Voice And Sms Only Plans : టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం ఆపరేటర్లకు ఇబ్బంది లేకుండా ఓన్లీ వాయిస్ (Only Voice Plans), మెసేజెస్ ప్లాన్స్ ను తీసుకురావాలని టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జియో (Jio), ఎయిర్టెల్ (Airtel).. తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్తూ బెస్ట్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చేశాయి.
ట్రాయ్ (TRAI) వినియోగదారుల కోసం నిర్దిష్ట ప్లాన్‌లను రూపొందించాలని మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో.. ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం వాయిస్ ఓన్లీ, డేటా ఓన్లీ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లు ప్రత్యేకంగా డేటా, వాయిస్ కాలింగ్ మాత్రమే ఉపయోగించే వినియోగదారుల కోసం అందుబాటులోకి వచ్చేశాయి. ఇక ఈ ప్లాన్స్ తో నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌లను ఎంచుకునేటప్పుడు డబ్బు ఆదా చేసుకోవడానికి వీలు ఉంటుంది. వాయిస్ కాల్‌ల కంటే ఎక్కువ డేటాను ఉపయోగిస్తుంటే ఎయిర్‌టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రీఛార్జ్ ప్లాన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.
Airtel voice-only recharge plans –
ఎయిర్‌టెల్ రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. ఇది అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు 900 SMSలను అందిస్తుంది. 84 రోజుల వ్యాలిడిటీతో చెల్లుబాటు అవుతుంది. అదనంగా ఈ ప్లాన్.. మూడు నెలల అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్ (apollo Membership), ఎయిర్‌టెల్ రివార్డ్స్ కింద ఉచిత హలో ట్యూన్ (Hello Tunes) సేవలను సైతం అందిస్తుంది. ఈ ప్లాన్ గతంలో రూ. 509 అయితే 6GB డేటాను అందించింది.
ఎయిర్టెల్ వాయిస్, SMS ప్రయోజనాలను మాత్రమే అందించే రూ.1959 ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో వినియోగదారులు 365 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే 3600 SMS సందేశాలతో పాటు అపరిమిత కాల్‌లను పొందుతారు. ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ రివార్డ్స్ కింద మూడు నెలల ఉచిత హలో ట్యూన్, అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ గతంలో రూ. 1,999కే అందుబాటులో ఉండగా.. ఇందులో 24GB డేటా, Xstream యాప్ ప్రయోజనాలు ఉండేవి.
Airtel data plans –
వాయిస్ కాల్స్, SMS, డేటాను కోరుకునే వినియోగదారుల కోసం ఎయిర్టెల్ రూ.548 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో కస్టమర్‌లు అపరిమిత వాయిస్ కాల్‌లు, 900 SMS, 7GB డేటాను పొందే ఛాన్స్ ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఇతర ప్లాన్‌ల మాదిరిగానే, వినియోగదారులు ఎయిర్‌టెల్ రివార్డ్స్ కింద మూడు నెలల ఉచిత అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, హలో ట్యూన్ సేవలను పొందే ఛాన్స్ ఉంది.
ఇక ఎయిర్టెల్ బెస్ట్ ఇయర్లీ ప్లాన్స్ సైతం అందుబాటులోకి తీసుకొచ్చేసింది. 365 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు, 30GB డేటా, 3600 SMSలను అందించే రూ.2249 ప్లాన్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. మూడు నెలల అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, ఉచిత హలో ట్యూన్‌ను కూడా అందిస్తుంది. ఇంతకుముందు ఈ ప్లాన్ ధర రూ. 1,999గా ఉండగా.. ఇప్పుడు 6GB అదనపు డేటాను అందిస్తుంది.
ALSO READ : చాట్ జీపీటీ డౌన్.. అసలు ఏం జరిగింది?