RC 16 Music Director : గేమ్ ఛేంజర్ గురించి పెద్దగా హోప్స్ లేవు కానీ, RC16 పైన మెగా అభిమానులు కాస్త గట్టిగానే హోప్స్ పెట్టుకున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఈ మూవీ కోసం చాలా కాలం వెయిట్ చేశాడు. ఆయన ఫస్ట్ మూవీ ఉప్పెన వచ్చి దాదాపు 5 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు రెండో మూవీ గ్లోబల్ స్టార్‌తో ఉంది. ఈ మూవీ కోసం బుచ్చి బాబు పకడ్భందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా చక్కగా అన్ని సెట్ చేసుకున్నాడు. అందులో భాగంగానే ఆస్కార్ విన్నర్ ఎఆర్ రెహమాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏరి కోరి తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు కొన్ని రోజుల నుంచి RC16 నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. రెహమాన్ ప్లేస్‌లో దేవి శ్రీ ప్రసాద్‌ను తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇవి అన్ని ఫేక్ అని కూడా కొంత మంది చెప్పుకొచ్చారు. మరి దీంట్లో నిజం ఏంటో ఇప్పుడు చూద్ధాం…
అవును నిజమే… ఎఆర్ రెహమాన్‌ను బుచ్చిబాబు ఏరి కోరి తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అయినా… తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నరే ఉండాలని అనుకున్నాడేమో… కానీ, రెహమాన్ వచ్చే వరకు వినలేదు. అందు కోసం బుచ్చిబాబు గురువు సుకుమార్ చాలా కష్టపడ్డాడు. ఒక రెహమాన్ విషయంలోనే కాదు.. ఈ RC16 ప్రాజెక్ట్‌ను సెట్ అవ్వడానికి ప్రధాన కారణం సుక్కునే.
రెహమాన్ కూడా బుచ్చిబాబు కన్సెప్ట్‌కు ఫిదా అయిపోయాడు. స్టోరీ చెప్పిన వెంటనే ఒకే అనేశాడు. అంతే కాదు… సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే ఆయన వర్క్ స్టార్ట్ చేశాడు. 3 పాటలకు ట్యూన్స్ కూడా ఇచ్చేశాడు. ఇంకా చేయాల్సినవి 2 ఉన్నాయి. ఇంతలోనే రెహమాన్ తప్పుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
ఈ వార్తలను కొట్టిపరేయ్యాడానికి లేదు. ఎందుకంటే… రెహమాన్ ఈ మధ్య పెద్దగా బయటికి రావడం లేదు. కొన్ని రోజుల క్రితం ఆయన విడాకుల అంశం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. పెళ్లి అయిన తర్వాత 3 గురు పిల్లలు, 29 ఏళ్ల బంధాన్ని పక్కన పెట్టి తాము విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దీని తర్వాత ఆయనకు సంబంధించి చాలా వార్తలు వినిపించాయి. అదే టైంలో ఆయన అసిస్టెంట్ ఒక అమ్మాయి కూడా విడాకులు తీసుకోవడంతో రెహమాన్ పై నెగిటివ్ వార్తలు కూడా వచ్చాయి.
అలా విడాకుల తర్వాత రెహమాన్ ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అంతే కాదు… రెహమాన్ కు సంబంధించి ఓ వార్త కూడా ఉంది. ఆయన విడాకుల తర్వాత ఆధ్యత్మికం వైపు మొగ్గు చూపిస్తున్నాడట. అన్నింటినీ పక్కన పెట్టి… దైవ సన్నిధిలో ఉంటున్నాడని సమాచారం. రోజు ఎక్కువ టైం వారి యొక్క దేవుడితోనే ఉంటున్నట్టు తెలుస్తుంది. అలాంటి టైంలో RC16 నుంచి రెహమాన్ తప్పుకున్నాడు అంటూ వార్తలు రావడంతో అందరూ నిజమే అని అనుకుంటున్నారు.
3 రెహమాన్… 2 దేవి శ్రీ ప్రసాద్…
RC16 మూవీలో మొత్తం 5 పాటలు ఉన్నాయట. అందులో 3 సాంగ్స్‌కి ఇప్పటికే రెహమాన్ ట్యూన్స్ ఇచ్చాడు. ఇంకా చేయాల్సినవి రెండు సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు రెహమాన్ విడాకుల తర్వాత వచ్చే పరిస్థితి లేదట. దీంతో మిగితా 2 సాంగ్స్‌కు ట్యూన్స్‌ను దేవి శ్రీ ప్రసాద్‌నే ఇవ్వాలని డైరెక్టర్ బుచ్చిబాబు కోరాడట. ఉప్పెన కాంబో కాబట్టి దేవీ కూడా ఒప్పుకున్నాడు అనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది.
అయితే ఇది జరగకపోవచ్చు అనే టాక్ కూడా ఉంది. ఎలాగైనా… మళ్లీ రెహమాన్‌నే తీసుకురావాలని బుచ్చిబాబు చూస్తున్నాడట. మిగిలిన రెండు పాటలను రెహమాన్ తోనే కొట్టించాలని అనుకుంటన్నాడట. అయితే దీనిపై ఇప్పుడు మూవీ టీం స్పందించడానికి రెడీగా లేదని తెలుస్తుంది.