E-Paper
Advertisement

Japan ispace:- చంద్రుడిపై ప్రైవేట్ సంస్థ ప్రయోగం.. చివరికి..

Japan ispace:- చంద్రుడిపై ప్రైవేట్ సంస్థ ప్రయోగం.. చివరికి..
Advertisement

Japan ispace:- సైన్స్ అండ్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాదు.. ప్రైవేట్ రంగాలు కూడా పలు పరిశోధనలు చేసే విషయంలో ఆసక్తి చూపిస్తున్నాయి. నేరుగా పరిశోధనల్లో పాల్గొనలేకపోయినా.. పెట్టుబడి రూపంలో ఏదో ఒక విధంగా పరిశోధనలకు సహాయపడుతున్న ప్రైవేట్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. అలాగే మూన్‌పై అడుగుపెట్టాలనుకున్న ఒక ప్రైవేట్ సంస్థ కలలు నిజం కాకుండా పోయాయి.

గత కొన్నేళ్లలో స్పేస్ సెక్టార్‌లో ప్రైవేట్ సంస్థల హస్తం విపరీతంగా పెరిగిపోయింది. స్పేస్ టూరిజం విషయంలో కూడా ప్రభుత్వాలకు పోటీగా ప్రైవేట్ సంస్థలు తమ సత్తాను చాటాలనుకుంటున్నాయి. ఒకవైపు ప్రపంచ దేశాల పరిశోధకులు పరిశోధనలు చేస్తుంటే.. మరోవైపు ప్రైవేట్ సంస్థలు కూడా తమకు ఉన్న వనరుతోనే పరిశోధనలు చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నాయి. జపాన్‌కు చెందిన ఐస్పేస్ కూడా అలాగే చేసింది. కానీ తమ అతిపెద్ద మెషీన్‌లో విఫలమయ్యింది.

Advertisement

చంద్రుడిపై ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మూన్ గురించి కొత్త కొత్త విషయాలు కనిపెట్టాలని, అవి ప్రజలకు చెప్పాలని అందరూ బిజీగా పరిశోధనల్లో నిమగ్నమయున్నారు. ఐస్పేస్ కూడా అలాగే మూన్‌పై పరిశోధనలు చేయడం కోసం ఒక స్పేస్‌క్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది. కానీ ల్యూనార్ నేలపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధ్యం కాక ఈ స్పేస్‌క్రాఫ్ట్ క్రాష్ అయిపోవడంతో ఐస్పేస్ ఉద్యోగులతో పాటు యాజమాన్యం కూడా తీవ్ర దు:ఖంలో ఉన్నారు.

ప్రైవేట్ సంస్థలు అనేవి స్పేస్ పరిశోధనలు చేసి ఫెయిల్ అయిపోవడం ఇదేమీ మొదటిసారి కాదు. 2019లో ఇజ్రాయెల్‌కు చెందిన ఒక సంస్థ బేర్‌షీట్ అనే మెషీన్ కోసం దాదాపు 100 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. అది కూడా పలు సాంకేతిక కారణాల వల్ల ల్యూనార్ నేలపైనే క్రాష్ అయిపోయింది. ఇలాగే ప్రభుత్వ సంస్థలు చేసిన పరిశోధనల్లో కూడా చంద్రుడిపై స్పేస్‌క్రాఫ్ట్స్ క్రాష్ ల్యాండింగ్స్ అనేవి తరచుగా జరుగుతూనే ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తుచేసుకున్నారు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×