iPhone 17 Series : టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ త్వరలోనే ఐఫోన్ 17 సిరీస్ ను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతుంది. ఈ మొబైల్ సిరీస్ సెప్టెంబర్ 2025లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిజైన్, ప్రాసెసర్, కెమెరా ఫీచర్స్ పై ఎన్నో లీక్స్ హల్చల్ చేస్తున్నాయి ఇక తాజాగా ఈ సిరీస్ ధరలు సైతం లీక్ అయ్యి టెక్ ప్రియులుకు ఓ క్లారిటీ ఇచ్చేశాయి.
యాపిల్ కంపెనీ తన కొత్త సిరీస్ ఐఫోన్స్ ను ప్రతీ ఏడాది సెప్టెంబర్ లో ఆవిష్కరిస్తుంది. ఐఫోన్ 17 సిరీస్ లో కూడా ఈ కంపెనీ అదే ధోరణి పాటిస్తే 2025 సెప్టెంబర్ మొదటి వారంలో లాంఛ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఈ షెడ్యూల్ ప్రకారం లాంఛ్ అయిన వారంలోపే ప్రీ ఆర్డర్స్ ప్రారంభమైతే సెప్టెంబర్ చివరి నాటికి డెలివరీలు సైతం ప్రారంభమవుతాయి.
iPhone 17 Design –
ఫోన్ 17 సిరీస్ లో ఐఫోన్ 17 ఎయిర్‌తో కొత్త, అల్ట్రా స్లిమ్ డిజైన్ రాబోతుంది. ఈ మోడల్ మెుబైల్ కేవలం 5.5 mm మందంతో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకూ వచ్చిన స్లిమ్ మోడల్స్ లో ఈ మెుబైల్ బెస్ట్ గా నిలవనుందని అంచనా. ఇక ఈ సిరీస్ లో వచ్చే మెుబైల్స అన్నీ ప్రీమియం గ్లాస్, అల్యూమినియం బిల్డ్‌ను కలిగి ఉంటాయని తెలుస్తుంది.
డిస్ప్లే పరంగా చూస్తే.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9 అంగుళాల OLED డిస్‌ప్లేతో రాబోతుంది. ప్రో మోడల్ 6.3 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్ 17 ఎయిర్ 6.6 అంగుళాల డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుందని అంచనా. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్ యాపిల్ నెక్ట్స్ జనరేషన్ A19 చిప్ సెట్ తో పనిచేస్తాయని.. ప్రో, ప్రో మాక్స్ మోడల్‌లు A19 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తాయని తెలుస్తుంది. ప్రామాణిక మోడల్‌లు 8GB RAMతో వస్తాయని, ప్రో వేరియంట్‌లు 12GBతో రాబోతున్నాయని తెలుస్తుంది.
Apple కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే.. iPhone 17 Pro Max ట్రిపుల్ 48MP కెమెరా సెటప్‌తో ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో టెలిఫోటో లెన్స్ సైతం ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ సిరీస్ లో వచ్చే అన్ని మోడల్స్ లో మెరుగైన సెల్ఫీల కోసం 24MP ఫ్రంట్ కెమెరా సెటప్ ఉండబోతోందని టెక్ ప్రియులు అంచనా వేస్తున్నారు.
iPhone 17 series price in India Expected –
కాగా, ఐఫోన్ 17 సిరీస్ ధర వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఐఫోన్ 17 (iPhone 17) ధర సుమారు రూ. 79,900 ఉంటుందని అంచనా. అయితే కొత్త ఐఫోన్ 17 ఎయిర్, స్టాండర్డ్ – ప్రో మోడల్స్ మధ్య ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. దీని ధర రూ. 89,900. ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro) ధర సుమారు రూ. 1,20,000 ఉంటుందని అంచనా. ఐఫోన్ 17 ప్రో మాక్స్, హై ఎండ్ మోడల్ ధర రూ. 1,45,000 ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఈ మెుబైల్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ALSO READ : బెస్ట్ హెల్త్ ఫీచర్స్ తో అదిరే స్మార్ట్‌వాచ్ కొనాలా? ఈ టాప్ ఆఫ్షన్స్ మీకోసమే!