Presidential Awards to Mother Son | భారత సైన్యంలో తొలిసారి ఇద్దరు తల్లి, కొడుకు రాష్ట్రపతి ప్రత్యేక అవార్డులకు ఎంపికయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ సాధన ఎస్.నాయర్(Sadhana Nair) , స్క్వాడ్రన్ లీడర్ తరుణ్ నాయర్ (Tarun Nair).. రాష్ట్రపతి అవార్డులకు ఎంపికయ్యారు. ఒకే ఏడాది తల్లీ కొడుకులు రాష్ట్రపతి అవార్డులకు ఎంపికవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. సాధనను అతి విశిష్ట్ సేవా మెడల్, తరుణ్‌ను వాయు సేన మెడల్(గ్యాలంట్రీ) అవార్డు వరించింది. వీరిద్దరూ అవార్డులకు ఎంపిక కావడం ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కు గర్వకారణం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 93 మంది సైనికులకు పురస్కారాలను ప్రకటించారు.
లెఫ్టినెంట్ జనరల్ సాధన ఎస్.నాయర్ భారత సైన్యంలో తన నాయకత్వంలో అత్యద్భుత సేవలు కనబర్చినందుకు గుర్తిస్తూ ఆమెకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతి విశిష్ట్ సేవా మెడల్ ప్రదానం చేయనున్నారు. మరోవైపు ఆమె తనయుడు స్క్వాడ్రన్ లీడర్ తరుణ్ నాయర్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తరపున యుద్ధ సమయంలో చూపిన ధైర్య సాహసాలకు ప్రతీకగా ఆయనకు వాయు సేన మెడల్ (గ్యాలంట్రీ) అవార్డు లభించనుంది.
ఒకే సంవత్సరంలో తల్లి, కొడుకు అవార్డు సాధించిడంతో అరుదైన రికార్డ్ సాధించారు. వీరివురూ దేశ రక్షణ రంగంలో చేసిన త్యాగాలు, అద్భుత సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డులు లభిస్తున్నాయి. వీరి సేవలను రాబోయే తరాలకు ఆదర్శాలు.
Also Read: భారతీయుల ప్రాణాలు కాపాడిన పాక్ అధికారి.. ఉత్తమ పౌరపురస్కారంతో సన్మానం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 93 మంది భారత సైనికులు, కేంద్ర ఆర్మ్‌డ్ పోలీసు బలగాలకు గ్యాలంట్రీ అవార్డులు ప్రకటించారు. వీటిలో రెండు కీర్తి చక్రాలు, 14 శౌర్య చక్రాలు ఉండడం విశేసం. వీరందరూ దేశ రక్షణ కోసం ధైర్య సాహసాలు, అద్భుత సేవలు కనబర్చిన వారు.
కీర్తి చక్ర అవార్డ్
ప్రతిష్టాత్మక కీర్తి చక్ర అవార్డ్.. భారతదేశంలో రెండో అతిపెద్ద శాంతి గ్యాలెంట్రీ అవార్డ్. ఈ సారి రెండు కీర్తి చక్రా అవార్డులకు సైన్యంలోని 22 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన మేజర్ మంజీత్ సింగ్, 28 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన స్వర్గీయ నాయక్ దిల్వర్ ఖాన్ ని యుద్ధ సమయంలో వారు చూసేన త్యాగాలకు గుర్తింపుగా ఎంపిక చేశారు.
శౌర్య చక్ర అవార్డుల జాబితా
2025లో 14 మంది శౌర్య చక్ర అవార్డ్ లకు ఎంపికయ్యారు. వీరిలో ముగ్గురు అమరవీరులు కావడం గమనార్హం.
మేజర్ ఆశిష్ దహియా (50 రాష్ట్రీయ రైఫిల్స్)
మేజర్ కునాల్ (1 రాష్ట్రీయ రైఫిల్స్)
మేజర్ సతేందర్ ధంకర్ (4 రాష్ట్రీయ రైఫిల్స్)
కెప్టెన్ దీపక్ సింగ్ (48 రాష్ట్రీయ రైఫిల్స్, మరణానంతరం)
అసిస్టెంట్ కమాండెంట్ ఎషెంతుంగ్ కికాన్ (4 అస్సాం రైఫిల్స్)
సుబేదార్ వికాస్ తోమర్ (1 పేరా)
సుబేదార్ మోహన్ రామ్ (20 JAT రెజిమెంట్)
హవల్దార్ రోహిత్ కుమార్ (డోగ్రా, మరణానంతరం)
హవల్దార్ ప్రకాష్ తమంగ్ (32 రాష్ట్రీయ రైఫిల్స్)
ఫ్లైట్ లెఫ్టినెంట్ అమన్ సింగ్ హన్స్
కార్పోరల్ దభి సంజయ్ హిఫ్ఫాబాయి ఎస్సా
విజయన్ కుట్టి జి (మరణానంతరం)
విక్రాంత్ కుమార్, డిప్యూటీ కమాండెంట్ (సిఆర్‌పిఎఫ్)
ఇన్‌స్పెక్టర్ జెఫ్రీ హ్మింగ్‌చుల్లో (సిఆర్‌పిఎఫ్)
అదనపు గ్యాలంట్రీ అవార్డులు
రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటిన ప్రకారం.. ఆర్మ్‌డ్ ఫోర్సెస్, ఇతర విభాగాలక చెందిన 305 మందిని రాష్ట్రపతి ముర్ము అవార్డులు ప్రదానం చేయనున్నారు. వీటిలో
30 పరమ విశిష్ట సేవా పతకాలు
ఐదు ఉత్తమ్ యుద్ధ సేవా పతకాలు
57 అతి విశిష్ట సేవా పతకాలు
10 యుద్ధ సేవా పతకాలు
66 సేన పతకాలు (శౌర్యం), మరణానంతరం ఏడు సహా
రెండు నావో సేన పతకాలు (శౌర్యం)
ఎనిమిది వాయు సేన పతకాలు (శౌర్యం)
వీటికి అదనంగా 43 సేన పతకాలు, 8 నవ్ సేన పతకాలు, 15 వాయ సేన పతకాలు ఉన్నాయి.