BigTV English

TPCC Mahesh Kumar: సినీ ప్రముఖులకు టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి.. భవిష్యత్‌ భరోసా

TPCC Mahesh Kumar: సినీ ప్రముఖులకు టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి.. భవిష్యత్‌ భరోసా

TPCC Mahesh Kumar: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌కు ముగింపు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్. ఈ వ్యవహారంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి. పరిస్థితి గమనించిన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలకు కీలక విజ్ఞప్తి చేశారాయన. భవిష్యత్‌కు భరోసా కల్పించారు.


ఫిల్మ్ ఇండస్ట్రీపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్. ఓ నటీమణిపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు విచారకరమని పేర్కొన్నారు. సదరు వ్యాఖ్యలను మంత్రి ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయాలని విజ్ఞప్తి చేశారాయన.

భవిష్యత్‌లో సినీరంగానికి చెందిన వ్యక్తులను రాజకీయ వివాదాల్లోకి లాగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించారు. మహిళా మంత్రి కొండా సురేఖ మీద బీఆర్ఎస్ నేత కేటీఆర్  సోషల్‌మీడియాలో చేసిన ట్రోల్స్‌ని అందరూ చూశారని వివరించారు.


ఆ బాధతో మంత్రి ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు టీపీసీసీ. ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా సమాజానికి మంచిది కాదన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదని వివరించారు మహేష్‌కుమార్ గౌడ్. కొండా సురేఖ-కేటీఆర్ ఎపిసోడ్‌లో బీఆర్ఎస్ మాటేంటన్నది అసలు ప్రశ్న.

ALSO READ: మంత్రి కొండా సురేఖపై కుష్బూ ఆగ్రహం.. కేవలం రెండు నిమిషాల కోసం..

బీఆర్ఎస్ హైకమాండ్ మంత్రికి క్షమాపణలు చెబుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీ క్షమాపణలు చెబుతే హుందాగా ఉంటుందన్నది  కొందరు రాజకీయ నేతల మాట. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సహజమేనని భావించి సైలెంట్‌గా ఉంటుందో చూడాలి. ఈ ఎపిసోడ్‌లో మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసిన విషయం తెల్సిందే.

 

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×