BigTV English

iPhone 15 Plus Price Drop: ఆగండి ఆగండి.. ఐఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్, వేలల్లో పొందొచ్చు!

iPhone 15 Plus Price Drop: ఆగండి ఆగండి.. ఐఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్, వేలల్లో పొందొచ్చు!

iPhone 15 Plus Price Drop: ప్రముఖ దిగ్గజ స్మార్ట్‌ఫోన్ యాపిల్ ఐఫోన్ అంటే అందరికీ ఇష్టమే. ధర ఎంతున్నా కొనేందుకు కొందరు వెనుకాడరు. అందువల్లనే ఐఫోన్లకు ప్రపంచ మార్కెట్‌లోనే కాకుండా దేశీయ మార్కెట్‌లోనూ డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో యాపిల్ కంపెనీ కొత్త కొత్త సిరీస్‌లను మార్కెట్‌లో పరిచయం చేసి ఐఫోన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. అయితే వీటి ధరలు భారీగా ఉండటంతో కొనుక్కోవాలనుకున్నా మరికొందరు తమ కోరికలను చంపుకుంటున్నారు. అలాంటి వారికి ఇప్పుడొక గుడ్ న్యూస్. ఎందుకంటే ఐఫోన్‌పై అత్యంత భారీ తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.


యాపిల్ కంపెనీ తన లైనప్‌లో ఇప్పటికి iPhone 15 Plus సహా iPhone 15 సిరీస్‌ను 2023 సెప్టెంబర్‌లో లాంచ్ చేసింది. అందులో iPhone 15, iPhone 15 Pro, iPhone 15 Pro Max వంటి మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్ అధిక ధరతో కూడుకున్నవి. అందువల్ల ఈ మోడల్స్‌పై ఎప్పుడెప్పుడు ఆఫర్లు వస్తాయా అని చాలా మంది ఐఫోన్ ప్రియులు ఆసక్తతిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో Apple iPhone 16 సిరీస్ సెప్టెంబర్ 9న ఆవిష్కరించబడుతోంది. దీంతో దీనికి ముందు సిరీస్ అయిన ఐఫోన్ 15 సిరీస్‌లోని ఒక మోడల్‌ ధర అమాంతంగా తగ్గింది. iPhone 16 సిరీస్ లాంచ్‌కు ముందు A16 బయోనిక్ చిప్‌సెట్-బ్యాక్డ్ iPhone 15 Plus ధర భారతదేశంలో భారీగా తగ్గింది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు చేయబడింది. ఇప్పుడు దీని ధర, స్పెసిఫికేషన్లు, ఆఫర్ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

iPhone 15 Plus Specifications


Also Read: దూకుడు పెంచిన రెడ్‌మి.. రూ.11000 లకే కొత్త 5జీ ఫోన్.. ఫీచర్లు దుమ్ము దులిపేశాయ్..!

iPhone 15 Plus స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది A16 బయోనిక్ చిప్‌సెట్‌తో ఆధారితమైనది. USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో ప్రారంభించబడిన మొదటి ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇది ఒకటి. ఆప్టిక్స్ కోసం డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 48-మెగాపిక్సెల్ సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఇది 12-మెగాపిక్సెల్ TrueDepth కెమెరాను కలిగి ఉంటుంది. అందువల్ల ఎప్పటి నుంచో ఒక మంచి డిస్కౌంట్ ధరలో ఐఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన సమయం.

iPhone 15 Plus Discounted Price

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ అండ్ Apple ఇండియా వెబ్‌సైట్‌లో iPhone 15 Plus మోడల్‌పై భారీ తగ్గింపు ఉంది. ఈ మోడల్‌లోని బేస్ వేరియంట్ అయిన 128GB అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.89,600గా నిర్ణయించబడింది. అదే వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,601 తగ్గింపుతో లభిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత ఐఫోన్ 15 ప్లస్‌ను కేవలం రూ.75,999 లకే కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్లొచ్చు. అదనంగా కస్టమర్‌లు హ్యాండ్‌సెట్‌ను మరింత తక్కువ ప్రభావవంతమైన ధరకు పొందడానికి ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. అలాగే ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి. HSBC లేదా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIని ఉపయోగించే కస్టమర్‌లు రూ. 1,500 తగ్గింపు పొందుతారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా BOBCARD హోల్డర్‌లతో పాటు UPI లావాదేవీలను ఉపయోగించే వ్యక్తులు అదనంగా రూ.1,000 తగ్గింపు పొందుతారు. అలాగే దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఏకంగా రూ.50,850 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అయితే ఐఫోన్ 15 ప్లస్ లోని అధిక స్టోరేజ్‌ కలిగిన వేరియంట్లు కూడా భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అందులో 256GB – రూ. 85,999, 512GB – రూ. 1,05,999 ఎంపికలు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 16 లైనప్ రాబోయే లాంచ్ కారణంగా, ఐఫోన్ 15 ప్లస్ ధర.. ఇతర ఐఫోన్ 15 సిరీస్ హ్యాండ్‌సెట్‌ల ధరలతో పాటు రాబోయే కొద్ది రోజుల్లో దేశంలో తగ్గించబడుతుందని భావిస్తున్నారు.

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×