Crime Thriller OTT: 2024 మలయాళ ఇండస్ట్రీ నుంచి థియేటర్లలోకి వచ్చిన సినిమాలు అన్ని మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఎక్కువగానే దర్శనం ఇచ్చాయి. అందులో కొన్ని సినిమాలు థియేటర్లలో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం ఓటీటీలో మంచి వ్యూస్ ను అందుకున్నాయి. ఇక ఇటీవల కాలంలో ఓటీటీ సంస్థల్లో సస్పెన్స్ మూవీలకు కొదవలేదు. ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఓటీటీ సంస్థలు తమ యూజర్స్ కు సరికొత్త కంటెంట్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తుంది. తాజాగా అలాంటి సస్పెన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ వచ్చేస్తుంది. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ చూడొచ్చు అనే వివరాలను ఒకసారి తెలుసుకుందాం..
మూవీ & ఓటీటీ..
మాలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కొదవ లేదు.. గతంలో రొమాంటిక్ సినిమాలకు యూత్ ఆసక్తి కనబరిచేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం క్రైమ్ స్టోరీ మూవీలను, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మూవీ లవర్స్.. దాంతో ఈ మధ్య అలాంటి స్టోరీలతోనే ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. ఈ ఏడాది తొలి మలయాళ మూవీగా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న చిత్రం ‘ రేఖా చిత్రం ‘.. ఈ మూవీ కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటుగా ఎటువంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడంతో సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి.. ఆసిఫ్ అలీ హీరోగా నటించిన ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యామియో రోల్ చేశారు. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించారు.. ఈనెల 9వ తేదీన ఈ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ వివరాలు వెలువడ్డాయి.. ప్రముఖ ఓటిటి సంస్థ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. త్వరలోనే అధికార ప్రకటన రానందని సమాచారం..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..
ఈ చిత్రంలో హాలీవుడ్ లోని ప్రముఖ నటులు నటించారు. ఈ సినిమా స్టోరీ మొత్తం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పైనే ఉంటుంది. 40 ఏళ్ల క్రితం జరిగిన ఓ నేరంతో చనిపోయిన వ్యక్తికి లింక్ ఉంటుంది. 1985 లో ఓ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ బాలిక మిస్ అయిన కేసును కూడా వివేక్ ఇప్పుడు దర్యాప్తు చేస్తాడు. ఈ క్రమంలో చాలా ట్విస్టులు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? రెండు కేసులకు లింక్ ఏంటి? అనేది మూవీ స్టోరీ.. ఇక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రేఖాచిత్రం మూవీని తెరకెక్కించారు జోఫిన్. ప్రస్తుతం కాలంతో పాటు 1985ల బ్యాక్‍డ్రాప్ కూడా కథలో ఉంటుంది. ట్విస్టులతో సాగే కథనంతో మెప్పించారు. ఈ సినిమాను కావ్య ఫిల్మ్ కార్పొరేషన్, అన్ మెగా మీడియా పతాకాలపై వేణు కున్నప్పిలి నిర్మించారు.. థియేటర్లలో బాగానే ఆకట్టుకునే సినిమా ఇక ఓటీడీలో ఎలాంటి టాక్ ని అందుకుంటుందో చూడాలి..