Slim Flagship phone Comparison| ఆపిల్ ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ లో భాగంగా ఐఫోన్ ఎయిర్‌ను విడుదల చేసింది. ఆపిల్ ఐఫోన్ సిరీస్ లో ఇదే మొదటి స్లిమ్ ఫోన్. ఇది శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ మరియు షావోమి 15 అల్ట్రాతో పోటీపడుతోంది. ఈ సన్నని, ఆకర్షణీయమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ప్రీమియం మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఐఫోన్ ఎయిర్‌లో A19 ప్రో చిప్, శామ్‌సంగ్, షావోమిలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ ఉన్నాయి. ఈ మూడు ఫోన్ల ఫీచర్లు ఒకసారి పోల్చి చూద్దాం. వీటిలో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.
ధర వివరాలు
ఐఫోన్ ఎయిర్ 256GB ధర రూ. 1,19,900, 512GB రూ. 1,39,900, 1TB రూ. 1,59,900. శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ 12GB+256GB రూ. 1,09,999, 12GB+512GB రూ. 1,21,999. షావోమి 15 అల్ట్రా 16GB+512GB రూ. 1,09,999. శామ్‌సంగ్ మరియు షావోమి ధరలు మెరుగైన విలువను అందిస్తాయి.
డిస్‌ప్లే వివరాలు
ఐఫోన్ ఎయిర్‌లో 6.5 ఇంచ్ సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది, రిజల్యూషన్ 2736×1260, 120Hz రిఫ్రెష్ రేట్. శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌లో 6.7 ఇంచ్ క్వాడ్ HD+ LTPO AMOLED డిస్‌ప్లే, రిజల్యూషన్ 1440×3120, 1-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. షావోమి 15 అల్ట్రాలో 6.73 ఇంచ్ 2K LTPO OLED డిస్‌ప్లే, 3200 నిట్స్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. బయట సూర్యకాంతిలో కూడా షావోమి డిస్‌ప్లే సూపర్ గా ఉంటుంది.
ప్రాసెసర్
ఇక ప్రాసెసర్ పనితీరు చూస్తే.. ఐఫోన్ ఎయిర్‌లో ఆపిల్ A19 ప్రో చిప్ ఉంది, ఇది భారీ వర్క్‌లోడ్‌లను సులభంగా నిర్వహిస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్, షావోమి 15 అల్ట్రాలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఆక్టా-కోర్ చిప్ ఉంది. మూడూ గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో అద్భుతంగా పనిచేస్తాయి.
సాఫ్ట్‌వేర్
ఐఫోన్ ఎయిర్ iOS 26తో వస్తుంది, ఇది సజావైన అప్‌డేట్స్, ప్రైవెసీ పరంగా బాగుంటుంది. శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఆండ్రాయిడ్ 15తో వన్ UI 7ను కలిగి ఉంది, ఇది కస్టమైజ్డ్ వెర్షన్. షావోమి 15 అల్ట్రా ఆండ్రాయిడ్ 15తో హైపర్‌ఓఎస్ 2.0ను కలిగి ఉంది, ఇది AI ఫీచర్స్ కోసం రూపొందించబడింది.
కెమెరా సిస్టమ్స్
ఐఫోన్ ఎయిర్‌లో 48MP మెయిన్ కెమెరా (f/1.6), 18MP ఫ్రంట్ కెమెరా (f/1.9) ఉన్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌లో 200MP ప్రైమరీ (f/1.7), 12MP అల్ట్రావైడ్ (f/2.2), 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. షావోమి 15 అల్ట్రాలో 50MP ప్రైమరీ (f/1.62), 50MP టెలిఫోటో (OIS), అల్ట్రావైడ్ (f/1.2), 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కెమెరా వైవిధ్యంలో షావోమి ముందంజలో ఉంది.
కనెక్టివిటీ
ఐఫోన్ ఎయిర్ 5G, Wi-Fi 7, బ్లూటూత్ 6, GPS, NFCను సపోర్ట్ చేస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌లో Wi-Fi 7, NFC, USB-C, 3G/4G ఉన్నాయి. షావోమి 15 అల్ట్రాలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 6, USB-C, NFC ఉన్నాయి. మూడూ కనెక్టివిటీలో సమస్యలు లేకుండా పనిచేస్తాయి.
డిజైన్, బరువు
ఐఫోన్ ఎయిర్ పరిమాణం 156.2mm x 74.7mm x 5.64mm, బరువు 165g. శామ్‌సంగ్ S25 ఎడ్జ్ 158.2mm x 75.6mm x 5.8mm, బరువు 163g. షావోమి 15 అల్ట్రా 161.3mm x 75.3mm x 9.35mm, బరువు 226g. మూడింటిలో ఐఫోన్, శామ్‌సంగ్ సన్నగా, తేలికగా అనిపిస్తాయి.
విన్నర్ ఎవరు?
షావోమి 15 అల్ట్రా కెమెరా, ధరలో మెరుగైన ఎంపిక. సన్నని డిజైన్ కోసం ఐఫోన్ ఎయిర్ బెస్ట్. కానీ ఫీచర్ల సమతుల్యత విషయంలో శామ్‌సంగ్ S25 ఎడ్జ్ బెటర్. మీ అవసరాల ఆధారంగా ఎంచుకోండి.
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే