ISRO GSLV-F15: ఈ సొసైటీని, మానవ ప్రపంచాన్ని.. ఏటికేడు మరింత ముందుకు తీసుకెళ్లేది సాంకేతికతే. ఈ వరల్డ్ ఎవల్యూషన్‌లో.. టెక్నాలజీదే రెవల్యూషన్. దాని వల్లే.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం. అంతులేని టెక్నాలజీతో భవిష్యత్‌లో మరింత ముందుకెళ్తాం. ఇప్పటికే.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్.. ఇలా అన్ని రంగాల్లో టెక్నాలజీదే కీ రోల్. అరచేతికి అందే మొబైల్ అయినా.. అందనంత ఎత్తులో ఉన్న అంతరిక్షంలోని శాటిలైట్ అయినా.. ప్రతీది టెక్నాలజీతోనే ముడిపడి ఉంది.
స్వదేశీ పరిజ్ఞానంతో స్పేస్ డాకింగ్ మిషన్ చేపట్టడం ఇస్రో సరికొత్త వ్యూహాలకు అద్దం పడుతోంది. ఇందులో భాగంగానే, స్పేడెక్స్ మిషన్ కాన్సెప్ట్ నుండి మిషన్‌లో వాడుతున్న కొత్త సాంకేతికతలు, డాకింగ్ మెకానిజం వంటి కీలక అంశాల్లో ఇస్రో వంద శాతం సక్సెస్ సాధించింది. ఇక ఇప్పటికే నాసా వంటి ప్రఖ్యాత సంస్థలు కూడా ఇస్రోతో కలిసి పనిచేయాడానికి ఆసక్తి చూపుతున్న తరుణంలో ఈ విజయం భవిష్యత్ భారత అంతరిక్ష ప్రయోగాల్లో వేగాన్ని మరింత పెంచనుంది.
గతేడాది డిసెంబర్ 18న, గగన్‌యాన్ మిషన్ మొదటి అన్‌క్రూడ్ ఫ్లైట్ కోసం, హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్-3ని అసెంబుల్ చేయడం ప్రారంభించారు. ఇది కూడా సక్సెస్ అయింది. ఇస్రో, తన 100వ రాకెట్ ప్రయోగంతో మరో అద్భుతమైన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి సిద్ధమయింది.
కొత్త సంవత్సరం మొట్ట మొదటి కీలక రాకెట్ మిషన్ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఇస్రో.. తాజాగా మరో రికార్డుకు అడుగు దూరంలో ఉంది. కేవలం కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 29 ఉదయం 6:23 గంటలకు 6:23 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. రాకెట్ ద్వారా దేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ లో భాగంగా ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపిస్తుంది.
Also Read: చాట్ జీపీటీపై గ్లోబల్ పబ్లిషర్స్ దావా.. కంటెంట్ కాపీపై చేస్తుందంటూ ఆరోపణ
ఈ ప్రయోగం ద్వారా నావిక్ వ్యవస్థకు సంబంధించిన ఈ ఉపగ్రహం దేశంలోని విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది.ఈ ప్రయోగం ఇస్రోకి 100వ రాకెట్ ప్రయోగంగా గుర్తింపు పొందడంతో, షార్‌లో వివిధ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే జిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగ పరంపరలో ఈ ప్రయోగం 17వది కాగా.. GSLV F15 రాకెట్ ప్రయోగం ఇస్రోకు ఈ ప్రయోగంతో 100వ ప్రయోగం కానుంది. దీంతో ఇస్రో మరో మైలురాయిని దాటనుంది.
ఈ ప్రాజెక్టులో ముగ్గురు వ్యోమగాములను 400 కి.మీ దూరంలోని కక్ష్యలోకి ప్రవేశపెడతారు. మూడు రోజల పరిశోధనల అనంతరం సురక్షితంగా భూమి మీదకు తీసుకొస్తారు. అయితే, ఈ ప్రయోగాలన్నింటికీ స్పేడెక్స్ మిషన్ ఒక కీలక సాంకేతికతను అందించింది.