BigTV English

iQOO 13: ఐక్యూ నా మజాకా.. మార్కెట్‌లోకి మరో సరికొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ గురూ!

iQOO 13: ఐక్యూ నా మజాకా.. మార్కెట్‌లోకి మరో సరికొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ గురూ!

iQOO 13 Launching Soon: ప్రముఖ టెక్ దిగ్గజం వివో సబ్ బ్రాండ్ ఐక్యూ ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సత్తా చాటుతోంది. కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ ఇతర బ్రాండ్‌లకు గట్టి పోటీనిస్తుంది. అదే సమయంలో దేశీయ మార్కెట్‌లో సైతం ఐక్యూ అదరగొట్టేస్తుంది. ఫోన్ ప్రియుల బడ్జెట్‌ని దృష్టిలో ఉంచుకుని ఖరీదైన ధర నుండి చౌక ధరల వరకు తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ మరింత గుర్తింపు సంపాదించుకుంటుంది. ఇప్పటికే తన లైనప్‌లో ఉన్న ఎన్నో మోడళ్లను మార్కెట్‌లో రిలీజ్ చేసింది.


ఇక ఇప్పుడు తన తదుపరి ఫోన్‌ను త్వరలో రిలీజ్ చేయడానికి సిద్ధం అయింది. iQOO తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 13ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దీంతో ఈ మొబైల్ లాంచ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఫోన్‌కి సంబంధించిన పలు లీక్‌లు బయటకొచ్చి చక్కర్లు కొడుతున్నాయి. IQ కంపెనీ ఈ మొబైల్‌ని సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్‌సెట్‌తో తీసుకొస్తుందని చెప్పబడింది. ఇది మాత్రమే కాకుండా ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల 2K AMOLED డిస్‌ప్లేను పొందవచ్చని తెలుస్తోంది.

ఇక తాజాగా దీనికి సంబంధించి మరికొన్న లీక్ అయ్యాయి. దీని ప్రకారం.. భారతదేశంలో iQOO 13 ధర, స్పెసిఫికేషన్‌ వివరాలు, లాంచ్ తేదీ వెల్లడయ్యాయి. ఇప్పుడు వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక లీక్ అయిన దాని ప్రకారం చూసుకుంటే.. ఈ ఫోన్ భారతదేశంలో డిసెంబర్‌లో లాంచ్ చేయబడుతుందని అనుకుంటున్నారు. iQOO 13 స్మార్ట్‌ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 2K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే BOE ద్వారా తయారు చేయబడిన ప్యానెల్‌ను ఉపయోగించినట్లు చెప్పబడింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ద్వారా శక్తిని పొందుతుందని భావిస్తున్నారు.


Also Read: కిర్రాక్.. సెప్టెంబర్‌లో లాంచ్ అయిన టాప్ ఫోన్లు.. ఫీచర్లు, ధర వివరాలివే!

ఇది మాత్రమే కాకుండా iQOO 13 స్మార్ట్‌ఫోన్‌కి 512GB వరకు స్టోరేజ్, మల్టీ టాస్కింగ్ కోసం 16GB RAM ను అందించే అవకాశం ఉందని చెప్పబడింది. ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఇది దాని మునుపటి మోడల్ iQOO 12 కంటే కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉందని చెప్పబడింది. పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌కు బదులుగా మూడు 50MP సెన్సార్‌లతో ట్రిపుల్-కెమెరా సెటప్‌ను పొందే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇందులో ప్రైమరీ లెన్స్, అల్ట్రా-వైడ్, 2x టెలిఫోటో లెన్స్ ఉండనున్నట్లు సమాచారం. దీనితో పాటు ఇది సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుందని చెప్పబడింది.

ఈ తాజా లీక్ ప్రకారం.. iQOO 13 సేఫ్టీ కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదే సమయంలో ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6150mAh బ్యాటరీతో వస్తున్నట్లు సమాచారం. ఇంకా వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఫోన్‌లో మెటల్ ఫ్రేమ్, స్టైల్ కోసం ‘హాలో’ లైట్ స్ట్రిప్ కూడా ఉండవచ్చని చెప్పబడింది. ఇక చివరిగా దీని ధర విషయానికొస్తే.. iQOO 13 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో దాదాపు రూ. 55,000 ప్రారంభ ధరతో ఉంటుందని లీక్ ద్వారా తెలిసింది.

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×