BigTV English
Advertisement

iPhone 16 Pro: సమయం ఆసన్నమైంది.. ఫీచర్లు పిచ్చెక్కిస్తున్నాయ్, 4కె వీడియో రికార్డింగ్‌తో ఐఫోన్ 16 ప్రో!

iPhone 16 Pro: సమయం ఆసన్నమైంది.. ఫీచర్లు పిచ్చెక్కిస్తున్నాయ్, 4కె వీడియో రికార్డింగ్‌తో ఐఫోన్ 16 ప్రో!

iPhone 16 series: ప్రముఖ అమెరికన్ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Appleకి ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ ఫోన్లు అధిక ధరలో ఉన్నా.. కొనేందుకు కొందరు వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే వినియోగదారుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని యాపిల్ కంపెనీ కొత్త కొత్త సిరీస్‌లను మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. ఇప్పటికే ఐఫోన్ 15 సిరీస్‌ను మార్కెట్‌లో విక్రయిస్తుంది. త్వరలో తన లైనప్‌లో ఉన్న ఐఫోన్ 16 సిరీస్‌ను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. iPhone 16 సిరీస్ వచ్చే వారం లాంచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.


ఈ iPhone 16 సిరీస్‌లో iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Proతో సహా iPhone 16 Pro Max వంటి మోడల్స్ ఉండే అవకాశం ఉంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ల గురించి కొంత సమాచారం లీక్ అందింది. ఈ సిరీస్‌లోని iPhone 16 Pro, iPhone 16 Pro Maxలో వీడియో రికార్డింగ్‌కు సంబంధించిన ఇంప్రూవ్‌మెంట్స్ ఉండే అవకాశం ఉంది. ఓ నివేదిక ప్రకారం.. iPhone 16 Pro, iPhone 16 Pro Max లు 48-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కలిగి ఉండవచ్చని తెలుస్తుంది.

5x ఆప్టికల్ జూమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌లలో టెట్రాప్రిజం లెన్స్‌ను అందించినట్లు సమాచారం. ఈ లెన్స్ గత సంవత్సరం ప్రవేశపెట్టిన ఐఫోన్ 15 సిరీస్‌లోని ప్రో మాక్స్‌లో మాత్రమే ఇవ్వబడింది. ఇప్పుడు ఐఫోన్ 16 ప్రో వేరియంట్‌లలో సెకనుకు 120 ఫ్రేమ్‌ల (ఎఫ్‌పిఎస్) వద్ద 4కె వీడియో రికార్డింగ్ చేయవచ్చని ఈ నివేదికలో చెప్పబడింది. అయితే ప్రో మోడల్స్‌లోని అన్ని కెమెరాలలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందా లేదా అనేది తెలియదు. Samsung Galaxy S24 Ultra, Samsung Galaxy Z Fold 6, Vivo X100 Ultra వంటి Android స్మార్ట్‌ఫోన్‌లు 120 FPS వద్ద 4K రికార్డింగ్‌ను కలిగి ఉన్నాయి. ఇటీవల టెక్ బ్లాగర్ ఎంక్వాన్ సోషల్ మీడియాలో ఒక వీడియో టీజర్‌ను పంచుకున్నారు.


Also Read: ఆగండి ఆగండి.. ఐఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్, వేలల్లో పొందొచ్చు!

ఇందులో ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లను కొత్త కాఫీ కలర్‌లో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ల కెమెరా ఐస్‌ల్యాండ్ రెండు-టోన్ ఫినిష్‌ను కలిగి ఉండవచ్చు. అంతేకాకుండా కెమెరా చుట్టూ రౌండ్ సిల్వర్ రింగ్, బయటి ఫ్రేమ్‌లో బ్రౌన్ కలర్ రింగ్ ఉంటుంది. iPhone 16 Pro ఫోన్ 6.3 అంగుళాల స్క్రీన్‌ని పొందే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ దాని ప్రాసెసర్‌గా A18 ప్రోని కలిగి ఉండవచ్చు. iPhone 16 Proలో 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా అందించబడుతుంది. ఇది కాకుండా టెక్‌బాయిలర్.. ఐఫోన్ 16 ప్రో మాక్స్‌కి సంబంధించిన డమ్మీ యూనిట్‌ను చూపించే వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది.

ఇది డెసర్ట్ టైటానియం కలర్‌లో ఉంటుంది. ఇది iPhone 15 సిరీస్‌లోని ప్రో మోడల్‌ల మాదిరిగానే సైడ్ గ్రిల్స్‌పై క్రోమ్ ఫినిష్‌తో కూడిన మాట్టే ఆకృతి గల బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉండవచ్చు. ఐఫోన్ 16 ప్రో మాక్స్ డమ్మీ యూనిట్ కూడా దాని డిజైన్‌ను సూచించింది. పవర్, వాల్యూమ్, యాక్షన్ బటన్‌లతో పాటు, కొత్త క్యాప్చర్ బటన్‌ను కూడా ఇందులో ఇవ్వవచ్చు. ఈ బటన్‌తో వినియోగదారులు కెమెరాను ఆన్ చేయడం లేదా వీడియో తీయడం వంటివి చేసుకోవచ్చు.

 

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×