BigTV English

Manchu Vishnu: ఉపేక్షించేది లేదు.. ఒక్క ప్రకటనతో మంత్రిపై ఫైర్..!

Manchu Vishnu: ఉపేక్షించేది లేదు.. ఒక్క ప్రకటనతో మంత్రిపై ఫైర్..!

Manchu Vishnu.. సాధారణంగా సినీ – రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది రాజకీయ నాయకులు.. సినీ సెలబ్రిటీల రేంజ్ ను ఓర్వలేక ఇబ్బందుల్లో పడేస్తున్నారు అనడానికి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న విషయాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే రాజకీయ నాయకుల చేత పవన్ కళ్యాణ్, చిరంజీవి లను మొదలుకొని చాలామంది సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అక్కినేని కుటుంబం వంతు వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ పై, ఇటు సమంత పై చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. నాగచైతన్య – సమంత కేటీఆర్ వల్ల విడిపోయారు అని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సినీ సెలబ్రిటీలను హేళన చేసేలా కొండా సురేఖ బహిరంగ కామెంట్లు చేయడంతో సినీ సెలబ్రిటీలు ఒక్కసారిగా ఫైర్ అవుతూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మంత్రి సురేఖ పై ఫైర్ అయిన సెలబ్రిటీస్..

ఇప్పటికే ప్రకాష్ రాజ్, చిరంజీవి, ఎన్టీఆర్, నాని, వెంకటేష్, కొణిదెల లావణ్య త్రిపాఠి, అల్లు అర్జున్, సింగర్ చిన్మయి మొదలుకొని చాలామంది ఈ విషయంపై సమంతకు అండగా నిలుస్తూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు మా అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu)!కూడా ఫైర్ అవుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఆ ప్రకటనలో ఏముంది అనే విషయానికి వస్తే.. సమాజంలో ఈ మధ్యకాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో వాటి కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. మన పరిశ్రమ ఇతర రంగాల వలే పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుంది. కానీ నిజం కాని కథనాలను ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం వాడడం చాలా నిరాశను కలిగిస్తోంది.


ఇండస్ట్రీకి సపోర్ట్ గా మా అధ్యక్షుడు సుదీర్ఘ ప్రకటన..

మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం, మిగిలిన అందరి కుటుంబాల లాగే వారికి కూడా గౌరవం , రక్షణ అత్యవసరం. ఎవరు తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవడం లేదా వారి వ్యక్తిగత జీవితాలు అబద్ధపు ఆరోపణలలోకి లాగ బడడం ఇష్టపడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు ఆ గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాము.

మేమంతా ఏకమవుతాం..

నాయకులు, రాజకీయ నాయకులు అలాగే ప్రతిభావంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి రాజకీయ కథనాల కోసం లేదా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మా నటుల పేర్లు అలాగే వారి కుటుంబాల పేర్లు దయచేసి వాడకండి. మేము,మా చిత్ర పరిశ్రమలో పనిచేసేవారు, సమాజానికి వినోదం ఇవ్వడానికి అలాగే సహకరించడానికి ఎంతో కష్టపడుతున్నాము. మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చలలోకి లాగాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. వృత్తిపరంగానే కాకుండా మనుషులుగా కూడా మన కుటుంబాల పైన వచ్చే అబద్ధపు కథనాల వల్ల కలిగే బాధ చాలా తీవ్రమైనది. ఇలాంటి సంఘటనలు మరింత సమస్యలను, బాధను కలిగిస్తాయని మనమందరం అంగీకరిస్తాం. సినీ పరిశ్రమ తరపున ఎప్పుడూ కూడా మా కుటుంబానికి అనసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచుతానని విజ్ఞప్తి చేస్తున్నాను… నా పరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండన. మేము ఇలాంటి దాడులను తట్టుకోలేము. మేమంతా ఏకమై నిలబడతాము అంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణు ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రకటన వైరల్ గా మారుతోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×