Triptii Dimri: హీరోయిన్స్ అనేవారు ప్రేక్షకులకు క్రష్ అవ్వాలంటే ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ ఒక్కటి చేసినా చాలు.. అలా చిన్న పాత్రలతోనే ఇంపాక్ట్ క్రియేట్ చేసిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. ఆ లిస్ట్‌లో తృప్తి దిమ్రీ కూడా యాడ్ అయ్యింది. 2023 డిసెంబర్‌లో విడుదలయిన ‘యానిమల్’ సినిమాలో తృప్తి దిమ్రీ ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఆ చిన్న పాత్రే తన లైఫ్‌ను మార్చేసింది. ఆ మూవీ విడుదలయ్యి ఏడాది అవుతున్నా ఇప్పటికీ తృప్తి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం ప్రేక్షకుల మైండ్‌లో నుండి పోలేదు. దానివల్లే 2024లో ఒక అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.
క్రేజీ హీరోయిన్
ప్రతీ ఏడాది ముగిసే సమయానికి ఆ ఏడాదిలో ఎక్కువమంది సెర్చ్ చేసిన హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని బయటపెడుతుంది గూగుల్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నా కూడా వారందరినీ వెనక్కి నెట్టి తృప్తి దిమ్రీ అత్యధికంగా సెర్చ్ చేసిన హీరోయిన్‌గా రికార్డ్ దక్కించుకుంది. ఇది ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2023 డిసెంబర్‌లో ‘యానిమల్’ సినిమా విడుదలయిన కొత్తలో తృప్తిని నేషనల్ క్రష్‌గా ప్రకటించేశారు ఫ్యాన్స్. అప్పటినుండి తన క్రేజ్ మామూలుగా లేదు. హీరోయిన్‌గా దాదాపు అరడజను ఆఫర్లు వచ్చి తనపై పడ్డాయి. దీంతో తృప్తి క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతూ ఉంది. అలా 2024లో అత్యధిక సెర్చ్ చేసిన హీరోయిన్‌గా రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది.
Also Read: 25 ఏళ్ల రజినీకాంత్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన రాజమౌళి.. చెప్పి మరీ సాధించాడుగా!
గెస్ట్ రోల్ మాత్రమే
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ మూవీ రణబీర్ కపూర్ హీరోగా నటించాడు. తనకు జోడీగా రష్మిక మందనా నటించింది. అందులో తృప్తి దిమ్రీ ఒక గెస్ట్ రోల్ మాత్రమే చేసింది. కేవలం ఒక సీన్‌లో, ఒక సాంగ్‌లో మాత్రమే కనిపించింది. అయినా రష్మికను ప్రేక్షకులు ఎంతగా గుర్తుపెట్టుకున్నారో.. తృప్తిని కూడా అదే రేంజ్‌లో ఆదరించారు. ‘యానిమల్’ (Animal) కంటే ముందు తృప్తి దిమ్రీ హీరోయిన్‌గా మూడు సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాల గురించి చాలామంది ఆడియన్స్‌కు తెలియదు. ‘యానిమల్’లో తనను మొదటిసారి చూసిన ప్రేక్షకులు.. అసలు తను ఎవరు అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
రెండు హిట్లు
‘యానిమల్’ తర్వాత ఏడాది గ్యాప్‌లోనే తృప్తి దిమ్రీ (Triptii Dimri) హీరోయిన్‌గా నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. అవి హిట్ అయినా కాకపోయినా తనకు ఆఫర్లు రావడం మాత్రం ఆగడం లేదు. చాలామంది యంగ్ హీరోల సినిమాలు ప్రస్తుతం తన ఖాతాలో ఉన్నాయి. ముందుగా కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించిన ‘భూల్ భూలయ్యా 3’లో లీడ్ రోల్ చేసింది తృప్తి. ఆ మూవీ ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సూపర్ హిట్‌గా నిలిచింది. అలా తృప్తి దిమ్రీ చేతిలో రెండు బ్లాక్‌బస్టర్ హిట్లు ఉన్నాయి. ఆ తర్వాత తను హీరోయిన్‌గా నటించిన ‘బ్యాడ్ న్యూస్’, ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ మాత్రం డిశాస్టర్లుగా నిలిచాయి.