iPhone 17 Series : యాపిల్ కంపెనీ వచ్చే ఏడాది ఐఫోన్ 17 సిరీస్ ను లాంఛ్ చేయబోతోంది. ఈ iPhone 17 లైనప్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు రాబోతున్నాయి. iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max ఇంకా కొత్త iPhone 17 Air. ఐఫోన్ 17 ఎయిర్ స్లిమ్ మోడల్ లో రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఐఫోన్ 17 సిరీస్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ మరోసారి వైరల్ గా మారాయి.
ఐఫోన్ 17 సిరీస్ 2025 విడుదలకు సంచలనం సృష్టిస్తోంది. ఈ లైనప్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్ మోడల్స్ రాబోతున్నట్లు తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ ఫీచర్స్ పై టెక్ నిపుణులు ఓ క్లారిటీకి వచ్చేశారు.
ఐఫోన్ 17 సిరీస్‌లో డిజైన్ మార్పులు –
iPhone 17 Airను యాపిల్ లాంఛ్ చేయబోతోంది. కొత్తగా రాబోతున్న ఈ మెుబైల్ స్లిమ్ మోడల్ లో వచ్చేస్తుంది. కేవలం 5-6mmలతో అత్యంత సన్నని ఐఫోన్‌గా రాబోతుంది. ఈ మోడల్ టైటానియం-అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని అంచనా.
ఐఫోన్ 17 ప్రస్తుత “ప్లస్” వేరియంట్ స్థానంలో 6.3-అంగుళాల డిస్‌ప్లేతో స్వల్ప పెరుగుదల సైతం ఉంటుంది. ప్రో మోడల్‌లు గ్లాస్, అల్యూమినియం, బ్యాక్ ప్యానెల్‌లతో హైబ్రిడ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇవి మెరుగైన మన్నికను సైతం అందిస్తాయి. ఐఫోన్ 17 లైనప్ మోడల్ లో కెమెరా లే అవుట్ Google Pixel 9 మోడల్ లో రాబోతన్నట్లు తెలుస్తుంది.
ఐఫోన్ 17 సిరీస్ స్పెసిఫికేషన్స్ –
ఐఫోన్ 17 సిరీస్ దాని డిస్‌ప్లే అప్‌గ్రేడ్‌లతో ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. అన్ని మోడల్‌లు 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లేలను కలిగి ఉండే అవకాశం ఉంది. అదనంగా, జోడించిన స్క్రాచ్ రెసిస్టెన్స్ కోసం యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో పాటు ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్ శ్రేణిలో అందుబాటులో ఉంటుంది.
iPhone 17 సిరీస్ TSMC అధునాతన N3P ప్రాసెస్‌ను కలిగి ఉండనుంది. ఇక Apple కొత్త A19 చిప్ తో పనిచేస్తుంది. ప్రో మోడల్స్ 12GB, స్టాండర్డ్ మోడల్స్ 8GBను అందించడంతో పాటు RAM అప్‌గ్రేడ్‌ను కూడా పొందే అవకాశం ఉంది.
iPhone 17 సిరీస్‌లో కెమెరా అప్‌గ్రేడ్‌లు –
ఐఫోన్ 17 ప్రో మాక్స్ మూడు 48MP కెమెరాలను కలిగి ఉండనుంది. వైడ్, అల్ట్రా వైడ్, టెట్రాప్రిజం టెలిఫోటో లెన్స్ తో రాబోతుంది. ఐఫోన్ 17 ఎయిర్ కు మరోవైపు 48MP వెనుక కెమెరా రానుంది.
ఐఫోన్ 17 సిరీస్ లాంఛ్ –
Apple తన సాధారణ షెడ్యూల్ తో సెప్టెంబర్ 2025లో iPhone 17 సిరీస్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇండియాలో iPhone 17 ప్రారంభ ధర రూ. 80,000గా ఉండనుంది. ఇక ప్రో మోడల్‌లు రూ. 1,20,000 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇంకా ఆపిల్ తీసుకురాబోతున్న ఈ 17 సిరీస్ ఫీచర్స్ సైతం ఐఫోన్ 16 కంటే అప్ గ్రేడ్ వెర్షన్ లో రాబోతున్నట్టు తెలుస్తోంది. ధర సైతం కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఏది ఏమైనా ఐఫోన్ సిరీస్ లాంఛ్ కావడానికి ఇంకా తొమ్మిది నెలల సమయం ఉందని చెప్పవచ్చు. కానీ ఇప్పటికే వీటి ఫీచర్స్ ధరపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక ముందు ముందు యాపిల్ నుంచి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది.
ALSO READ : ఏంటి భయ్యా ఈ ఆఫర్.. iPhone 16 Proపై ఏకంగా వేలల్లో డిస్కౌంటా!