Game Changer: ఎన్నో అంచనాలతో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ తరువాత చరణ్ గ్లోబల్ స్టార్ గా మారాడు. ఇక దాని తరువాత వస్తున్న చిత్రం కావడం ఒకటి.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించడం ఇంకొకటి కావడంతో గేమ్ ఛేంజర్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అప్డేట్ లేట్ అయినా కూడా మేకర్స్ పై బూతులు తిడుతూ అప్డేట్స్ ను తెప్పించేవారు. అంతలా ఎదురుచూసిన సినిమా జనవరి 10 న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది.
ఆ కథ ఏంటో.. శంకర్ టేకింగ్ ఏంటో.. అసలు ఏమి అర్ధం కానీ పరిస్థితి. అవుట్ డేట్ కథ అని కొందరు.. సినిమా బావుంది కానీ.. ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు అని ఇంకొందరు. అసలు కథ ఏమి లేదని మరికొందరు ఇలా ట్రోల్స్ తోనే సగం అటకెక్కించారు. ఇక మిగతా సగం ఫైరసీతో అటకెక్కింది. సినిమాథియేటర్ లో ఉండగానే బస్సులో, ఆన్ లైన్ లో లీక్ అయ్యింది. అంతేనా లోకల్ ఛానెల్స్ లో ఫ్రీగా గేమ్ ఛేంజర్ సినిమాఅంటూ స్ట్రీమింగ్ చేసేశారు. ఈ నెగిటివిటీ వలన గేమ్ ఛేంజర్ భారీ పరాజయాన్ని అందుకుంది.. నిర్మాత దిల్ రాజు ఎంత నష్టపోయాడో చెప్పడానికి కూడా మాటలు లేవు.
Trisha Krishnan: స్టార్ హీరోతో ఎఫైర్.. పొలిటికల్ ఎంట్రీ కోసమా.. ఎంత పెద్ద స్కెచ్.. ?
ఇక ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా ఫైరసీ చేసినవారిని మాత్రం అస్సలు వదలకూడదని మేకర్స్ గట్టిగా నిర్ణయించుకొని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. లోకల్ ఛానెల్స్, బస్సులో గేమ్ ఛేంజర్ సినిమాను ప్లే చేసినవారిపై చర్యలుతీసుకున్నారు . అయితే అసలు ఫైరసీ ఎక్కడ నుంచి జరిగింది. థియేటర్ లో నుంచి లీక్ అయితే వెనుక సౌండ్స్ కానీ, మనుషులు కానీ.. కొద్దిలో కొద్దిగా స్క్రీన్ అయినా కనిపించాలి. కానీ, అవేమి లేకుండా HD ప్రింట్ లీక్ అవ్వడంతో ఎన్నో అనుమానాలు తలెత్తాయి.
ఇక ఆ అనుమానాలకు సమాధానంగా గేమ్ ఛేంజర్ ఫైరసీ లీక్ ఎక్కడనుంచి అయ్యిందో తెలిసిపోయిందని నెటిజన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్ లో లీక్ అవ్వలేదు.. ఏకంగా ఎడిట్ రూమ్ నుంచే లీక్ అయ్యింది. ఇది చిత్ర బృందంలో ఉన్నవారి వలనే సాధ్యం అవుతుంది అని ధృడంగా చెప్పుకొస్తున్నారు.
ఫైరసీ ప్రింట్ లో కొన్ని చోట్ల సౌండ్ మిక్సింగ్ లేకపోవడం, డబ్బింగ్ లేకపోవడం, సాంగ్స్ మ్యూజిక్ లేకపోవడం లాంటివి గమనించి వాటిని సాక్ష్యాలుగా నెటిజన్స్ చూపిస్తున్నారు. ఎడిట్ రూమ్ నుంచే గేమ్ ఛేంజర్ ఫైరసీ లీక్ అయ్యిందని చెప్పడంతో అంత నీచానికి దిగజారిన వారిని ఊరికే వదిలేయకూడదని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే పోలీసులు ఆ నిందితులను పట్టుకొని అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.