Shanmukh Jaswanth: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది కొత్త నటులు పరిచయం అవుతూ వస్తున్నారు. షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో కొత్త దర్శకులు ఎలా అయితే ఎంట్రీ ఇస్తున్నారో అలానే కొత్త కొత్త నటులు కూడా ఎంట్రీ ఇస్తూ వస్తున్నారు. రాజ్ తరుణ్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు ఇదివరకే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకున్నారు. కిరణ్ క సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి షణ్ముఖ్ జస్వంత్. షణ్ముఖ్ జస్వంత్ కవర్ సాంగ్స్ కూడా చాలా చేశాడు. అయితే షణ్ముఖ్ జస్వంత్ ఎప్పుడో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని చాలామంది ఊహించారు. బిగ్బాస్ షో తో కూడా మంచి గుర్తింపు సాధించుకున్నాడు కానీ ఇప్పటివరకు షణ్ముఖ్ జస్వంత్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. చాలామంది సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ నేడు హీరోగా కూడా కొనసాగుతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సుహాస్ అని చెప్పాలి.
ఇక షణ్ముఖ్ ఆ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. మాదకద్రవ్యాలు తీసుకుంటున్నట్టు ఆ మధ్య కాలంలో షణ్ముఖ్ పైన వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాడు. అయితే వచ్చిన అవకాశాలు కూడా ఆ టైంలో వెనక్కి వెళ్లిపోయాయి. ఇక ప్రస్తుతం లీలా వినోదం అనే ఒక ఒరిజినల్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కి రానుంది. ఈనెల 19వ తారీకు నుంచి ఈటీవీ విన్లో ఇది అవైలబుల్ గా ఉంటుంది. దీనికి పవన్ సుంకర దర్శకత్వం వహించారు. తను ప్రేమించిన అమ్మాయికి ప్రేమను వ్యక్తపరచడానికి ఒక యువకుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే అంశం పైన ఈ సినిమాను తీసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్లో షణ్ముఖ్ మాట్లాడుతూ ఎమోషన్ కి గురయ్యారు. నేను వైవా అనే సిరీస్ లో నటించి ఆ తర్వాత వైజాగ్ నుంచి హైదరాబాద్ కు వచ్చి కవర్ సాంగ్స్ అవి చేసుకుంటూ కష్టపడుతున్న టైం లో ఎవరో చేసిన తప్పుకి నేను చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. నా తల్లిదండ్రులని, నా అభిమానుల్ని బాగా బాధపెట్టాను. దయచేసి నన్ను క్షమించండి. ఎవరు నన్ను నమ్మని టైంలో సాయి మరియు భరత్ భయ్యా నన్ను బలంగా నమ్మారు. వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ కు గురి అయ్యారు షణ్ముఖ్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈ చిత్రం పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సిరీస్ ఏ స్థాయిలో అంచనాలు అందుకుంటుందో వేచి చూడాలి.
Also Read : Upendra on Rajinikanth: ఆయన ద్రోణాచార్యుడు లాంటివారు నేను ఏకలవ్యుడ్ని