BigTV English

Pan Card:-  పాన్ కార్డ్ ఎందుకు ఇంపార్టెంట్.. ఎలా అప్లై చేసుకోవాలి?

Pan Card:-  పాన్ కార్డ్ ఎందుకు ఇంపార్టెంట్.. ఎలా అప్లై చేసుకోవాలి?

Pan Card:- ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్.. మీకంటూ శాశ్వతంగా కేటాయించే సంఖ్యే పర్మినెంట్ అకౌంట్ నెంబర్. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌కు పాన్ కంపల్సరీ. ఐటీ చెల్లిస్తేనే హౌసింగ్ లోన్స్, కార్ లోన్స్ వస్తాయి. అంతవరకు ఎందుకు బ్యాంకుల్లో 50వేలకు మించి ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా సరే పాన్ కార్డ్ తప్పనిసరి. బంగారం షాపుల్లో 50వేలకు మించి గోల్డ్ కొన్నా సరే పాన్ కార్డ్ ఇవ్వాల్సిందే. కొన్నింట్లో లక్ష రూపాయలకు అడుగుతారు. మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది, మీ ఫైనాన్షియల్ పర్ఫామెన్స్ రికార్డ్ అయ్యేది కూడా పాన్ కార్డ్ ఆధారంగానే. చివరికి పర్సనల్ లోన్స్ ఇవ్వాలన్నా కూడా పాన్ కార్డ్ అడుగుతారు. అందుకే, పాన్ కార్డ్ కంపల్సరీ.


స్థిర ఆస్తులు లేదా వాహనాల కొనుగోలు, లేదా హోటళ్లు, రెస్టారెంట్‌లకు 25వేల రూపాయలకు పైబడి చేసే చెల్లింపులు, లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు పాన్ సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకులో లేదా పోస్టాఫీసులో 50,000 రూపాయలకు పైబడిన డిపాజిట్లకు కూడా పాన్ మస్ట్. ఒకే వ్యక్తికి రెండు పాన్ కార్డులు ఉండడం చట్ట విరుద్ధం.

కొత్తగా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయాలనే రూల్ వచ్చింది. ఇప్పుడైతే వెయ్యి రూపాయలు కట్టి మరీ లింక్ చేయించుకోవాలి. ఒకవేళ ఆధార్‌తో లింక్ కాకపోతే.. మీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది.


పాన్ కార్డ్ కోసం 49ఏ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీటిని incometaxindia. gov. in, utiisl. co. in లేదా tin. nsdl. com నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే, జిరాక్స్ సెంటర్స్, మీసేవాలలో కూడా దొరుకుతాయి.

ఇప్పుడు ఆన్‌లైన్లోనూ అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డులో మార్పులు చేసుకోవాలన్నా కూడా ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్, పాన్ లింక్‌కు కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్ సైట్ ద్వారానే చేసుకోవచ్చు. 

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×