప్రస్తుతం శృతిహాసన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
డెకాయిట్ మూవీ నుండి తప్పుకున్న శృతిహాసన్..
ఇదిలా ఉండగా సలార్ మూవీ తర్వాత అడివి శేష్ (Adivi Shesh) హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. కానీ నిర్మాతలతో వచ్చిన విభేదాల వల్లే ఈ సినిమా నుండి తప్పుకుంది శృతిహాసన్. అంతేకాదు రూ.2.50కోట్ల రెమ్యూనరేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈమె ఈ మొత్తాన్ని కూడా వదులుకుందని చెప్పవచ్చు.