Union Budget 2005-26: మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2025-26 తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అందులో భాగంగా హల్వా వేడుకను నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో పార్లమెంట్ నార్త్ బ్లాక్ లో ఈ వేడుకను నిర్వహించారు. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, కార్యదర్శులు, బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది అంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.
హల్వా వేడుకను ఎందుకు జరుపుతారు?
పార్లమెంటులో బడ్జెట్ సమర్పణకు కొన్ని రోజుల ముందు హల్వా వేడుక నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది. పెద్ద కడాయిలో ఈ హల్వాను తయారు చేస్తారు. ఆర్థికమంత్రి కడాయిని వెలిగించి హల్వా తీయారీ ప్రక్రియకు శ్రీకారం చుడతారు. హల్వా రెడీ అయిన తర్వాత కడాయిని కదిలించి, బడ్జెట్ ప్రక్రియలో పాల్గొనే వారందరికీ వడ్డిస్తారు. బడ్జెట్ గోప్యతతో పాటు దేశ ప్రజలకు బడ్జెట్ ద్వారా తీపి విషయాలు చెప్పబోతున్నాం అనే దానికి గుర్తుగా ఈ వేడుక నిర్వహిస్తారు. హల్వా వేడుక తర్వాత, బడ్జెట్ ను ప్రధానమంత్రి దగ్గరికి పంపిస్తారు. ఆయన ఆమోదం పొందిన తర్వాత బడ్జెట్ పత్రాలను ముద్రణకు పంపుతారు. ఈ బడ్జెట్ పత్రాల ముద్రణ చాలా పకడ్బందీగా కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా నీడలో ఆర్థిక మంత్రిత్వ శాఖ బేస్‌మెంట్‌లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ లో వీటిని ముద్రిస్తారు.
Read Also: రోడ్డు నాణ్యత బాగోలేదా అయితే వాళ్లంతా జైలుకే.. కేంద్రం కొత్త రూల్
బయటి ప్రపంచంతో సంబంధాలు కట్
ఇక హల్వా ఈ వేడుకలో పాల్గొన్న వారంతో బడ్జెట్ ప్రదేశపెట్టే వరకు పార్లమెంట్ లోని ఆర్థికశాఖ ప్రాంగణానికే పరిమితం అవుతారు. బయటికి వెళ్లే అవకాశం ఉండదు. కనీసం వాళ్లు సెల్ ఫోన్ కూడా ఉపయోగించరు. ఇంకా చెప్పాలంటే బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు లేకుండా చూస్తారు. బడ్జెట్ పత్రాలు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన తర్వాత మాత్రం వాళ్లను బయటకు వెళ్లడానికి అనుమతిస్తారు. బడ్జెట్ గోప్యతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటారు.
Read Also: భారత్‌కు బైడెన్ గోల్డెన్ గిఫ్ట్.. దిగిపోయే ముందు ఊహించని నిర్ణయం..
హల్వా వేడుక ఎప్పటి నుంచి జరుగుతుందంటే?
హల్వా వేడుక 1980 నుంచి నిర్వహిస్తున్నారు. గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 6 సార్లు పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆయన రికార్డును బ్రేక్ చేయబోతున్నారు. ఇప్పటికే ఆమె 6 సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టగా, ఇప్పుడు ఏడోసారి పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతున్నారు. జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలుకానుండగా, ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ 3.0లో ఈ బడ్జెట్ ప్రజలకు ఎలాంటి శుభవార్తలు చెప్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also: ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులతో.. జీతాలు, పింఛన్లు ఎంత పెరుగుతాయో తెలుసా..