iPhone SE 4 : టెక్ దిగ్గజం యాపిల్ ఈ ఏడాది ఎన్నో లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకురాటానికి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఐఫోన్ se4 తో పాటు ఐప్యాడ్ 11 గ్రాండ్ గా లాంఛ్ కాబోతున్నాయి. ఇప్పటివరకు ఈ గ్యాడ్జెట్స్ పై ఎలాంటి అధికారిక సమాచారాన్ని యాపిల్ వెల్లడించలేదు. అయితే తాజాగా లీకైన సమాచారంతో ఈ గ్యాడ్జెట్స్ ప్రాసెసర్ పై కొన్ని లీక్స్ హల్చల్ చేస్తున్నాయి.
టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ ఈ ఏడాది దాదాపు 20కి పైగా లేటెస్ట్ గాడ్జెట్స్ ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా se4 లాంఛ్ కాబోతుంది. ఇక ఐపాడ్ 11 సైతం వచ్చేస్తుంది. ఈ గ్యాడ్జెట్స్ ఐఫోన్ A18 ప్రాసెసర్‌తో రాబోతున్నట్లు సమాచారం.
MacRumors తాజాగా ప్రచురించిన నివేదిక ప్రకారం, Apple నుండి రాబోతున్న కొత్త హ్యాండ్‌సెట్ మోడల్ నంబర్ T8140తో ప్రాసెసర్‌ను పొందబోతోంది. ఇవి ఐడెంటిఫైయర్ A18, A18 ప్రో ప్రాసెసర్‌లపై ఆధారపడి ఉండనున్నాయి. ఇక ఇప్పటికే A18 ప్రాసెసర్ ఐఫోన్ 16 లో యాపిల్ ఉపయోగించింది. అయితే ఐఫోన్ 16 ధర చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఐఫోన్ ఎస్ఈ 4 బడ్జెట్ ఫ్రెండ్లీగా రాబోతుంది. దీంతో ఐఫోన్ ఎస్ఈ4లో ఈ ప్రాసెసర్ ను ఉపయోగించే అవకాశం ఉండదని టెక్ వర్గాలు ఇప్పటివరకు అంచనా వేసాయి.
ALSO READ : ఇండియా ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ.. ఎప్పుడు రాబోతుందంటే!
తాజగా తెలిసిన నివేదిక ప్రకారం ఎస్ఈ4 మొబైల్స్ లో ఇదే ప్రాసెసర్ రాబోతుందని తెలుస్తోంది. ఈ గ్యాడ్జెట్స్ లో OLED డిస్ ప్లే రాబోతుందని… ఐఫోన్ SE 4 ఒకే 48MP బ్యాక్ సెన్సార్‌తో వచ్చేస్తుందని తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు తెలిసిన లీక్స్ ప్రకారం ఈ సమాచారం అందుబాటులో ఉన్నప్పటికీ… యాపిల్ అధికారికంగా ప్రకటిస్తే మిగిలిన ఫీచర్స్ పై క్లారిటీ వస్తుంది.
ఇక 2025లో యాపిల్ కంపెనీకి ఎంతో ప్రత్యేకమైనే చెప్పాలి. ఈ ఏడాది ఎన్నో లేటెస్ట్ మొబైల్స్ తో పాటు గ్యాడ్జెట్స్ ను యాపిల్ తీసుకురావడానికి సిద్ధమవుతుంది. దాదాపు 20కి పైగా గ్యాడ్జెట్స్ ను తీసుకొస్తున్నట్టు ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇందులో ఐఫోన్ 17 సిరీస్ తో పాటు ఐఫోన్ ఎస్ఈ 4, మొబైల్ ఐప్యాడ్ 11, యాపిల్ హోమ్ హబ్, యాపిల్ విజన్ ప్రో 2, న్యూ హోమ్ పాడ్స్, యాపిల్ టీవీ 4kతో పాటు మరిన్ని గ్యాడ్జెట్స్ రాబోతున్నాయి.
M4 మ్యాక్ బుక్ Air, iPhone SE4, iPad 11, New iPad Air, Home Pad, M4 మ్యాక్ స్టూడియో, M4 MAc Pro, ఐఫోన్ 17 సిరీస్, Apple Watch Ultra 3, Apple Watch Series 11, Apple Watch SE 3, Airpods Pro 3, Airpods Pro 3 , M5 ipad Pro, M5 ipadPro, M5 MacBook PRo లేటెస్ట్ ఫీచర్స్ తో రాబోతున్నాయి. మరి ఈ ఏడాది లాంఛ్ కాబోతున్న ఈ గాడ్జెట్స్ కోసం యాపిల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి నుంచి ఈ గ్యాడ్జెట్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. సెప్టెంబర్ లో ఐఫోన్ 17 సిరీస్ లాంఛ్ కాబోతుంది.