Best Smartwatchs : అదిరిపోయే ఫీచర్స్ తో బెస్ట్ స్మార్ట్ వాచ్ కొనాలా? ఇందులో అదిరే ఫీచర్స్ ఉండాలనుకుంటున్నారా? ఇందులో బెస్ట్ హెల్త్ ఫీచర్స్ సైతం ఉండాలా? ఇక ఇంకెందుకు ఆలస్యం.. టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలన్నీ బెస్ట్ స్మార్ట్ వాచెస్ ను తీసుకొచ్చేసాయి. అంతేకాకుండా ఈ వాచెస్ పై బ్యాంకు డీల్స్ తో పాటు అదిరిపోయే ఆఫర్స్, నో కాస్ట్ EMI సదుపాయం సైతం అందిస్తున్నాయి. మరి వీటిలో బెస్ట్ ఆప్షన్స్ ఏంటో చూసేద్దాం.
స్మార్ట్ వాచ్.. స్మార్ట్ వాచ్ కు సమానంగా అధునాతన ఫీచర్స్ తో వచ్చేస్తున్న ఈ వాచెస్ లో ఎన్నో టాప్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా వీటిలో హెల్త్ ఫీచర్స్ కు కొదవేలేదు. హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ తో పాటు యూజర్స్ అవసరాలకు అనుగుణంగా ఈ స్మార్ట్ వాచెస్ డిజైన్ చేయబడుతున్నాయి. మరి వీటిపై బెస్ట్ డీల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా యాపిల్ కంపెనీ తీసుకొచ్చిన వాచ్ అల్ట్రాతో పాటు శామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా, అమాజ్‌ఫిట్ యాక్టివ్ వాచెస్ టాప్ ఆప్షన్స్ గా ఉన్నాయి. మరి ఈ వాచెస్ ఫీచర్స్ తో పాటు ధరలపై ఓ లుక్కేద్దాం.
ఆపిల్ వాచ్ అల్ట్రా 2 –
ఆపిల్ స్మార్ట్ వాచ్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPSతో పాటు రెటీనా డిస్ప్లేతో వస్తుంది. ఇది హెల్త్ ఫీచర్లు, స్పోర్ట్స్ మోడ్స్ కలిగిన కాలింగ్ స్మార్ట్‌వాచ్. ఈ వాచ్ బ్యాటరీ పూర్తి ఛార్జ్‌లో 36 గంటలు, తక్కువ పవర్ మోడ్‌లో 72 గంటలు పని చేయగలదు. యాపిల్ స్మార్ట్ వాచ్ ధర రూ.89,900. ఈ స్మార్ట్‌వాచ్‌పై రూ. 4000తో సహా ICICI బ్యాంక్‌పై డిస్కౌంట్ పొందవచ్చు. వాచ్‌పై రూ. 4,359 EMI కూడా ఉంది.
శామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా –
Samsung Galaxy Watch Ultra ఆ కంపెనీ తీసుకొచ్చిన అధునాతన స్మార్ట్‌వాచ్. ఈ వాచ్ LTE కనెక్టివిటీని కలిగి ఉంది, ఇందులో కాలింగ్ ఫీచర్ ఉంటుంది. ఈ వాచ్ AI సాంకేతికతకు మద్దతిస్తుంది. స్మూత్ పనితీరు కోసం 3nm ప్రాసెసర్, హార్ట్ బీట్ డిటెక్టర్, ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించే ఫీచర్ కలిగి ఉంది. ఈ వాచ్ బ్యాటరీ పూర్తి ఛార్జ్‌లో 100 గంటల వరకు ఉంటుంది. టచ్ తో ఈ ఫోన్ ను నియంత్రించవచ్చు. ఇది అమెజాన్‌లో రూ. 59,999కే అందుబాటులో ఉంది. దీనిపై రూ.12,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఇది కాకుండా వాచ్‌పై EMI కూడా ఇవ్వబడుతుంది.
అమాజ్‌ఫిట్ యాక్టివ్ –
Amazfit Active 1.75 అంగుళాల HD AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫిట్‌నెస్ కోసం Zap కోచ్ ను కలిగి ఉంది. ఇది షెడ్యూల్‌లు, ఎక్సర్ సైజ్ ప్రణాళికలను సిద్ధం చేయగలదు. ఫోటోలు క్లిక్ చేయడం నుంచి మ్యూజిక్ ప్లే చేయటం వరకూ ప్రతీ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీని బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ పై 30 గంటల వరకు పనిచేస్తుంది. దీని ధర రూ.8,999. దీనిపై రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్, రూ.436 EMI కూడా ఇవ్వబడుతుంది