iQOO Neo 10R : ఎప్పటికప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ ను లాంఛ్ చేస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ. ఇక ఈ సంస్థ తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో ఐక్యూ 13 సిరీస్ ను తీసుకొచ్చేసింది. ఈ మొబైల్ సిరీస్ లో అదిరే ఫీచర్స్ తో పాటు లేటెస్ట్ అప్ గ్రేడ్స్ ఉన్నాయి. ఈ మెుబైల్ సిరీస్ టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో కొత్త మొబైల్ సిరీస్ ను ఐక్యూ తీసుకురావటానికి సిద్ధమవుతుంది
ఐక్యూ త్వరలోనే iQOO Neo 10R మొబైల్ ను ఇండియాలో లాంఛ్ చేయడానికి సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ తన పోస్టులో తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్ అదిరిపోయే ఫీచర్స్ తో రాబోతుందని కూడా వెల్లడించారు.
iQOO Neo 10R మొబైల్ ఫిబ్రవరిలో లాంఛ్ కాబోతున్నట్టు సమాచారం. ఇక బెస్ట్ మిడ్ రేంజ్ మొబైల్ గా మార్కెట్లోకి లాంఛ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ లో భాగంగా అదిరిపోయే మొబైల్స్ రాబోతున్నాయని.. నియో 10 సిరీస్ లో iQOO Neo 10, iQOO Neo 10 Pro ఉండనున్నట్లు తెలుస్తుంది. iQOO Neo 10 ఇప్పటికే చైనాలోలాంఛ్ అయింది. త్వరలోనే ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా లాంఛ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.
ఐక్యూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐక్యూ 13 సిరీస్ ను లాంఛ్ చేసింది. ఈ మొబైల్స్ బడ్జెట్ ఫ్రెండ్లీగానే అందుబాటులోకి వచ్చేసాయి. ఇక ఇప్పుడు రాబోయే ఐక్యూ నియో 10 సిరీస్ సైతం ఐక్యూ 13 ఫీచర్స్ తో వచ్చే ఛాన్స్ ఉన్నట్టు టిప్ స్టర్ తెలిపింది. అంతేకాకుండా ధర కూడా ఈ మొబైల్ లో సమానంగా ఉండే ఛాన్స్ ఉన్నట్టు వెల్లడించింది.
iQOO 13 లో వాల్యూమ్ రాకర్ తో స్క్రీన్ కుడి వైపున పవర్ బటన్, మెటల్ ఫ్రేమ్ ఫ్లాట్ డిజైన్, 2K రిజల్యూషన్ డిస్ ప్లే ఉన్నాయి. 144hz రిఫ్రెష్ రేట్, 6.7 అంగుళాలు స్క్రీన్, Qualcomm AI ఇంజిన్ మల్టీ మోడల్ Gen AIతో మల్టీపుల్ ఇన్‌పుట్‌లకు సపోర్ట్ చేసే సిస్టమ్ ఉంది. Snapdragon 8 Elite AI పవర్డ్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ కూడా ఉంది. 6000mAh బ్యాటరీతో 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఇవే ఫీచర్స్ ఐక్యూ నియో 10Rలో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.
iQOO Neo 10R Features –
స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను 144Hz రిఫ్రెష్ రేట్‌తో రాబోతున్నట్లు సమాచారం. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్ ఉంటుందని.. 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇందులో 50 MP Sony LYT-600 సెన్సార్, 8 Mp అల్ట్రా వైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండే ఛాన్స్ ఉందని సమాచారం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉండొచ్చు. బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,400mAh బ్యాటరీతో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. iQOO Neo 10R రూ. 30,000 సెగ్మెంట్ లో ఉంటూ Poco X7 Pro, Redmi Note 14 Pro+ తో పోటీపడే ఛాన్స్ ఉంటుందని టెక్ వర్గాల అంచనా.
ALSO READ : రూ.లక్షలోపు టాప్ 4 మెుబైల్ ఇవే!