BigTV English
Advertisement

Human Trafficking Case: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు.. తెలుగు వారిపై అభియోగాలు.. వెనక్కి తీసుకున్న యూఎస్ పోలీసులు..

Human Trafficking Case: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు.. తెలుగు వారిపై అభియోగాలు.. వెనక్కి తీసుకున్న యూఎస్ పోలీసులు..

Human Trafficking Case: యూఎస్ లోని న్యూజెర్సీ స్టేట్‌లో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో నలుగురు తెలుగువాళ్లను 2024 జులైలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. ఫేక్ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పనులు చేయించారని వారిపై ఆరోపణలు వచ్చాయి . అయితే తాజాగా ఆ నలుగురు తెలుగువాళ్లపై యూఎస్ పోలీసులు అభియోగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే..


గతేడాది మార్చి నెలలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ప్రిన్సిటన్ అనే ప్రాంతంలో ఓ ఇంట్లో 15 మంది మహిళలను గుర్తించారు. వారందని అక్రమంగా యూఎస్ తీసుకుని వచ్చి బలవంతంగా పనులు చేయించారని.. వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందంటూ.. మనుషుల అక్రమ రవాణా కేసు కింద తెలుగు వాళ్లపై కోర్టులో కేసు నమోదు అయింది. ఈ కేసులో చందన్ దశిరెడ్డి, సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా, అనిల్ మలెగా ను టెక్సాస్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో వారిపై పోలీసులు దాడులు కూడా నిర్వహించారు. అయితే ఈ కేసుపై ప్రిన్సిటన్ పోలీసులు కొద్ది రోజుల క్రితం తమ అభియోగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అటార్నీ కార్యాలయానికి లేఖ రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అయితే .. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో చిక్కుకున్న 15 మంది మహిళలు ఓ మీడియాతో మాట్లాడుతూ.. తమను అక్రమంగా తీసుకొచ్చినట్లు గానీ, బలవంతంగా పనులు చేపించినట్లు గానీ చెప్పలేదు. దీంతో పోలీసులు తమ అభియోగాలను వెనక్కితీసుకున్నట్లు తెలుస్తోంది. డాలస్ న్యూస్ అనే వెబ్ సైట్ కొద్ది రోజుల క్రితం ఈ కథనాన్ని ప్రచురించింది. ఈ నలుగురు తెలుగువాళ్లపై అరెస్టు వారంట్లు జారీ చేసినప్పుడు బహిరంగా మీడియా ముందు ప్రకటన చేసిన ప్రిన్సిటన్ పోలీసులు.. ఇప్పుడు మాత్రం ఈ కేసు వివరాలను బయటకు చెప్పుకోలేదు. దీంతో పోయిన పరువును ఆ నలుగురు తెలుగువాళ్లకు ఎవరు తిరిగి ఇస్తారు అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.


Also Read: అమెరికాలో భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు.. ట్రంప్ నిర్ణయాలే కారణమా?

అమెరికా ప్రిన్సిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ ఆరోపణలను ఎత్తివేసినట్లు, అరెస్టు వారెంట్లను తిరిగి పొందారని బహిరంగంగా చెప్పలేదని వెల్లడించింది. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఒకరు ఈ విషయాన్ని తెలిపినట్లు కథనంలో ప్రచురింపబడింది. అయితే నలుగురు తెలుగువాళ్లపై ఆరోపణలు అవాస్తవమని తేలిన తరువాత .. ఆ విషయం ప్రిన్స్‌టన్ పోలీసులు బహిరంగంగా చెప్పాలని వారి తరఫు న్యాయవాది కోరినట్లు తెలుస్తోంది.

 

Related News

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

Big Stories

×