E-Paper
Advertisement

అప్పుడు గాజులు గలగల.. ఇప్పుడు అయ్యప్ప మాల.. మళ్లీ వచ్చేసిందే!

అప్పుడు గాజులు గలగల.. ఇప్పుడు అయ్యప్ప మాల.. మళ్లీ వచ్చేసిందే!
Advertisement

Gajula Galagala:రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య అంటే అంత ఈజీగా గుర్తుపట్టరేమో కాని గాజులు గల గల సింగర్ అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు.ఆ పాట ఓవర్ నైట్ లో కొట్టేసిన క్రేజ్ అలాటింది మరి.అవును ..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఏకంగా ఒక రాత్రిలోనే వన్ మిలియన్ వ్యూస్ కొల్లగొట్టడం అంటే అంత ఆషామాషీ కాదు మరి.ఇక ఇప్పటికి ఈ పాట 25 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది కూడా.అయితే ఈ పాటతో రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య ఎంత పేరు తెచ్చుకుందో అంతకు మించి వివాదాల్ని సొంతం చేసుకుంది .

ఎవ్వరి మాలలు అంటూ సరికొత్త పాట

Advertisement

ఇక ఇదిలా ఉంటె ఎవరేమన్నా అసలెక్కడా తగ్గను అంటూ ఇపుడు మరోసారి ఎవ్వరి మాలలు అంటూ సరికొత్త పాటతో ఆడియన్స్ ముందుకు వచ్చింది.అయితే ఈ సారి నటించకుండా కేవలం స్టూడియో వెర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు. చూడాలి మరి గాజులు గల గల అంటూ వీడియోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ రాధమ్మ కూతురు అయ్యప్ప మాలతో ఏమైనా వీడియో వదులుతుందేమో.

ఇక పాట విషయానికి వస్తే..ఎవ్వరి మాలలు ,అయ్యప్ప మాలలు..ఎవ్వరి దీక్షా ..అయ్యప్ప దీక్షా అంటూ అచ్చం సూపర్ హిట్ అయిన గాజులు గల గల పాటలాగే ఈ పాటని కూడా పాడటం గమనార్హం.ఆకుల సందీప్ పదాలు అందించిన ఈ పాటకి రమేష్ తుడిమల్ల సంగీతాన్ని అందించారు.

Advertisement

ఇక విహా ఫోక్స్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ పాట ఇలా నెట్టింట వదిలారో లేదో మరోసారి తమ ట్రోల్స్ కి పని పెట్టారు నెటిజన్లు. కొంత మంది పాట బాగుంది కాని రాధమ్మ కూతురు గొంతు దీనికి సరిపోలేదు అంటే, కేవలం ఎదో రీల్స్ కోసమో ,లేక సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసమో చేసినట్టు ఉంది కానీ మొహం లో అసలే మాత్రం భక్తి భావం లేదంటూ మరికొందరు ఎకి పారేస్తున్నారు.

అయ్యప్ప మాల మీద పడ్డావా తల్లి

ఇంకొంతమంది చాలా మంది లెజెండ్ సింగర్స్ ఉండగా అసలు ఈ రాధమ్మ కూతురుతో పాడించడం ఏంటి అంటూ పెదవి విరుస్తున్నారు.అలాగే అప్పుడు గాజులు గల గల అంటూ హడావిడి చేశావు.ఇప్పుడు అయ్యప్ప మాల మీద పడ్డావా తల్లి? అంటూ ట్రోల్ చేస్తున్నారు.అయితే వీరిలో పాట బాగుంది, ఇంకా సాధన చేస్తే మరింత బాగా పాడే అవకాశం ఉంటుంది అంటూ సపోర్ట్ చేస్తూ కామెంట్స్ కూడా పెట్టడం విశేషం.

ALSO READ:పూజా నాగేశ్వర్ డాన్స్ చేసిన టాప్ 5 సాంగ్స్.. ఇదెక్కడి క్రేజ్ రా మావా!

మొతానికి గాజులు గల గల తెచ్చిన క్రేజ్ తోనే ఈ అయ్యప్ప మాలలు అనే పాటకి శ్రీకారం చుట్టినట్టు క్లియర్ గా అర్థమవుతుంది.అయితే ఆ పాట దూసుకుపోయినట్టు ఈ పాట అంతలా రీచ్ లేకపోవడం గమనార్హం.చూడాలి మరి ముందు ముందు ఏమైనా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.ఏది ఏమైనా ఎవరెన్ని ట్రోల్స్ ,కామెంట్స్ చేసినా ఎక్కడా తగ్గకుండా ఒకవైపు ఫోక్ సాంగ్స్, మరో వైపు భక్తి పాటలంటూ దూసుకుపోతున్న రాధమ్మ కూతురిని మెచ్చుకొని తీరాల్సిందే!

Tags

Related News

పూజా నాగేశ్వర్ డాన్స్ చేసిన టాప్ 5 సాంగ్స్.. ఇదెక్కడి క్రేజ్ రా మావా!

ఈశ్వర్ సాయితో వివాదం.. మాధురి రాథోడ్ కి కలిసొచ్చిందా?

4 నెలలుగా సంతోషంగా ఉన్నా.. అనసూయ వీడియో వైరల్!

ఢీ 21 షో విన్నర్ గా ఆర్నాల్డ్ మునిగల్..ప్రైజ్ మనీ ఎంతంటే?

నర్మద ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్ న్యూస్ చెప్పిన శ్రీవల్లి.. ధీరజ్ ఫుల్ హ్యాపీ.. దీపావళి సంబరాలు షురూ..

Podarillu Today Episode : నారాయణ మాటతో మహా ఫుల్ హ్యాపీ.. మాధవ్ ను ఆడుకున్న తమ్ముళ్లు.. పాపం చక్రీ..

Big Stories

Advertisement
×