Ayyannapatrudu on Nara Lokesh: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాటకు పదునెక్కువ. ఆయన మాటలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్పీకర్ చేసిన కామెంట్స్ అప్పుడు ఒక సంచలనమే. తాజాగా నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి గురించి అయ్యన్న చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకు అయ్యన్న ఏమన్నారంటే?
ఏపీలో ఇటీవల నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపించిన విషయం తెలిసిందే. మహాసేన రాజేష్ నుండి ప్రారంభమైన ఈ డిమాండ్ రోజురోజుకు సెకండరీ గ్రేడ్ పార్టీ క్యాడర్ నుండి కూడ వినిపించింది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ హోదాలో గల రఘురామ కృష్ణంరాజు సైతం డిప్యూటీ సీఎం పదవి లోకేష్ కు ఇవ్వాల్సిందేనన్న మాట చెప్పేశారు. లోకేష్ ఈ పదవి పుణ్యమా అంటూ.. డిప్యూటీ సీఎం హోదాలో గల పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ ని జనసేన నాయకులు వినిపించారు. ఇదే అంశంపై టీడీపీ వర్సెస్ జనసేన మధ్య సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ సాగాయి.
దీనితో కూటమి అధినాయకత్వం అలర్ట్ అయింది. టీడీపీ క్యాడర్ కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ లోకేష్ కు డిప్యూటీ ఇచ్చే పరిస్థితి లేదని, అనవసరంగా వివాదాలు సృష్టించవద్దని చంద్రబాబు అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడ కూటమి నేతలు అనవసర వివాదాస్పద కామెంట్స్ చేయవద్దంటూ లేఖ కూడ విడుదల చేశారు. మొత్తం మీద లోకేష్ డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ కాస్త వినిపించడం తగ్గుముఖం పట్టింది.
Also Read: Nara Lokesh: ఆ పదవికి లోకేష్ గుడ్ బై? ఆ ఛాన్స్ ఎవరికి దక్కెనో?
తాజాగా ఇదే విషయంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని మేము ఎందుకు డిమాండ్ చేస్తామన్న అయ్యన్న, అది ప్రజలు నిర్ణయించాలన్నారు. అంటే ప్రజల నిర్ణయంతో లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి వస్తుందని, క్యాడర్ చెప్పినంత మాత్రాన జరగదని అయ్యన్న అన్నారు. అయ్యన్న మాటలను బట్టి లోకేష్ డిప్యూటీ సీఎం పదవి ఇప్పుడిప్పుడే అందేలా లేదని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే లోకేష్ కూడ ఇదే విషయంపై స్పందించారు. లోకేష్ మాట్లాడుతూ.. తాను ఏనాడూ పదవులు కోరుకోలేదని, అలా ప్రాకులాడే వ్యక్తిత్వం తనది కాదంటూ లోకేష్ తేల్చిచెప్పారు.
నారా లోకేష్ డిప్యూటీ సీఎం అంశంపై స్పందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని మేము ఎందుకు డిమాండ్ చేస్తాం ?
అది ప్రజలు నిర్ణయించాలి
– స్పీకర్ అయ్యన్నపాత్రుడు pic.twitter.com/MgpcwcQNoI
— BIG TV Breaking News (@bigtvtelugu) January 27, 2025