Best boAt earbuds 2026: ప్రస్తుతం మన రోజు వారీ జీవితంలో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ఒక భాగమైపోయాయి. ఆఫీస్ మీటింగ్స్ అయినా.. జిమ్‌లో వర్కవుట్స్ అయినా, ప్రయాణాల్లో.. పాటలు వినాలన్నా మంచి సౌండ్ క్లారిటీ, రోజంతా వచ్చే బ్యాటరీ బ్యాకప్ ఉండాల్సిందే. అందుకే తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు అందించే బోట్ కంపెనీ ఈ ఏడాది అదిరిపోయే లేటెస్ట్ ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హైబ్రిడ్ ANC, డాల్బీ ఆడియో, ఏకంగా 120 గంటల ప్లేబ్యాక్ ఇచ్చే 5 బెస్ట్ ఇయర్‌బడ్స్, వాటి ధరల వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మీకు తరచూ ఛార్జింగ్ పెట్టే తలనొప్పి అస్సలు ఉండకూడదు అనుకుంటే ఈ మోడల్ కళ్లు మూసుకుని తీసుకోవచ్చు. ఇందులో ఏకంగా 120 గంటల టోటల్ ప్లేబ్యాక్ టైమ్ లభిస్తుంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే వారం రోజుల పాటు నిశ్చింతగా వాడుకోవచ్చు. అంతేకాకుండా..అప్‌డేటెడ్ వెర్షన్‌లో 50dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ , 12mm డైనమిక్ డ్రైవర్స్, బ్లూటూత్ 6.1 సపోర్ట్ ఇచ్చారు. బయట ఎంత ట్రాఫిక్ సౌండ్ ఉన్నా అవతలి వారికి మీ వాయిస్ చాలా క్లియర్‌గా వినిపిస్తుంది.
ధర:రూ.2,399.
సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎక్కువగా చూసేవారికి.. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బడ్జెట్ ధరలోనే ఇందులో డాల్బీ ఆడియో, 24-బిట్ స్పేషియల్ ఆడియో ఫీచర్లను అందించారు. 11mm డ్రైవర్స్ ఉండటం వల్ల.. మ్యూజిక్ వింటున్నప్పుడు ప్రతి బీట్ స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో.. 4 AI-ENx మైక్స్ ఉండటం వల్ల కాల్ క్లారిటీ అద్భుతంగా.. ఉంటుంది. బ్యాటరీ విషయానికొస్తే.. 45 గంటల ప్లేబ్యాక్ వస్తుంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే ..4 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చు.
ధర: రూ.1,599.
ఈ ఏడాది బోట్ నుంచి వచ్చిన లేటెస్ట్ హిట్ మోడల్స్‌లో ఇది ఒకటి. ఇందులో ..48dB హైబ్రిడ్ ఏఎన్సీ ఫీచర్ ఉంది. ఇది బయటి సౌండ్స్‌ను దాదాపుగా కట్ చేస్తుంది. ఆఫీస్ కాల్స్ కోసం ఏకంగా.. 6 మైక్స్ తో దీనిని ఉపయోగించారు. దీని వల్ల గాలి వీస్తున్నా లేదా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మాట్లాడుతున్నా.. కాల్ క్వాలిటీ సూపర్‌గా ఉంటుంది. 12mm డ్రైవర్స్‌తో పాటు 50 గంటల బ్యాటరీ బ్యాకప్, మల్టీపాయింట్ కనెక్టివిటీ (ఒకే సారి ల్యాప్‌టాప్, ఫోన్‌కు కనెక్ట్ చేసుకునే వీలు) దీని ప్రత్యేకత.
ధర:రూ.2,199.
మీ బడ్జెట్ కొంచెం ఎక్కువగా ఉండి, స్టూడియో లెవల్ ఆడియో క్లారిటీ కావాలనుకుంటే.. నిర్వాణ జెనిత్ ప్రో బెస్ట్ ఛాయిస్. ఇందులో హై-రెస్ ఆడియో, సపోర్ట్ ఉండటం వల్ల పాటల్లోని చిన్న చిన్న మ్యూజిక్ నోట్స్ కూడా క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తాయి. 50dB అడాప్టివ్ హైబ్రిడ్, 6 ఏఎన్సీ మైక్స్, 80 గంటల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌తో.. ఇది ప్రీమియం ఫీల్ ఇస్తుంది. గేమ్స్ ఆడేవారికి లో-లేటెన్సీ మోడ్ కూడా చాలా బాగా ఉపయోగ పడుతుంది.
ధర:రూ.3,199 నుంచి రూ.3,499 మధ్యలో లభిస్తోంది.
Also Read: రూ.1,999కే పవర్‌ఫుల్ బ్యాకప్..పాకెట్ సైజులోనే పవర్ బ్యాంక్
మంచి బేస్‌తో పాటు వోకల్స్ (పాటలోని సాహిత్యం) చాలా స్పష్టంగా వినిపించాలంటే.. డ్యూయల్ డ్రైవర్స్ ఉన్న ఇయర్ బడ్స్ తీసుకోవాలి. ఈ మోడల్‌లో 10mm డ్యూయల్ డ్రైవర్స్ ఉపయోగించారు. దీని వల్ల ఆడియో క్లారిటీ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. 40 గంటల బ్యాటరీ బ్యాకప్, స్పేషియల్ ఆడియో, IPX5 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో ఇది జిమ్ , ట్రావెలింగ్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.